Fri Dec 05 2025 13:49:45 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో పంజాబ్ వరద సాయానికి చెందింది కాదు
పంజాబ్‌లో సంభవించిన ఊహించని వరదల్లో 37 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది నిరాశ్రయులు అయ్యారు. నిరంతర భారీ వర్షాలు, వరద

Claim :
పంజాబ్ వరద బాధితుల కోసం ముస్లిం ప్రజలు డబ్బుతో నిండిన బస్తాలను విరాళంగా ఇస్తున్నట్లు వైరల్ వీడియో చూపిస్తోందిFact :
బాంగ్లాదేశ్ లోని పగ్లా మసీదులో విరాళంగా ఇచ్చిన డబ్బును లెక్కించడాన్ని వైరల్ వీడియో చూపిస్తుంది, దీనికి పంజాబ్ వరదలకీ సంబంధం లేదు.
పంజాబ్‌లో సంభవించిన ఊహించని వరదల్లో 37 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది నిరాశ్రయులు అయ్యారు. నిరంతర భారీ వర్షాలు, వరద నీరు పంజాబ్‌లోని 23 జిల్లాల్లోని 1600 కి పైగా గ్రామాల్లో 1.75 లక్షల ఎకరాల వ్యవసాయ భూములను ముంచెత్తాయి. 1988 తర్వాత ఇదే అత్యంత దారుణమైన వరదలు అని అధికారులు చెబుతున్నారు.పంజాబ్‌లోని వివిధ ప్రాంతాలలో రక్షణ, సహాయ చర్యలు ఊపందుకున్నాయి. వరద బాధితులకు సహాయం చేయడానికి అనేక మంది ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థలు సహాయ సామగ్రి మరియు నిధులను విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చాయి.
సాంప్రదాయ దుస్తులు ధరించి, పెద్ద బ్యాగ్ నుండి డబ్బును పారవేస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియో పంజాబ్ ప్రజల కోసం వరద సహాయానికి ప్రజలు డబ్బును విరాళంగా ఇస్తున్నట్లు చూపిస్తోంది. “हर सम्त पानी ही पानी था, क़हर-ए-सैलाब का तूफ़ान था। इंसानियत जब मुश्किल में थी, मदद को उतरा हर मुसलमान था।“ అంటూ పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. బంగ్లాదేశ్‌లోని పాగ్లా మసీదులో వచ్చిన కలెక్షన్లలను లెక్కపెట్టడం వీడియో చూపిస్తోంది. వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఆ వీడియో ఆగస్టు 30, 2025న ఫేస్బుక్లో “ফের খোলা হলো পাগলা মসজিদের দান বাক্স, মিললো ৩২ বস্তা টাকা, চলছে গণনা। బంగ్లా క్యాప్షన్‌తో షేర్ చేసినట్లు మాకు తెలిసింది. దీనిని తెలుగులోకి అనువదించగా, "పగ్లా మసీదు విరాళాల పెట్టె మళ్లీ తెరవబడింది, 32 బస్తాల డబ్బు దొరికింది, లెక్కింపు జరుగుతోంది. #paglamosjid #paglamosque" అనే అర్థం వస్తుంది.
“The donation box of Pa/Gala Mosque has been reopened #paglamosjid #kishoreganj #taka” అనే క్యాప్షన్ తో ఫేస్ బుక్ లో వీడియోను పోస్టు చేశారు.
వైరల్ వీడియోలోని చిత్రాల పోలిక, బంగ్లాదేశ్ పోస్టుల స్క్రీన్‌షాట్ ఇక్కడ ఉంది.
ముఖ్యమైన కీ వర్డ్స్ ఉపయోగించి శోధించినప్పుడు, పగ్లా మసీదులో లెక్కింపు ప్రక్రియను చూపించే నిడివి ఎక్కువ ఉన్న YouTube వీడియోలు మాకు కనిపించాయి.
వార్తా నివేదికల ప్రకారం, కిషోర్‌గంజ్‌లోని పగ్లా మసీదులోని ఒక విరాళాల పెట్టెను ఆగస్టు 30, 2025న తెరిచారు. కిషోర్‌గంజ్‌లోని పగ్లా మసీదులోని 13 పెట్టెలను తెరిచి రోజంతా లెక్కించిన తర్వాత రికార్డు స్థాయిలో 12937220 టాకాల డబ్బు దొరికింది. 500 మందికి పైగా 13 గంటల పాటు 32 బస్తాల డబ్బును లెక్కించారు.
పంజాబ్‌లో ముస్లిం సమాజం, ప్రముఖులతో కలిసి అనేక సంఘాలు విరాళాలు అందిస్తున్నాయి. వరద సహాయక చర్యలను నిర్వహిస్తున్నాయి. సహాయక చర్యలను చూపించే కొన్ని వార్తా కథనాలు ఇక్కడ ఉన్నాయి.
కనుక, వైరల్ వీడియో బంగ్లాదేశ్‌లోని పగ్లా మసీదు లో విరాళాల లెక్కింపు ప్రక్రియను చూపిస్తుంది. దీనికి పంజాబ్‌లో వరద సహాయం కోసం విరాళాలకు సంబంధం లేదు. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
కనుక, వైరల్ వీడియో బంగ్లాదేశ్‌లోని పగ్లా మసీదు లో విరాళాల లెక్కింపు ప్రక్రియను చూపిస్తుంది. దీనికి పంజాబ్‌లో వరద సహాయం కోసం విరాళాలకు సంబంధం లేదు. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim : పంజాబ్ వరద బాధితుల కోసం ముస్లిం ప్రజలు డబ్బుతో నిండిన బస్తాలను విరాళంగా ఇస్తున్నట్లు వైరల్ వీడియో చూపిస్తోంది
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

