Fri Dec 05 2025 20:24:25 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బంగ్లాదేశ్ నుండి పడవల్లో పశ్చిమ బెంగాల్ కు వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు
ఏప్రిల్ నెల ప్రారంభంలో పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి. కొన్ని రోజుల పాటూ హింస

Claim :
బంగ్లాదేశ్ నుండి ముస్లింలు పడవల ద్వారా భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌కు వస్తున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుందిFact :
పడవల్లో జనం నిండి ఉన్నట్లు చూపించే వీడియో బంగ్లాదేశ్ కు చెందినది. వాళ్లు భారతదేశానికి రావడం లేదు.
ఏప్రిల్ నెల ప్రారంభంలో పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి. కొన్ని రోజుల పాటూ హింస కొనసాగింది. పలువురు సొంత ఊళ్లను విడిచిపెట్టాల్సి వచ్చింది. పలు ప్రాంతాల్లో అల్లర్లకు దారితీసింది. ఈ హింస కారణంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. సాజు మోర్, బెడ్బోనా, డాక్ బంగ్లా మోర్తో సహా అనేక ప్రాంతాలు మూక దాడులు జరిగాయి. దీనికి ప్రతిస్పందనగా, బెంగాల్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ప్రభావితమైన స్థానికులతో మాట్లాడిన తర్వాత 30 కి పైగా కొత్త FIRలను నమోదు చేసింది.
ఇంతలో, వందలాది మంది పడవల మీద వస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతోంది, పడవల్లో తరలిస్తున్న వ్యక్తులు బంగ్లాదేశ్ నుండి భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌కు వస్తున్న ముల్లాలు అని, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, ఆ ప్రాంతంలో రాష్ట్రపతి పాలన విధించాలని పోస్టుల్లో చెబుతున్నారు.
“*बांग्लादेश से मुल्ले पहुंच रहे है बंगाल* *मोदी सरकार अब तो राष्ट्रपति शासन लागू करो*” అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేస్తున్నారు. “ముల్లాలు బంగ్లాదేశ్ నుండి బెంగాల్‌కు చేరుకుంటున్నారు. మోడీ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించాలి” అని అర్థం. వైరల్ వీడియోలో, పసుపు చొక్కా ధరించిన ఒక వ్యక్తి మాట్లాడుతుండటం మనం చూడవచ్చు. జనవరి 31న బిస్వా ఇజ్తేమా ప్రారంభం కానుందని, అంతకు ముందే ముస్లింల గుంపు వస్తున్నదని అతను చెప్పడం వినవచ్చు.
క్లెయిం ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో భారతదేశానికి సంబంధించినది కాదు.
వీడియోలో, ఆ వ్యక్తి ‘బిస్వా ఇజ్తేమా’ అని చెప్పడం మనం వినవచ్చు. కాబట్టి ‘బిస్వా ఇజ్తేమా’ అనే కార్యక్రమం గురించి మేము వెతికినప్పుడు ap news.comలో ప్రచురించిన ఒక నివేదిక లభించింది. బంగ్లాదేశ్ రాజధాని సమీపంలోని నది ఒడ్డున పదివేల మంది ప్రజలు బిస్వా ఇజ్తేమాకు హాజరవుతున్నారు. ఇస్లామిక్ పండితుల ప్రసంగాలు వినడానికి వీరందరూ వస్తున్నారు. ఇది బిస్వా ఇజ్తేమాలో మొదటి దశ అని, రెండవ దశ ఫిబ్రవరి 3-5 తేదీలలో నిర్వహించనున్నారు. మూడవ దశ ఫిబ్రవరి 14-16 తేదీలలో జరుగుతుంది.
బిస్వా ఇజ్తేమా అనేది ముస్లిం భక్తుల అతిపెద్ద సమావేశాలలో ఒకటి, ఇది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు ఉత్తరాన ఉన్న టోంగిలోని తురాగ్ నది ఒడ్డున జరుగుతుంది. ఈ కార్యక్రమం 1950ల నాటిది, తబ్లిఘి జమాత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రారంభించింది. బంగ్లాదేశ్ నలుమూలల నుండి అనేక మంది ఈ కార్యక్రమంలో భాగమయ్యారు.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి వెతికినప్పుడు, వందలాది మంది పడవల్లో ప్రయాణించే కొన్ని వీడియోలను మేము కనుగొన్నాము. “চরমোনাই #youtube #চরমনাই #দৃশ্য #সাগর” అనే హ్యాష్ ట్యాగ్స్ తో వీడియోలు పోస్టు చేశారు.
రహీం షార్ట్స్ బిడి అనే యూట్యూబ్ ఛానెల్ ఫిబ్రవరి 29, 2024న అదే వీడియోను “চরমোনাই #চরমোনাই #chormonai #shortvideo” అనే క్యాప్షన్స్ తో షేర్ చేసింది.
“চরমোনাই বাৎসরিক মাহফিল" అనే ఫేస్ బుక్ పేజీలో కూడా ফাল্গুন ২৮.২৯.১ అనే క్యాప్షన్ తో పోస్టు పెట్టారు. అనువదించినప్పుడు "చార్మోనై వార్షిక పండుగ" అని మాకు తెలిసింది.
చార్మోనీ వార్షిక ఉత్సవం గురించి తెలుసుకోడానికి ప్రయత్నించాం. ఇది బంగ్లాదేశ్‌లోని చార్మోనీలో ఏటా పెద్ద ఎత్తున నిర్వహించే ఇస్లామిక్ సమావేశం అని మేము కనుగొన్నాము. దేశీయంగా, అంతర్జాతీయంగా లక్షలాది మంది ముస్లింలు మూడు రోజుల పాటు జరిగే మతపరమైన కార్యకలాపాలు, చర్చలు, ప్రార్థనల కోసం హాజరవుతారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి తరచుగా పడవలలో ప్రయాణించి చేరుకుంటూ ఉంటారు.
అయితే, ఈ వీడీయో బిశ్వ ఇజ్టెమ కు చెందినదా లేదా చార్మోనీ వార్షిక ఉత్సవానికి చెందినదా మేము నిర్ధారించలేక పోయినా, ఈ వీడియో కు భారత్ కు సంబంధం లేదని తెలుస్తోంది.
వందలాది మంది పడవల్లో ప్రయాణిస్తున్నట్లు చూపించే వైరల్ వీడియో బంగ్లాదేశ్ నుండి భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌కు వస్తున్న సమూహాలను చూపించదు. ఇది బంగ్లాదేశ్‌లో నిర్వహించే వార్షిక ఉత్సవానికి ప్రజలు వెళ్తున్న విజువల్స్. ఇది భారతదేశానికి సంబంధించినది కాదు.
వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదు.
Claim : బంగ్లాదేశ్ నుండి ముస్లింలు పడవల ద్వారా భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌కు వస్తున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుంది
Claimed By : X (Twitter) users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story

