ఫ్యాక్ట్ చెక్: ఏఐ తో సృష్టించిన వీడియో తమిళనాడులోని మహాబలిపురంకు చెందిన విజువల్స్ గా ప్రచారం అవుతోంది
తమిళనాడు తీరప్రాంత పట్టణం, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన మహాబలిపురం ఎన్నో వింతలు, విశేషాలకు నిలయం. ప్రాచీన భారతీయ

Claim :
తమిళనాడులోని మహాబలిపురంలో నీట మునిగిన విష్ణు దేవాలయాన్ని చూపుతున్న వైరల్ వీడియోFact :
వైరల్ వీడియోలో ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన విజువల్స్
తమిళనాడు తీరప్రాంత పట్టణం, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన మహాబలిపురం ఎన్నో వింతలు, విశేషాలకు నిలయం. ప్రాచీన భారతీయ శిల్పకళా నైపుణ్యాన్ని, ఆనాటి పల్లవ రాజుల ఘనమైన చారిత్రక కళా సంపదను తరతరాలుగా తెలియజేస్తున్న రాతి గోపురాల సముద్ర తీర పట్టణమే మహాబలిపురం. సముద్ర తీర ఆలయం మాత్రమే నీటి పైన కనిపించినప్పటికీ, నీటి అడుగున ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయని అంటుంటారు. పల్లవ రాజవంశం నిర్మాణ శైలికి సాక్ష్యంగా గణనీయమైన సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ శిథిలాలు పెద్ద ఎత్తున పర్యాటకాన్ని ఆకర్షిస్తాయి. 2017లో, తీర ప్రాంత ఆలయానికి సమీపంలో నీటి అడుగున పురావస్తు పరిశోధనలో 4 నుండి 9 మీటర్ల లోతులో మునిగిపోయిన మానవ నిర్మిత నిర్మాణాలు బయటపడ్డాయి.
ఫ్యాక్ట్ చెక్:
AI సాధనాల ద్వారా ఈ విజువల్స్ ను సృష్టించారని హైవ్ డిటెక్షన్ టూల్ ద్వారా తెలిసింది. ఈ విజువల్స్ సృష్టి వెనుక 'పికా టూల్' ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. సంబంధిత ఫలితాల స్క్రీన్షాట్లు ఇక్కడ ఉన్నాయి.
WasitAI డిటెక్షన్ టూల్ ద్వారా కీఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ లో సెర్చ్ చేశాము. వీడియో AI టెక్నాలజీని ఉపయోగించి రూపొందించినట్లుగా మేము నిర్ధారించగలిగాము. ఫలితాలకు సంబంధించిన స్క్రీన్షాట్లు ఇక్కడ చూడొచ్చు.
మరింత పరిశోధన తర్వాత, ఆ వీడియోను మొదట జైప్రింట్స్ అనే యూజర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో “Anantashayana Awakens: Vishnu’s Sacred Sleep Beneath the Sea. At sunrise, a team of Indian divers prepares on a research vessel off the coast of Mahabalipuram, near the ancient Shore Temple. For centuries, legends whispered of seven magnificent temples, six of which were swallowed by the sea. Their mission? To investigate sonar scans revealing something… massive. As they descend, the sea parts like memory — and there he lies. A colossal Lord Vishnu in the Anantashayana pose, resting upon the coiled body of Sheshnag, seven divine hoods arched in silence above him. A lotus blooms from his navel. Lakshmi sits at his feet. Coral clings to his form. Myth becomes monument. Divers reach out in reverence — their gloved hands touching a foot once worshipped in temple hymns. A world lost to water, now rediscovered. Inspired by the sunken temple myths of Mahabalipuram, Tamil Nadu. Crafted with love by @jayprints.
#vishnu #lordkrishna #krishnaconciousness
#vishnubhagwan #isckon #reelsvideo #ai #trendingreels
#trending #explorepage #underwater
#hareramaharekrishna అనే క్యాప్షన్‌తో షేర్ చేశారని మేము కనుగొన్నాము.