Sun Jul 20 2025 05:56:44 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: భారీ ప్రవాహాన్ని దాటుతున్న చిన్నారి భారతీయ విద్యార్ధిని కాదు, వీడియో మన దేశానికి చెందినది కాదు
భారతదేశ విద్యా వ్యవస్థ ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యతో సహా బహుళ స్థాయిలలో ఉంది.ఆధునిక భారతీయ విద్యా వ్యవస్థలో గణనీయమైన

Claim :
సరైన సదుపాయాలు భారత ప్రభుత్వం కల్పించకపోవడంతో స్కూలుకు వెళ్లే విద్యార్థిని ఎంతో ధైర్యంగా భారీ ప్రవాహాన్ని దాటుతూ ఉందిFact :
వైరల్ వీడియో భారతదేశానికి సంబంధించినది కాదు, కొలంబియా నుండి వచ్చింది. 2022 సంవత్సరంలో చిత్రీకరించారు
భారతదేశ విద్యా వ్యవస్థ ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యతో సహా బహుళ స్థాయిలలో ఉంది.ఆధునిక భారతీయ విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు జరుగుతున్నాయి. మరింత సమగ్రమైన, నైపుణ్య ఆధారిత విధానం వైపు కదులుతోంది. కేవలం బట్టీ పట్టీ చదవడమే కాకుండా ఆయా విషయాలను అర్థం చేసుకుంటూ ఉండడం, విమర్శనాత్మక ఆలోచన, ఆచరణాత్మక నైపుణ్యాలపై ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కొత్త విద్యా విధానం (NEP) 2020 లో భాగంగా ఎప్పటికప్పుడు పాఠ్యాంశాల విషయంలో మార్పులు, చేర్పులు చేయడం. ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య (ECCE) వ్యవస్థను ప్రవేశపెట్టడం, వృత్తి శిక్షణను ప్రోత్సహించడం ద్వారా మరింత ఆధునీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇంతలో, ఒక అమ్మాయి పాఠశాలకు వెళ్లడానికి ఓ తాడును ఉపయోగించి, చాలా ప్రమాదకరంగా నీటి ప్రవాహాన్ని దాటుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక భారతీయ అమ్మాయి ప్రమాదకరమైన రీతిలో నదిని దాటుతోందని, ఇది సంఘి-బిజెపి ప్రభుత్వం అణచివేసిన దేశంలోని అత్యంత క్లిష్టమైన సమస్యను చూపిస్తుంది. ప్రభుత్వానికి హిందూ-ముస్లిం ఉద్రిక్తతలను రేకెత్తించడానికి మాత్రమే సమయం ఉంది, మరేమీ లేదంటూ పోస్టులు పెట్టారు. “देश की सबसे जरूरी मुद्दा शिक्षा को दबाने के लिए संघी–भाजपा मिलकर रात दिन हिंदू मुस्लिम करते हैं।“ అంటూ హిందీలో పోస్టులను వైరల్ చేస్తున్నారు. భారతదేశంలోని ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టడంలో దృష్టి పెట్టింది కానీ, విద్యను అసలు పట్టించుకోవడం లేదని ఈ పోస్టులు చెబుతున్నాయి.
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఈ వీడియో భారతదేశానికి సంబంధించినది కాదు. ఇది కొలంబియా నుండి వచ్చిన వీడియో. మేము వీడియో నుండి కీఫ్రేమ్లను సంగ్రహించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ వీడియో 2022 సంవత్సరం నాటిదని, కొలంబియాలో రికార్డు చేశారని తెలిసింది.
నవభారత్ టైమ్స్లో ప్రచురించిన ఒక వార్తా కథనాన్ని మేము కనుగొన్నాము. వైరల్ వీడియోలో, ఒక అమ్మాయి పాఠశాలకు వెళ్లడానికి తన ప్రాణాలను పణంగా పెడుతున్నట్లు కనిపిస్తుంది. ఆమె నదిని దాటిన విధానాన్ని చూసి మీరు భయపడతారు. పిల్లల చదువుల పట్ల ఉన్న మక్కువను చూసి అందరూ ఆశ్చర్యపోతారని నివేదించారు. 26 సెకన్ల వీడియోలో, ఆ అమ్మాయి కప్పికి కట్టిన తాడును ఉపయోగించి నీటి ప్రవాహాన్ని దాటుతుంది. ఈ దృశ్యం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఎందుకంటే చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకం కావచ్చు. నదిలో నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది. అందులో పడిపోయిన తర్వాత బతుకుతామా లేదా అనే విషయమై ఎవరికీ ఎలాంటి క్లారిటీ ఉండదు. అయినప్పటికీ, విద్యార్థులు తమ చదువుల కోసం రిస్క్ తీసుకోవడంలో వెనక్కి తగ్గలేదు.
స్పానిష్ భాష లో ప్రచురించిన ఒక కధనం ప్రకారం, గ్రామీణ శాంటా మార్టాలోని ప్యూర్టో మస్కిటో పరిసరాల్లోని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రికార్డ్ చేసిన వీడియోలు విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లేటప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్ళను చూపుతాయి. పాఠశాలకు వెళ్లడానికి గైరా నదిని దాటుతున్న పిల్లలు వీరు. ఇది ప్యూర్టో మస్కిటో ప్రాంతంలో జరుగుతుంది. గైరా నదిని దాటడానికి నేసిన తాడు సహాయంతో పిల్లల బృందం ఒక బండరాయిపై నుండి దూకుతున్నట్లు ఫుటేజ్ చూపిస్తుంది. స్థానిక నాయకురాలు, వీడియోలను రికార్డ్ చేసిన వ్యక్తులలో ఒకరైన ఎరికా మెన్డోజా మాట్లాడుతూ "పరిస్థితి అలాగే ఉంది. నా పిల్లలు ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లాల్సిన దాని గురించి నేను మీకు నివేదిక పంపుతున్నాను." అని తెలిపారు. వైరల్ అయిన వీడియోలపై శాంటా మార్టా మేయర్ కార్యాలయం స్పందించింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి స్థానిక యంత్రాంగం ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది.
లాస్ నోటిసియాస్ డి టెలికారిబ్ అనే X ఖాతా స్పానిష్లో “#Magdalena Arriesgando sus vidas, niños y niñas de la vereda Puerto Mosquito en la ciudad de #SantaMarta, atraviesan colgados de una polea el río Gaira para asistir a clases. Líderes indígenas solicitan la construcción de un puente antes que ocurra una tragedia.” క్యాప్షన్తో అదే వీడియోను షేర్ చేసింది. తమ ప్రాణాలను పణంగా పెట్టి, శాంటామార్తా నగరంలోని ప్యూర్టో మస్కిటో గ్రామానికి చెందిన అబ్బాయిలు, అమ్మాయిలు తరగతులకు హాజరు కావడానికి గైరా నదిని దాటుతున్నారు. వంతెన నిర్మాణం కోసం స్థానిక నాయకులు పిలుపునిస్తున్నారని ఆ ట్వీట్ లో తెలిపారు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు తెలిపాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఈ వీడియో భారతదేశానికి సంబంధించింది కాదు. ఇది కొలంబియా నుండి వచ్చింది. 2022 సంవత్సరంలో చిత్రీకరించారు.
Claim : సరైన సదుపాయాలు భారత ప్రభుత్వం కల్పించకపోవడంతో స్కూలుకు వెళ్లే విద్యార్థిని ఎంతో ధైర్యంగా భారీ ప్రవాహాన్ని దాటుతూ ఉంది
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story