Fri Dec 05 2025 14:12:20 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్:తరగతి గదిలో జరిగిన ప్రమాదంలో పిల్లలు మరణించినట్లు చూపిస్తున్న చిత్రం ఏఐ తో తయారు చేసింది
ఉన్నట్లుండి వరదలు, కుండపోత వర్షాలు ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారాయి. 2025లో ఉత్తరాఖండ్‌లో భారీ వరదలు సంభవించాయి.

Claim :
వైరల్ చిత్రం తరగతి గదిలో జరిగిన ప్రమాదంలో చాలా మంది పిల్లలు మరణించినట్లు చూపిస్తోందిFact :
వైరల్ ఇమేజ్ AI ద్వారా సృష్టించారు, ఉత్తరాఖండ్ లేదా రాజస్థాన్ ప్రమాదానికి సంబంధించింది కాదు
ఉన్నట్లుండి వరదలు, కుండపోత వర్షాలు ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారాయి. 2025లో ఉత్తరాఖండ్‌లో భారీ వరదలు సంభవించాయి. డజన్ల కొద్దీ ప్రాణాలు కోల్పోగా, అనేక మంది ఆచూకీ లభించకుండా పోయింది. అదేవిధంగా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలను వర్షాలు వదలడం లేదు. చార్ ధామ్ యాత్ర సందర్భంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులను ఆకర్షించే గంగోత్రి ధామ్ పుణ్యక్షేత్రానికి 20 కి.మీ ముందున్న ధరాలి గ్రామంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటన తర్వాత అక్కడ దాదాపు 300 దుకాణాలు మూసివేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. భాగీరథి ఒడ్డున ఉన్న గంగోత్రి, పుణ్యక్షేత్రం, భట్వారీ బ్లాక్ మధ్య విస్తరించి ఉన్న రహదారి కూడా తెగిపోయింది. కమ్యూనికేషన్ లైన్లు కూడా తెగిపోయాయి, నిత్యావసర వస్తువుల సరఫరా కూడా ఆగిపోయింది.
ఇంతలో, పైకప్పు కూలిపోవడంతో మరణించిన పాఠశాల పిల్లల చిత్రం వైరల్ అవుతూ ఉంది. ఇది ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశిలో సంభవించిన భారీ వరద తర్వాత అనేక మంది పిల్లలు చనిపోయారని చెబుతూ ఉన్నారు. పాఠశాల పైకప్పు కూలిపోవడాన్ని చూపిస్తుందనే వాదన ప్రచారంలో ఉంది. కొందరు యూజర్లు “रास्ता देखती रह गई माएं । बच्चे स्कूल से सीधे स्वर्ग चले गए UK ( UTRAKHAND) ईतनी भयानक तसवीरें देखकर जिंदगी एक खिलौना सा लगती है। मुझे ये फोटो डालते हुए भी अजीब सा फील हो रहा। Social media पे ईस तरह के content कम से कम ही डालें। भगबान सबको अपने श्री चरणों में जगह देना । “ హిందీలో పోస్టులు పెట్టారు. అనువదించగా, తల్లులు పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, పిల్లలు పాఠశాల నుండి నేరుగా స్వర్గానికి వెళ్ళారు. ఇలాంటి భయంకరమైన చిత్రాలను చూసిన తర్వాత ఎంతో బాధగా అనిపిస్తూ ఉంటుందని ఆ పోస్టుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
“रास्ता देखती रह गई माएं । बच्चे स्कूल से सीधे स्वर्ग चले गए ।। #JhalawarTragedy #Rajasthan” అంటూ మరికొందరు ఇది రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఘటన అంటూ పోస్టులు పెడుతున్నారు. ఝలావర్, రాజస్థాన్‌లను ట్యాగ్ చేస్తూ, రాజస్థాన్‌లోని ఝలావర్‌లో పాఠశాల పైకప్పు కూలిపోయి అనేక మంది విద్యార్థులు మరణించిన సంఘటనను చిత్రం చూపిస్తుంది.
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఈ చిత్రం AI ద్వారా సృష్టించారు. ఇది నిజమైన సంఘటనకు సంబంధించింది కాదు.
ఉత్తరాఖండ్‌లో ధ్వంసమైన పాఠశాల భవనం గురించి వార్తల కోసం మేము వెతికినప్పుడు, దాని గురించి మాకు ఎటువంటి సమాచారం లేదా దృశ్యాలు లభించలేదు. రాజస్థాన్‌లోని ఝలావర్‌లో పాఠశాల పైకప్పు కూలిపోవడం గురించి వార్తల కోసం వెతికాం. ఝలావర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల భవనం కూలిపోవడంతో ఏడుగురు విద్యార్థులు చనిపోయారని, 29 మంది గాయపడ్డారని పేర్కొన్న అనేక వార్తా నివేదికలు మాకు కనిపించాయి. వార్తా నివేదికల్లో కూలిపోయిన కట్టడానికి సంబంధించిన చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఇవి వైరల్ చిత్రానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.
AI ద్వారా సృష్టించిన వైరల్ చిత్రాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, హర్షిల్, ధరాలి విపత్తుతో తప్పుగా లింక్ చేస్తున్నారని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఉత్తరకాశీ పోలీసులు పోస్ట్ చేసిన పోస్ట్‌ను కూడా మేము కనుగొన్నాము. పూర్తిగా తప్పుదారి పట్టించే పోస్టులు అని తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏ వార్తను ధృవీకరించకుండా షేర్ చేయవద్దని పోలీసులు ప్రజలను కోరారు.
వైరల్ అయిన చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, చిత్రం దిగువన ‘మెటా AI’ వాటర్‌మార్క్ కనిపించింది. స్క్రీన్‌షాట్ ను ఇక్కడ చూడొచ్చు. వాటర్‌మార్క్‌ను గమనించవచ్చు.
AI డిటెక్షన్ టూల్ హైవ్ మోడరేషన్ ఉపయోగించి చిత్రాన్ని తనిఖీ చేసినప్పుడు, చిత్రం 99% AI ద్వారా సృష్టించారని మేము కనుగొన్నాము.
Was it AI అనే మరొక AI టూల్ ను ఉపయోగించి కూడా చిత్రాన్ని తనిఖీ చేసాము, ఇది చిత్రం AI ద్వారా సృష్టించినట్లుగా కూడా నిర్ధారించింది.
అందువల్ల, వైరల్ చిత్రం AI- జనరేటెడ్ చిత్రం, దీనికి ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి, రాజస్థాన్‌లోని ఝలావర్‌లో ఇటీవల జరిగిన సంఘటనలకు ఎటువంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim : వైరల్ చిత్రం తరగతి గదిలో జరిగిన ప్రమాదంలో చాలా మంది పిల్లలు మరణించినట్లు చూపిస్తోంది
Claimed By : Facebook Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Facebook
Fact Check : False
News Summary - school children killed in Uttarakhand
Next Story

