Fri Dec 05 2025 12:02:09 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ప్రయాగ్‌రాజ్‌లో హింసకు కారణమైన నిందితులను యూపీ పోలీసులు ఊరేగించడం వైరల్ వీడియో చూపడం లేదు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జూన్ 29, 2025న భీమ్ ఆర్మీ చీఫ్, పార్లమెంటు సభ్యుడు చంద్రశేఖర్ ఆజాద్‌ను కౌశంబికి

Claim :
ప్రయాగ్‌రాజ్‌లో హింసకు కారణమైన నిందితులకు గుండు కొట్టించి యూపీ పోలీసులు ఊరేగించారుFact :
ఇది రాజస్థాన్ కు చెందిన వీడియో. బరాన్‌లోని పెట్రోల్ పంప్లో చోరీకి ప్లాన్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను రాజస్థాన్ పోలీసులు ఊరేగిస్తున్నారు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జూన్ 29, 2025న భీమ్ ఆర్మీ చీఫ్, పార్లమెంటు సభ్యుడు చంద్రశేఖర్ ఆజాద్‌ను కౌశంబికి వెళ్లకుండా పోలీసులు ఆపిన తర్వాత ఆయన మద్దతుదారులు హింసకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. పలు ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా, పోలీసు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. అధికారులపై రాళ్ల దాడులు చేశారు. అనేక రాష్ట్ర ప్రభుత్వ బస్సులు ధ్వంసం చేశారు, అనేక మోటార్‌బైక్‌లు తగలబెట్టారు. విధ్వంసానికి సంబంధించి పోలీసులు 67 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. 8 మంది యువకులను అరెస్టు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో హింసకు కారణమైన నిందితులను పోలీసులు పట్టుకుంటున్నట్లు చూపించే వాదనలతో అనేక వీడియోలు, చిత్రాలు వైరల్ అవుతూ ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ పోలీసులు హింసకు కారణమైన వ్యక్తులను ఊరేగిస్తున్నారని పేర్కొంటూ గుండు చేయించుకున్న కొంతమందిని వీధుల్లో తీసుకుని వెళ్తున్నట్లు చూపించే అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది వినియోగదారులు "ప్రయాగ్‌రాజ్‌లో హింసకు కారణమైన భీమ్ ఆర్మీ సభ్యుల కవాతు నిర్వహించారు" అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశారు.
“BSD वाले ये भूल गए थे I कि इनका जन्म उत्तर प्रदेश में हुआ है I और उत्तर प्रदेश भीम आर्मी से नहीं I भीम राव अम्बेडकर क़े संविधान से चलता है” అంటూ హిందీలో కూడా పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టిస్తోంది. ఈ వీడియో రాజస్థాన్‌లో జరిగిన ఒక సంఘటనను చూపిస్తుంది. మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, జూన్ 3, 2025న అప్డేట్ ఇండియా అనే యూట్యూబ్ ఛానెల్ షేర్ చేసిన వీడియోను కనుగొన్నాము, దాని శీర్షిక ‘బరాన్ పోలీసులు నేరస్థుల అహంకారాన్ని తగ్గించారు! వారికి గుండు చేయించి నగరంలో ఊరేగించారు." అనే అర్థం వస్తుంది.
వీడియో వివరణలో రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుందని వివరించారు. పెట్రోల్ పంపును దోచుకోవడానికి పెద్ద ప్రణాళిక వేశారు, కానీ కిషన్‌గంజ్ పోలీస్ స్టేషన్ అధికారులు మొదట 5 మంది నిందితులను పట్టుకున్నారు. పోలీసులు వారి నుండి దేశీయంగా తయారు చేసిన పిస్టల్, కారం పొడి లాంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అదే ముఠాకు చెందిన మరో 7 మంది నిందితులను కూడా ఆ తర్వాత పట్టుబడ్డారు. విచారణ సమయంలో, నేరస్థులు తాము పెద్ద ప్లాన్ వేసినట్లు అంగీకరించారు. నేరస్థులకు గుండు చేయించి నగరంలో ఊరేగింపు జరపడం బలమైన సందేశాన్ని ఇచ్చింది. "మీరు నేరం చేస్తే, మీ గౌరవం కూడా పోతుంది" అని అదనపు ఎస్పీ రాజేష్ చౌదరి చెప్పుకొచ్చారు.
NDTV నివేదిక ప్రకారం, రాజస్థాన్ పోలీసులు బరాన్‌లోని రెండు వేర్వేరు ప్రదేశాలలో పెట్రోల్ పంపులను దోచుకోవడానికి ప్లాన్ చేస్తున్న దుండగులను అరెస్టు చేశారు. పోలీసులు మొదట అరెస్టు చేసిన 12 మంది తలలను గుండు చేయించి నగరం అంతటా ఊరేగించారు. నిందితుల నుండి పోలీసులు దేశీయంగా తయారు చేసిన పిస్టల్స్, కార్ట్రిడ్జ్లు, కారం పొడి వంటి వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.
కనుక, పోలీసులు దుండగులను ఊరేగిస్తున్నట్లు చూపిస్తున్న వైరల్ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు సంబంధించినది కాదు. ఈ వీడియో రాజస్థాన్‌కు చెందినది, అక్కడ బరాన్‌లోని పెట్రోల్ బంక్‌లను దోచుకోవాలని ప్లాన్ చేస్తున్న వ్యక్తులను పోలీసు అధికారులు అరెస్టు చేసి ఊరేగించారు. వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టిస్తోంది.
Claim : ప్రయాగ్‌రాజ్‌లో హింసకు కారణమైన నిందితులకు గుండు కొట్టించి యూపీ పోలీసులు ఊరేగించారు
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : Misleading
Next Story

