Fri Dec 05 2025 10:19:17 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: యూరియా అడిగితే జైలు శిక్ష తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను హెచ్చరించారనేది నిజం కాదు
భారతదేశంలో యూరియా లభ్యత తగినంతగా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో యూరియా అందకపోవడంతో

Claim :
యూరియా అడిగితే జైలు శిక్ష తప్పదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను హెచ్చరించారు.Fact :
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను హెచ్చరించలేదు. నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్న కుట్రదారుల గురించి ఆయన మాట్లాడారు
భారతదేశంలో యూరియా లభ్యత తగినంతగా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో యూరియా అందకపోవడంతో నిరసనలకు దిగారు. తెలంగాణలో స్థానికంగా యూరియా కొరత ఉందని అనేక వార్తా నివేదికలు సూచిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రైతులు గిడ్డంగులను ముట్టడించడం, రహదారులను దిగ్బంధించడం, ధర్నాలు చేయడం ద్వారా నిరసనలు చేపట్టారు. యూరియా కొరతకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసనను చేపట్టింది. అధికార TDP ప్రభుత్వం ఎరువుల సరఫరా విషయంలో విఫలమైందని, బ్లాక్ మార్కెటింగ్ కు కారణమైందని వైసీపీ ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు, పలువురు అధికారులు యూరియా కొరత ఆరోపణలను తోసిపుచ్చారు, తగినంత ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని పట్టుబట్టారు. పంపిణీలో అంతరాయాల వల్లే ఈ సమస్యలు తలెత్తాయని ఆరోపించారు.
ఇంతలో, రైతులు యూరియా అడిగితే జైలుకు పంపుతామని తాను హెచ్చరిస్తున్నానని AP CM చంద్రబాబు నాయుడు చెబుతున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. "రైతులు రైతులుగా వ్యవహరించాలి, వారు యూరియాను ఎక్కువగా ఉపయోగించకూడదు, ఎందుకంటే పొలంలో ఎరువులు, పురుగుమందులను ఎక్కువగా వాడటం క్యాన్సర్‌కు దారితీస్తుంది. వాటిని అధికంగా ఉపయోగిస్తే, ఎవరూ ఉత్పత్తిని కొనుగోలు చేయడం లేదు" అని ఆయన చెప్పడం కూడా మనం వినవచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. వీడియోను ఎడిట్ చేశారు.
“AP CM + యూరియా” అనే కీలక పదాలను ఉపయోగించి వెతికినప్పుడు, సెప్టెంబర్ 3, 2025న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిర్వహించిన ప్రెస్ మీట్‌ను అప్లోడ్ చేసిన అనేక YouTube ఛానెల్‌లను మాకు లభించాయి. Telugu Desam Party యూట్యూబ్ ఛానల్ లో “యురియాకు సంబంధించి రైతులకు ఆందోళన వద్దు | CM Chandrababu Naidu Press Meet” అంటూ వీడియోను అప్లోడ్ చేశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగు ప్రచురించిన ఒక కథనం ప్రకారం, ఏపీలోని ప్రతి జిల్లాలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కొంతమంది యూరియాను ఎక్కువగా పొందాలనే ఉద్దేశ్యంతో దారి మళ్లిస్తున్నారని, యూరియాను దారి మళ్లించిన వారిపై కేసులు నమోదు చేశామని కూడా ఆయన అన్నారు.
ఈటీవీ భారత్ కథనం ప్రకారం, విష ప్రచారాన్ని వ్యాపింపజేసే నకిలీ పార్టీ వైసీపీ అని సీఎం చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. ప్రతి రైతుకు సకాలంలో యూరియా సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఎరువులను దారి మళ్లించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో బ్లాక్మెయిల్ రాజకీయాలకు సమయం ముగిసిందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రైతులు మానసికంగా ప్రశాంతంగా ఉండటం వల్లే రాష్ట్రంలో ఆత్మహత్యలు తగ్గాయని ఆయన అన్నారు. జగన్, వైఎస్ఆర్సిపి నాయకులు ఊహాగానాలలో జీవించే వింత జీవులు అని ఆయన అన్నారు.
ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ వైరల్ పోస్టులను ఖండించింది. “ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని కూడా తమకు నచ్చినట్లుగా ఎడిటింగ్ చేసి ఆయన ఏపీ రైతులకు వార్నింగ్ ఇచ్చినట్టు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. యూరియా విషయంలో ఫేక్ ప్రచారాలకు దిగి రైతులను ఆందోళనకు గురిచేస్తున్న కొందరు కుట్రదారుల గురించి సీఎం చంద్రబాబు గారు మాట్లాడిన మాటలను ఇలా వక్రీకరించారు. కాబట్టి రైతులు కానీ, ప్రజలు గానీ ఇటువంటి ఫేక్ వీడియోలను నమ్మవద్దు. ఇతరులకు షేర్ చేయవద్దు. ముఖ్యమంత్రి గారి విషయంలో ఇటువంటి ఫేక్ వీడియోలను తయారుచేసి, ఇతరులకు పంపిస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.” అంటూ పోస్టు పెట్టింది.
యూరియా అడిగితే రైతులను అరెస్టు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారనే వాదన నిజం కాదు. యూరియా లభ్యత గురించి సోషల్ మీడియాలో నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తూ రైతులను భయాందోళనకు గురిచేస్తున్న వారిని సీఎం హెచ్చరించారు.
Claim : యూరియా అడిగితే జైలు శిక్ష తప్పదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను హెచ్చరించారు
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story

