Fri Dec 05 2025 11:12:50 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: చంద్రబాబుకు అవసరమైనప్పుడు తన కుమారుడు రాజా రెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని వైఎస్ షర్మిల అనలేదు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్

Claim :
చంద్రబాబుకు అవసరమైనప్పుడు తన కుమారుడు రాజా రెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని వైఎస్ షర్మిల చెప్పారుFact :
వీడియోను ఎడిట్ చేశారు. అసలు వీడియోలో ఆమె చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించలేదు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్నారు. ఇటీవల ఆమె అధికార తెలుగుదేశం ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రైతన్నల హక్కుల కోసం పోరాడతానని ప్రతిజ్ఞ కూడా చేశారు. ఇటీవల, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్నూలు ఉల్లి మార్కెట్ యార్డ్‌ను సందర్శించి, బాధిత రైతులకు సంఘీభావం తెలుపుతూ, క్వింటాలుకు రూ. 2,500 తక్షణ కనీస మద్దతు ధర (ఎంఎస్పి) చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇంతలో, ఆమె కొడుకుతో కలిసి ఉల్లిపాయల మార్కెట్లో మీడియాతో మాట్లాడుతున్న వీడియో ఫేస్బుక్లో వైరల్ అయింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు తన కుమారుడు రాజకీయాల్లోకి వస్తాడని ఆమె మీడియాకు చెప్పారనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు. “చంద్రబాబుకు అవసరమైనప్పుడు.. తప్పకుండా అడుగుపెడతాడు”, అంటూ పోస్టులు పెట్టారు.
ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఈ వీడియోను ఎడిట్ చేశారు.
వైఎస్ రాజారెడ్డి రాజకీయ ప్రవేశానికి సంబంధించిన కీ వర్డ్స్ ను ఉపయోగించి మేము వెతికినప్పుడు, వైఎస్ షర్మిల తన కుమారుడు రాజకీయాల్లోకి రాకముందే వైఎస్సార్సీపీ పార్టీ సభ్యులు ఆందోళన చెందుతున్నారని ఆమె చెబుతున్న మరో వీడియో మాకు లభించింది. కొంతమంది ఆమె వీడియోను మార్ఫింగ్ చేసి, ఆమె ప్రకటనలో చంద్రబాబు నాయుడు పేరును చేర్చినట్లు గుర్తించాం.
టీవీ9 తెలుగు కథనం ప్రకారం, షర్మిల తన కుమారుడు రాజకీయాల్లోకి వస్తాడని బహిరంగంగా ప్రకటించారు. షర్మిల అనుచరులు రాజా రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు అని బలంగా నమ్ముతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఒక వర్గం నుండి ట్రోల్స్ కూడా ప్రారంభమయ్యాయి. దీనిపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజా రెడ్డి వైఎస్ఆర్ నిజమైన రాజకీయ వారసుడు అని, దీనిపై ఎటువంటి సందేహం లేదని ఆమె స్పష్టం చేశారు.

“నా కొడుకు ఇంకా రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. అడుగుపెట్టకముందే వైఎస్ఆర్సీపీ ఇంత గందరగోళం సృష్టిస్తుంటే... ఇది భయమా? లేక బెదిరింపునా? వాళ్లకే తెలుసు. నా తండ్రి వైఎస్ఆర్, నా కొడుకుకు ‘వైఎస్ రాజా రెడ్డి’ అని పేరు పెట్టారు. వైఎస్ఆర్సీపీ ఎంత ఏడ్చి అడ్డంకులు సృష్టించినా, ఎవరూ ఈ పేరును మార్చలేరు, ”అని షర్మిల అన్నారు. చంద్రబాబు నాయుడు తన కొడుకును రాజకీయాల్లోకి తీసుకువస్తున్నట్లుగా ఒక వీడియోను మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్నారని... దాన్ని చూసి తాను నవ్వానని షర్మిల అన్నారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల రెడ్డి సోమవారం తన కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని కీలక వ్యాఖ్య లు చేశారు, 'అవసరం వచ్చినప్పుడు' ప్రజా జీవితంలోకి అడుగుపెడతారని అన్నారు. కర్నూలులోని ఉల్లిపాయల మార్కెట్ యార్డ్‌ను సందర్శించిన సందర్భంగా ఆమె ఈ ప్రకటన చేశారు, అక్కడ ఆమె తన కొడుకుతో కలిసి కనిపించారు. ఈ పర్యటనకు ముందు, రాజారెడ్డి తన అమ్మమ్మ వైఎస్. విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబంలోని మరో సభ్యుడి ప్రవేశానికి సూచనగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజా రెడ్డి సెప్టెంబర్ 8, 2025న కర్నూలులో తన తల్లితో కలిసి తొలిసారి బహిరంగంగా కనిపించారు.
కర్నూలు పర్యటన సందర్భంగా తన తల్లితో పాటు వెళ్లే ముందు, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య, షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ నుంచి రాజా రెడ్డి హైదరాబాద్‌లోని వారి నివాసంలో ఆశీర్వాదం తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనల్లుడు రాజా రెడ్డి. అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ వేరు వేరు దారుల్లో నడుస్తూ ఉండడంతో రాజా రెడ్డి రాజకీయాల్లోకి రావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, వైఎస్ షర్మిల చేసిన ప్రకటనను తనిఖీ చేశాము. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ - ఆంధ్రప్రదేశ్ ఫేస్బుక్ పేజీలో ప్రత్యక్ష ప్రసారం చేసిన ఒక వీడియో మాకు లభించింది. అవసరమైనప్పుడు తన కుమారుడు రాజకీయాల్లోకి వస్తాడని షర్మిల పేర్కొన్నట్లు మనం చూడవచ్చు. ఆమె ప్రకటనలో ఎక్కడా చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తావించలేదు.
కనుక, వైరల్ వీడియోలో, చంద్రబాబుకు తన కుమారుడు రాజా రెడ్డి అవసరమైనప్పుడు రాజకీయాల్లోకి వస్తాడని వైఎస్ షర్మిల చెబుతున్నారనే వాదన నిజం కాదు. వైరల్ వీడియోను ఎడిట్ చేశారు.

Claim : చంద్రబాబుకు అవసరమైనప్పుడు తన కుమారుడు రాజా రెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని వైఎస్ షర్మిల చెప్పారు
Claimed By : Facebook Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Facebook
Fact Check : False
Next Story