ఫ్యాక్ట్ చెక్: ఈడెన్ గార్డెన్స్‌లో 1884లో స్వామి వివేకానంద బౌలింగ్ చేస్తున్నట్టు చూపే వైరల్ చిత్రం ఫేక్
స్వామి వివేకానంద, ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక వేత్త. వేదాంతం, యోగా, భారతీయ తత్వశాస్త్రాన్ని పశ్చిమ దేశాలకు పరిచయం చేసిన

Claim :
1884లో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో స్వామి వివేకానంద బౌలింగ్ వేస్తున్నప్పటి వైరల్ చిత్రంFact :
వైరల్ చిత్రాన్ని ఎడిట్ చేశారు. అసలు చిత్రం 1940 నాటి యార్క్‌షైర్ క్రికెటర్ హెడ్లీ వెరిటీని చూపిస్తుంది.
స్వామి వివేకానంద, ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక వేత్త. వేదాంతం, యోగా, భారతీయ తత్వశాస్త్రాన్ని పశ్చిమ దేశాలకు పరిచయం చేసిన సామాజిక సంస్కర్త. పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో, ఇరవయ్యవ శతాబ్దం మొదట్లో ఇటు భారతదేశంలోనూ, అటు అమెరికాలోనూ స్వామి వివేకానంద స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం బాగా ప్రసిద్ధి చెందింది.
జూలై 4 న స్వామి వివేకానంద పుణ్య తిథి సందర్భంగా భారత్ ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. 'స్వామి వివేకానంద పుణ్య తిథి నాడు నేను ఆయనకు నమస్కరిస్తున్నాను. ఆయన ఆలోచనలు, దార్శనికత మన సమాజానికి మార్గదర్శక కాంతిగా మిగిలిపోయాయి. ఆయన మన చరిత్ర, సాంస్కృతిక వారసత్వం పట్ల గర్వం, విశ్వాసాన్ని రేకెత్తించారు. సేవ, కరుణ మార్గంలో నడవడంపై కూడా ఆయన ప్రాధాన్యతనిచ్చారు.' అంటూ ఆయన ట్వీట్ చేసారు.
ఇంతలో, 1884లో ఈడెన్ గార్డెన్స్‌లో కలకత్తా టౌన్ క్లబ్ తరపున బౌలింగ్ చేస్తున్నప్పుడు స్వామి వివేకానంద అంటూ ఒక చిత్రం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని తెలుగుపోస్ట్కు ధృవీకరణ కోసం వాట్సాప్‌లో పంపారు.
అయితే, ఈ చిత్రం వివిధ ప్లాట్‌ఫామ్‌లలో అదే శీర్షికతో వైరల్ అవుతోందని కూడా మేము తెలుసుకున్నాం.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ చిత్రం ఎడిట్ చేశారు. అసలు చిత్రంలో హెడ్లీ వెరిటీ అనే ఇంగ్లీష్ క్రికెటర్‌ను చూపిస్తుంది.మేము చిత్రాన్ని ఉపయోగించి గూగుల్ లో వెతకగా, అసలు చిత్రం హెడ్లీ వెరిటీ అనే ఇంగ్లీష్ క్రికెటర్‌ను చూపిస్తుందని కనుగొన్నాము. అసలు చిత్రం మార్చి 4, 2005న అప్లోడ్ చేసిన గెట్టి ఇమేజెస్‌లో షేర్ చేశారు. ఈ చిత్రం జనవరి 1, 1940న తీశారు. ఈ చిత్రం శీర్షికలో ‘యార్క్‌షైర్ క్రికెటర్ హెడ్లీ వెరిటీ (1905 - 1943) యాక్షన్‌లో, సిర్కా 1940 (ఫోటో హల్టన్ ఆర్కైవ్/జెట్టి ఇమేజెస్) అని ఉంది.
‘Hedley Verity tosses the ball, 1940’ అనే క్యాప్షన్ తో ఇదే చిత్రాన్ని ESPNcrciinfo వెబ్సైట్లో కూడా షేర్ చేశారు. స్టాక్ ఇమేజ్ వెబ్సైట్లో కనిపించే చిత్రంతో వైరల్ చిత్రాన్ని పోల్చి చూసాం, పోలిక ఇక్కడ చూడొచ్చు.
స్వామి వివేకానంద క్రికెట్ ఆడారా అని తెలుసుకోడానికి మేము ప్రయత్నించినప్పుడు, ఆయన టౌన్ క్లబ్ తరపున క్రికెట్ ఆడారని తెలిపే కొన్ని వార్తా నివేదికలు మాకు కనిపించాయి. ఆ మ్యాచ్‌లో ఆయన 7 వికెట్లు తీశారని చెప్పారు.