ఫ్యాక్ట్ చెక్: ఎయిర్ చీఫ్ మార్షల్ "స్క్వాడ్రన్ లీడర్" శివాంగి సింగ్ తల్లిని కలిసారనేది నిజం కాదు
ఆపరేషన్ సిందూర్ భారత సాయుధ దళాలు 2025 మే 7న ప్రారంభించాయి. ఇది 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా

Claim :
ఎయిర్ చీఫ్ మార్షల్ ఏ.పీ. సింగ్, యుద్ధంలో (ఆపరేషన్ సిందూర్) కనిపించకుండా పోయిన భారత పైలట్ శివాంగి సింగ్ ఇంటికి వెళ్లారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందిFact :
వైరల్ వీడియోలో కనిపించినది శివాంగి సింగ్ కుటుంబం కాదు. అది ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన సర్జెంట్ సురేంద్ర కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భం
ఆపరేషన్ సిందూర్ భారత సాయుధ దళాలు 2025 మే 7న ప్రారంభించాయి. ఇది 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా జరిగింది. ఆ దాడిలో 26 మంది నిరపరాధులు (25 మంది భారతీయులు, ఒకరు నేపాలీ పౌరుడు) మృతి చెందారు. ఈ ఆపరేషన్ సమయంలో భారీ స్థాయిలో డిస్ఇన్ఫర్మేషన్ ప్రచారం కూడా వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత కూడా తప్పుడు ప్రచారాలు కొనసాగుతున్నాయి.
ఒక వీడియోలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏ.పీ. సింగ్, ఆయన భార్య సరితా సింగ్ తో కలిసి ఒక స్త్రీని పరామర్శిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీనిని షేర్ చేస్తూ, ఇది స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ తల్లి అని కొన్ని సోషల్ మీడియా పోస్టులు వాదించాయి. పోస్ట్ చేసిన యూజర్లలో ఒకరు ఇలా రాశారు “Indian airchief, reportedly in the house of Shivangi, the missing fighter pilot. Lost in May 2025. If anybody has seen her ever since, please inform Indian Airforce Chief.”
మరి కొద్ది మంది యూజర్లు షేర్ చేసిన Urdu పోస్ట్ అనువాదం ప్రకారం “భారత వాయుసేనాధిపతి శివాంగి సింగ్ తల్లిని కలిశారు. ఆమె కన్నీళ్లతో విలవిలలాడుతున్నారు. శివాంగి సింగ్ ఎక్కడ ఉన్నారో సమాచారం లేదు. గమనిక: శివాంగి సింగ్ మా వద్ద లేరు (ISPR)”
క్లెయిం ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టిస్తోంది. వీడియోలో కనిపించినది శివాంగి సింగ్ కుటుంబం కాదు. అది లేట్ సర్జెంట్ సురేంద్ర కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భం.
ఈ వీడియో నుండి కీఫ్రేమ్‌లు సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా శోధించగా మాకు కొన్ని సోషల్ మీడియా పోస్టులు లభించాయి. ఆగస్టు 14, 2025న కొంతమంది యూజర్లు ఈ వీడియోని షేర్ చేశారు.
"డూన్ డిఫెన్స్ అకాడమీ" ఇన్స్టాగ్రామ్ అకౌంట్ “Air Chief Marshal AP Singh & Mrs Sarita Singh visited the village Mehradasi in Jhunjhunu district, Rajasthan, the hometown of Late Sgt Surender Singh who sacrificed his life in the line of duty during Operation Sindoor. At his residence they met his mother, Mrs Nanu Devi, wife Mrs Seema, and children Vritika and Daksh” అంటూ పోస్ట్ చేసింది.
భారత వాయుసేన అధికారిక X ఖాతా ఆగస్టు 13, 2025న కొన్ని చిత్రాలను షేర్ చేస్తూ, "వాయుసేన అధిపతి ఏపీ సింగ్ గారు, శ్రీమతి సరితా సింగ్ కలిసి రాజస్థాన్ రాష్ట్రంలోని ఝున్ఝును జిల్లా లో ఉన్న మేహ్రదాసీ గ్రామానికి వెళ్లారు. అక్కడ వారు "ఓపరేషన్ సిందూర్" లో ప్రాణత్యాగం చేసిన లేట్ సర్జెంట్ సురేందర్ కుమార్ స్వగ్రామాన్ని సందర్శించారు. ఆయన ఇంటిలో, వారు ఆయన తల్లి శ్రీమతి నను దేవి, భార్య శ్రీమతి సీమ, అలాగే పిల్లలు వృతికా, దీక్ష్లను కలిశారు. ఇది ప్రస్తావించదగిన విషయం ఏమనగా, ఝుంఝును జిల్లాకు దేశసేవలో గొప్ప ఖ్యాతి ఉంది—ఈ జిల్లాకు చెందిన 21,700మంది మాజీ సైనికులు ఉన్నారు, అలాగే భారత వాయుసేనలో సేవలందిస్తున్న 3,552 మంది ఎయిర్ వారియర్స్ ఈ జిల్లాకు చెందినవారు." అనే వ్యాఖ్యానం తో షేర్ చేసారు.
అదేవిధంగా PIB Fact Check కూడా ఈ క్లెయిమ్‌ను తిప్పికొట్టింది. వీడియోను ప్రో-పాకిస్థాన్ ఖాతాలు తప్పు కాన్టెక్స్ట్లో షేర్ చేస్తున్నాయని, వాస్తవానికి అది సర్జెంట్ సురేంద్ర కుమార్ కుటుంబాన్ని కలిసిన సందర్భమని తెలిపింది.
ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, 2025 మేలో జరిగిన ఇండియా–పాకిస్థాన్ ఘర్షణలో ఎలాంటి పైలట్ పట్టుబడలేదు. దీనినే PIB కూడా స్పష్టంగా తెలిపింది “Pro-Pakistan social media handles claim that an Indian Female Air Force pilot, Squadron Leader Shivani Singh, has been captured in Pakistan. This claim is FAKE!”
ఎయిర్ చీఫ్ మార్షల్ ఏ.పీ. సింగ్, స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ ఇంటికి వెళ్లారు అనేది నిజం కాదు. వీడియోలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏ.పీ. సింగ్, అయన సతీమణి సర్జెంట్ సురేంద్ర కుమార్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టిస్తోంది.

