Fri Dec 05 2025 23:23:30 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: పాకిస్తాన్‌లోని ఖైబర్ ప్రావిన్స్‌లో వచ్చిన ఆకస్మిక వరదలను వైరల్ వీడియో చూపడం లేదు
జూన్ 2025 లో పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. "ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్‌ను భారీ వరదలు పలకరించాయి

Claim :
పాకిస్తాన్‌లోని ఖైబర్ ప్రావిన్స్‌లోని ఆకస్మిక వరదల వినాశకరమైన దృశ్యాలను వైరల్ వీడియో చూపిస్తుందిFact :
2021లో జపాన్‌లోని అటామిలో కొండచరియలు విరిగిపడిన దృశ్యాన్ని చూపించే వీడియో ఇది
జూన్ 2025 లో పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. "ఖైబర్ ప్రావిన్స్‌ను భారీ వరదలు పలకరించాయి. ఈ వరదలకు ప్రధాన కారణం భారీ వర్షాలేనని గుర్తించారు. గణనీయమైన ప్రాణనష్టం సంభవించింది. మౌలిక సదుపాయాలకు గణనీయమైన నష్టాన్ని కలిగించాయి ఈ వరదలు. ముఖ్యంగా స్వాత్ లోయ చాలా ప్రభావితమైంది. ఆగస్టు 16, 2025న భారీ వర్షాల కారణంగా వాయువ్య పాకిస్తాన్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 56 మంది చనిపోయారు. జూన్ 26 నుండి వరదల కారణంగా మరణాల సంఖ్య 360 కి పైగా ఉంది.
ఆగస్టు 17, 2025న పాకిస్తాన్ వాతావరణ శాఖ దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 327కి పెరిగిందని అధికారులు ప్రకటించారు. ఆగస్టు 17 నుండి ఆగస్టు 21 వరకు దేశవ్యాప్తంగా వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య ప్రాంతాల ప్రజలు ఈ విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. ఈ సంవత్సరం సాధారణం కంటే ముందుగానే ప్రారంభమైన వర్షాలు రాబోయే పక్షం రోజుల్లో మరింత తీవ్రతతో కొనసాగే అవకాశం ఉందని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) కూడా హెచ్చరించింది.
"ఈ విధ్వంసానికి సంబంధించిన అనేక వీడియోలు, చిత్రాలు ప్రధాన స్రవంతి మీడియా కథనాల్లో కనిపించాయి. ఇవే వీడియోలు సోషల్ మీడియా పోస్ట్‌లలో కూడా విస్తృతంగా పంచుకోబడ్డాయి. "ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్‌లోని ఖైబర్‌లో సంభవించిన ఆకస్మిక వరదలను చూపిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఈ వీడియో 2021లో జపాన్‌లోని అటామిలో కొండచరియలు విరిగిపడిన ఘటనకు సంబంధించింది.
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లు సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఇది పాత ఘటనకు సంబంధించినదిగా నిర్ధారించాం. Donegal Weather Channel అనే ఫేస్ బుక్ పేజీలో జులై 3, 2021న “Scary footage showing the landslide in Atami city, Japan this morning with 20 people missing and two believed to be dead. For more on this https://www.donegalweatherchannel.ie/.../2-dead-and-20... Video by Katie Fujita” అనే టైటిల్ తో పోస్టు చేసినట్లు మేము గుర్తించాం.
కొండచరియలు విరిగిపడిన వీడియోను హిందూస్తాన్ టైమ్స్ యూట్యూబ్ ఛానెల్లో“Watch: Landslide in Japan's Atami, 20 people missing, at least 3 killed” అనే శీర్షికతో వీడియోను షేర్ చేశారు. వీడియో వివరణలో "జూలై 3న జపాన్ సముద్రతీర పట్టణంలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొన్ని రోజుల పాటు కురిసిన భారీ వర్షాల తర్వాత అటామిలో బురద ఇళ్లపైకి దూసుకెళ్లింది. కనీసం 20 మంది తప్పిపోయారని, ముగ్గురు మరణించారని నివేదికలు చెబుతున్నాయి. ప్రత్యక్ష సాక్షులు బురదతో నిండిన అలలు ఇళ్లను మింగేయడాన్ని చూశారు. కొండచరియలు విరిగిపడటంతో పట్టణంలో ఏకంగా 130 భవనాలు దెబ్బతిన్నాయి. అటామి వేడి నీటి బుగ్గల రిసార్ట్ పట్టణం, కొండచరియలు విరిగిపడిన రెండు రోజుల తర్వాత కూడా, రెస్క్యూ సిబ్బంది శిథిలాల ద్వారా గాలింపు కొనసాగించారు." అని ఉంది.
ఆ వీడియో ఇండియా టుడే ఫేస్బుక్ పేజీలో కూడా షేర్ చేశారు.
CNNలో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం, వర్షాకాలంలో టోక్యోకు నైరుతి దిశలో 60 మైళ్ల దూరంలో ఉన్న సముద్రతీర నగరంలో వరదల కారణంగా ఇళ్లు తుడిచిపెట్టుకుపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 20 మంది తప్పిపోయారు. స్థానికులు భయంతో చూస్తుండగా, పర్వతప్రాంతంలో నుండి వచ్చిన బురద కారణంగా పలు ఇళ్లు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫుటేజ్ చూపించింది.
శనివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో అటామి, షిజువోకా ప్రిఫెక్చర్లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం వచ్చిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారని అటామి నగర అధికారి CNNకి ధృవీకరించారు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తప్పిపోయిన వారి కోసం వెతుకుతున్నారు. ఇప్పటివరకు, అటామి నగరంలో ఇళ్లలో చిక్కుకున్న 19 మందిని రక్షించారు. రాత్రిపూట ఆపరేషన్లు ఆగిపోగా, ఆదివారం ఉదయం 6 గంటలకు తిరిగి ప్రారంభమయ్యాయి. పోలీసులు, అగ్నిమాపక శాఖ సేవలు, జపాన్ రక్షణ దళాల నుండి 700 మందికి సహాయం అందించారు.
కనుక, వైరల్ వీడియో పాకిస్తాన్‌లోని ఖైబర్ ప్రావిన్స్‌లో పలువురు ప్రాణాలను బలిగొన్న వరదను చూపించడం లేదు. ఈ వీడియో 2021లో జపాన్‌లోని అటామిలో సంభవించిన కొండచరియలు విరిగి పడడాన్ని చూపిస్తుంది. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim : పాకిస్తాన్‌లోని ఖైబర్ ప్రావిన్స్‌లోని ఆకస్మిక వరదల వినాశకరమైన దృశ్యాలను వైరల్ వీడియో చూపిస్తుంది
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story

