ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో ఉత్తరాఖండ్ లో వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్ కి సంబంధించింది కాదు, ఇటలీ కి చెందింది
దేశవ్యాప్తంగా, ఉత్తరాఖండ్ ఉత్తరఖాషి జిల్లాలో ఆగస్ట్ 5న జరిగిన భారీ క్లుడ్ బర్స్ట్ వల్ల తీవ్రతరమైన ఫ్లాష్ ఫ్లడ్స్

Claim :
ఆగస్ట్ 5, 2025 న ఉత్తరాఖండ్ లో వచ్చిన ప్రమాదకరమైన ఫ్లాష్ ఫ్లడ్ ని వైరల్ వీడియో చూపిస్తోందిFact :
వైరల్ వీడియో భారతదేశానికి సంబంధించింది కాదు, ఇది 2025 జూలైలో ఇటలీ బార్డోనేచ్చియాలో జరిగిన ఫ్లాష్ ఫ్లడ్ ను చూపిస్తోంది
దేశవ్యాప్తంగా, ఉత్తరాఖండ్ ఉత్తరఖాషి జిల్లాలో ఆగస్ట్ 5న జరిగిన భారీ క్లౌడ్ బరస్ట్ వల్ల తీవ్రతరమైన ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించిన విషయం తెలిసిందే. ఈ వరదలలో ఇళ్ళు, హోటళ్లు, మౌలిక వసతులు సమూలంగా నాశనం అయిపోయాయి. కనీసం 50 మంది కనిపించకుండా పోయారు. వాతావరణం, భౌగోళిక విపత్తుల కారణంగా రక్షణ చర్యలకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఆగస్ట్ 15 వరకు ఉత్తరఖాషిలో భారీ వర్షాలు పడుతునడటం తో రక్షణ చర్యలు ఆలస్యమై, ఇంకా 43 మంది ఆచూకీ లభ్యం కాలేదని అధికారికంగా ప్రకటించారు. ధరాలిలో ప్రకృతి బీభత్సం సృష్టించిన వీడియో చూసిన ఎవరైనా వెన్నులో వణుకుపుడుతుంది. ఒక్కసారిగా దూసుకొచ్చిన బురద నీరు గ్రామాన్ని కబలించిన దశ్యాలు ఇప్పటికీ మైండ్లో మెదులుతూనే ఉన్నాయి. దీనంతిటికీ క్లౌడ్ బరస్ట్ అని ప్రాథమికంగా చెబుతున్నారు.
క్లెయిమ్ ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
ఈ క్లెయిమ్ పూర్తిగా అబద్దపుది, నిజం కాదు. ఈ వీడియో 2025 జూలైలో ఇటలీ లోని బార్డోనేచ్చియా పట్టణంలో భారీ వర్షాలకు సంభవించిన చిత్రమైన ఫ్లాష్ ఫ్లడ్ ను చూపిస్తుంది.

