ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో లక్నోలో స్వాధీనం చేసుకున్న తుపాకులు, తూటాలను చూపించడం లేదు
లక్నోలో ముహర్రం పండుగకు ముందు, మలిహాబాద్ పోలీస్ స్టేషన్ నుండి కేవలం 100 మీటర్ల దూరంలో పోలీసులు అక్రమ ఆయుధాలను స్వాధీనం

Claim :
లక్నోలోని హకీమ్ సలావుద్దీన్ ఇంటి నుండి స్వాధీనం చేసుకున్న తుపాకులు, తూటాలను చూపించే వీడియోFact :
వైరల్ వీడియోలు, ఫోటోలు పాతవి. లక్నో హకీమ్ సలావుద్దీన్ సంఘటనకు సంబంధించినవి కావు.
లక్నోలో ముహర్రం పండుగకు ముందు, మలిహాబాద్ పోలీస్ స్టేషన్ నుండి కేవలం 100 మీటర్ల దూరంలో పోలీసులు అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 72 ఏళ్ల వైద్య నిపుణుడు హకీమ్ సలావుద్దీన్ ఇంటి నుండి ఈ అక్రమ ఆయుధ కర్మాగారం నడుస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తూ ఉంది. ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) పిస్టల్స్, రైఫిల్స్, మౌసర్లు సహా 12–13 అధునాతన తుపాకీలను, 3,000 కు పైగా తూటాలను స్వాధీనం చేసుకుంది. కొన్ని సోషల్ మీడియా పోస్టుల్లో 3000 తుపాకులు, 50,000 తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
వైరల్ వీడియో:
ఒక వీడియో “3,000 guns, 50,000 cartridges and cash recovered from Hakim Salauddin's house in Lucknow one day before Muharram. They are preparing for war. भीम आर्मी “ #Hindus #Rajasingh “PM Modi “ Yogi” “Islam” అనే క్యాప్షన్ తో షేర్ చేస్తున్నారు. 000 తుపాకులు, 50,000 తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈ పోస్టుల్లో తెలిపారు.
వైరల్ ఫోటో:
"లక్నోలోని హకీమ్ సలావుద్దీన్ ఇంటి నుండి 3000 తుపాకులు, 50,000 తూటాలు కలిగిన 20 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు" అనే శీర్షికతో తుపాకులను చూపిస్తున్న మరో చిత్రం వైరల్ అవుతోంది.