ఫ్యాక్ట్ చెక్: బెంగళూరులో భారీ వర్షాల కారణంగా వరద నీటిలో మునిగిపోయిన కార్ల ను వైరల్ వీడియో చూపడం లేదు
మే 18, 2025న బెంగళూరు నగరం భారీ వర్షం కారణంగా స్తంభించిపోయింది. బెంగళూరు నగరంలో 12 గంటల్లో 130 మి.మీ వర్షపాతం నమోదైంది.

Claim :
బెంగళూరులో భారీ వర్షాల కారణంగా వరద నీటిలో మునిగిపోయిన కారును వైరల్ వీడియోలో చూడొచ్చుFact :
వైరల్ వీడియో ఒక సోషల్ మీడియా యూజర్ సృష్టించిన 3D VFX వీడియో, బెంగళూరు వర్షాలకు సంబంధించినది కాదు.
నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ మధ్య తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం మొత్తం, కేరళ, మాహే, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలోని మిగిలిన ప్రాంతాలు, తమిళనాడులోని అనేక ప్రాంతాలు, నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు.. మిజోరంలోని కొన్ని ప్రాంతాలకు ఈరోజు, 24 మే 2025న విస్తరించాయి. ఈ విధంగా, నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీ సాధారణ తేదీకి బదులుగా, 24 మే, 2025న కేరళను తాకాయి.
మే 18, 2025న బెంగళూరు నగరం భారీ వర్షం కారణంగా స్తంభించిపోయింది. బెంగళూరు నగరంలో 12 గంటల్లో 130 మి.మీ వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ (IMD) రుతుపవనాల ముందస్తుగా వస్తాయని అంచనా వేయగా, కర్ణాటకలో ప్రస్తుతం భారీ వర్షాలు కొనసాగుతాయని భావిస్తున్నారు. బెంగళూరుతో సహా దక్షిణ మధ్య కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు, మే 27 వరకు కర్ణాటక తీరా ప్రాంతానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పలు ప్రాంతాలకు పసుపు అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షపాతం కారణంగా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉంది. 140 మి.మీ రికార్డు వర్షపాతం నగరంలోని లోతట్టు ప్రాంతంలో విధ్వంసం సృష్టించడంతో ఉత్తర బెంగళూరులోని సాయి లేఅవుట్లోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. ప్రభుత్వ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) బృందాలు కాలువలను శుభ్రం చేయడానికి, నిలిచిపోయిన నీటిని తొలగించడానికి కృషి చేస్తున్నాయి.
వీధిలో పార్క్ చేసిన కార్లు వరద నీటిలో ఉన్నాయని చూపించే ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియో బెంగళూరు వర్షాలకు సంబంధించిందనే వాదనతో ప్రచారంలో ఉంది.
మరొక యూట్యూబ్ యూజర్ అదే వీడియోను ఢిల్లీకి సంబంధించిందని షేర్ చేశారు.

