ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి ముందు తీసిన వీడియో కాదు, పాతది
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787

Claim :
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి ముందు ఫేస్బుక్ లైవ్ స్ట్రీమ్ వీడియోను వైరల్ వీడియో చూపిస్తుంది.Fact :
జనవరి 2023లో జరిగిన యేతి ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదానికి సంబంధించిన వైరల్ వీడియో
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయింది. ఆ విమానం లండన్‌కు బయలుదేరి నగరంలోని మేఘాని ప్రాంతంలోని భవనాలను ఢీకొట్టింది, దీనితో భారీగా నల్లటి పొగ కమ్ముకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లోని బిజె మెడికల్ కాలేజీ విద్యార్థుల హాస్టల్‌పై కూలిపోయింది. విమానంలో చాలామంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొంటున్నారు. ప్రమాదం తరువాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. టేకాఫ్ కాగానే విమానం కుప్పకూలింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా, విమాన ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు ఒక ప్రయాణీకుడు తన విమాన ప్రయాణాన్ని రికార్డ్ చేస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయే ముందు ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన చివరి క్షణాలకు సంబంధించిన వీడియో అంటూ Xలో పోస్టులు పెట్టారు. “Facebook live video before Ahmedabad, Gujarat plane crash #planecrash” అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేస్తున్నారు.

