ఫ్యాక్ట్ చెక్: మూడు వందే భారత్ రైళ్లు ఒకదానినొకటి దాటుతున్న వైరల్ వీడియో నిజంకాదు, ఒక యానిమేషన్ వీడియో
శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా రైల్వే స్టేషన్, శ్రీనగర్ రైల్వే స్టేషన్ మధ్య నడిచే మొదటి వందే భారత్ రైలు కోసం ఇండియన్ రైల్వే

Claim :
వైరల్ వీడియోలో 3 వందే భారత్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొట్టకుండా దాటుతున్నట్లు చూడొచ్చుFact :
వైరల్ వీడియో ఒక యానిమేటెడ్ వీడియో, వందే భారత్ రైలు క్రాసింగ్‌ను చూపించే వీడియో కాదు
శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా రైల్వే స్టేషన్, శ్రీనగర్ రైల్వే స్టేషన్ మధ్య నడిచే మొదటి వందే భారత్ రైలు తో ఇండియన్ రైల్వేస్ ట్రయల్ రన్ నిర్వహించింది. ఈ మార్గం భారతదేశంలోని మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైల్వే వంతెన అయిన ఐకానిక్ అంజి ఖాడ్ వంతెన, ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ వంతెన గుండా వెళుతుంది. రైలును రూపకల్పన చేసేటప్పుడు, అక్కడి వాతావరణాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు, లోయలోని చల్లని వాతావరణ పరిస్థితులలో ప్రయాణించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. రైలు -30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత లో కూడా పనిచేయగలదు. ఈ చైర్ కార్ రైలు లో నీరు గడ్డకట్టకుండా ఉంచడానికి అధునాతన వ్యవస్థలు, బయో-టాయిలెట్ ట్యాంకులను కలిగి ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెనపై వందే భారత్ రైలు ట్రయల్ రన్, కవచ్ టెక్నాలజీ, అత్యాధునిక సౌకర్యాలు వంటి భద్రతా చర్యలతో సహా వందే భారత్ రైళ్ల మెరుగైన లక్షణాల కారణంగా ఎంతో ప్రత్యేకంగా నిలిచింది.
ఈ మధ్యలో , ఒక రైల్వే జంక్షన్ వద్ద 3 హైస్పీడ్ రైళ్లు ఒకదానికొకటి ఎటువంటి సమస్య లేకుండా, దాటుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో 3 వందే భారత్ రైళ్లు ఒకదానికొకటి దాటుతున్నట్లు చూపిస్తున్నాయి. ఈ పోస్టుల ద్వారా భారతీయ రైల్వే అధునాతన మౌలిక సదుపాయాలను, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పని తీరును ప్రశంసిస్తూ ఉన్నారు.
“3 Vande Bharat trains crossing each other, not possible in any other country. We're proud of our Rail Minister Ashwini Vaishnaw ji” అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేస్తున్నారు. ఒకదాని తర్వాత ఒక రైలు ఓ జంక్షన్ గుండా దాటుతూ ఉన్నట్లు వైరల్ వీడియోలో మనం చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
locomotiveultra అనే YouTube ఛానెల్ మే 27, 2025న ఇండోనేషియా భాషలో '3 Trains Crossing Railway Tracks #train #railway #indianrailways #indian' అనే టైటిల్‌తో అదే వీడియోను షేర్ చేసింది. వీడియో డిస్క్రిప్షన్ లో The description of the video states, “3 Trains Cross Railway Crossing రైల్స్. Hello everyone, welcome to the Ultra Locomotive channel. Here I will travel on a Unique Train, and will pass through various obstacles while the Train is traveling. So that this channel can grow and friends don't miss interesting videos or other updates from this channel, I ask you to like, comment, and subscribe. Thank you and Happy watching. అని ఉంది. ఈ ఛానల్ లో ఉన్న వీడియోలలో పలు ట్రైన్లకు సంబంధించిన వీడియోలు ఉంటాయని వివరంగా తెలిపారు.
ఈ వీడియో కేవలం వినోదం కోసం మాత్రమే తయారు చేశాం. ఏ పార్టీని కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం కాదని అందులో ఉంది. #train #flyingtrain #shakingtrain #shakingtrain #chaotictrain #traingame #trainsimulation #trainedit #train #trainz #trainzsimulator #wavytrain #tuttuttut train #traingame #traingame #trainzsimulatorandroid # trainzsimulator2019 # trainzsimulator2022 #trainzrailroadsimulator #railroad #railfans #nighttrain #longtrain #indiantrain అనే హ్యాష్ ట్యాగ్ లను ఉపయోగించారు.
3D యానిమేటెడ్ రైళ్లను చూపించే అనేక వీడియోలను కూడా ఈ యూట్యూబ్ ఖాతా షేర్ చేసినట్టు తెలుసుకున్నాం. యూజర్ ఇచ్చిన హ్యాష్‌ట్యాగ్‌లు ‘#similasikereta’, ‘#keretaapi’, #gamekeretaapi ను ఉపయోగించి మరింత శోధించినప్పుడు, 3D రైళ్లకు సంబంధించిన సిమ్యులేటర్ వీడియోలను చూపుతాయి. ఈ వీడియోలను సిమ్యులేటర్ ఉపయోగించి వినియోగదారులు సృష్టించిన యానిమేషన్లని అర్థం అవుతోంది.

