ఫ్యాక్ట్ చెక్: AI ఏజెంట్లు (మెటా ఏఐ) వాట్సాప్ గ్రూపులు, వ్యక్తిగత చాట్లను చదవలేవు
అధునాతన చాట్ ప్రైవసీ ఫీచర్‌ను ఎనేబుల్ చేయమని వాట్సాప్ వినియోగదారులను హెచ్చరిస్తూ ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది.

Claim :
చాట్ ప్రైవసీ ఫీచర్ ప్రారంభించకపోతే AI ఏజెంట్లు (మెటా AI వంటివి) వాట్సాప్ గ్రూపులు, వ్యక్తిగత చాట్లను యాక్సెస్ చేయగలవుFact :
Meta AI వంటి AI ఏజెంట్లు నేరుగా షేర్ చేసిన సందేశాలను మాత్రమే యాక్సెస్ చేయగలవు. అన్ని Whatsapp చాట్లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయి
అధునాతన చాట్ ప్రైవసీ ఫీచర్‌ను ఎనేబుల్ చేయమని వాట్సాప్ వినియోగదారులను హెచ్చరిస్తూ ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ ఫీచర్ యాక్టివేట్ చేయకపోతే వాట్సాప్ గ్రూపులు, చాట్లు AI సంబంధిత సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ కు గురయ్యే అవకాశం ఉందని పోస్ట్‌లు చెబుతున్నాయి. AI ఏజెంట్లు గ్రూప్ సభ్యులు, వ్యక్తుల సందేశాలు, సంప్రదింపు వివరాలను చట్టబద్ధంగా యాక్సెస్ చేయగలవని కూడా ఈ పోస్ట్‌లు చెబుతున్నాయి.
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. AI ఏజెంట్లు whatsapp గ్రూపులలోని సందేశాలను, వ్యక్తిగత సందేశాలను కూడా యాక్సెస్ చేయలేరు.
Meta AI అనేది Whatsappలో AI ఆధారిత సహాయానికి మాత్రమే ఉంటుంది. ఇది వినియోగదారులు AIతో సంభాషించడానికి అనుమతిస్తుంది. పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు, చిత్రాలను రూపొందించగలదు. వినియోగదారు ప్రాంప్ట్‌ల ఆధారంగా సృజనాత్మక పనులకు కూడా సహాయపడుతుంది. దీనిని ప్రత్యేక చాట్ ఇంటర్ఫేస్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. వ్యక్తిగత, గ్రూప్ చాట్లలో ఉపయోగించవచ్చు.
Whatsapp సహాయ కేంద్రం పేజీలోని FAQ పేజీ లో ‘మీరు ఈ ఫీచర్లను ఉపయోగించాలని ఎంచుకున్నప్పుడు, Meta మీ ప్రాంప్ట్‌లను, మీరు పంచుకునే సందేశాలను, సంబంధిత ప్రతిస్పందనలను మీకు నేరుగా అందించడానికి అభిప్రాయాన్ని స్వీకరిస్తుంది. యూజర్లు Meta AIతో భాగస్వామ్యం చేయడానికి ఎంచుకున్న సందేశాలను మాత్రమే Meta చదవగలదు. Meta మీ వ్యక్తిగత చాట్లలోని ఇతర సందేశాలను చదవదు. ప్రైవేట్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించే AI ఫీచర్ల కోసం మీరు మీ వ్యక్తిగత సందేశాలను షేర్ చేసినప్పుడు, Meta మీరు షేర్ చేసిన సందేశాలను చదవదు లేదా యాక్సెస్ చేయదు.’ అని వివరించారు.
వాట్సాప్ కు చెందిన ‘అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ’లోని హెల్ప్ పేజీ ప్రకారం, సెట్టింగ్ ఆన్‌లో ఉన్నప్పుడు, మనం ఇతరులను చాట్లను అప్లోడ్ చేయకుండా, ఫోన్‌కు మీడియాను ఆటో-డౌన్లోడ్ చేయకుండా, AI ఫీచర్ల కోసం సందేశాలను ఉపయోగించకుండా బ్లాక్ చేయవచ్చు. కానీ హెల్ప్ పేజీలో ‘AI ఏజెంట్ల’ నుండి రక్షించడం గురించి ఏమీ ప్రస్తావించలేదు.
వాట్సాప్ కు చెందిన faq పేజీలో కూడా ‘మీరు వాట్సాప్ మెసెంజర్ని ఉపయోగించి మరొక వ్యక్తితో చాట్ చేసినప్పుడు వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉపయోగిస్తుంది. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ మీ వ్యక్తిగత సందేశాలు, కాల్‌లను మీకు, మీరు కమ్యూనికేట్ చేస్తున్న వ్యక్తికి మధ్య ఉంచుతుంది. చాట్ వెలుపల ఎవరూ, వాట్సాప్ కూడా వాటిని చదవలేరు, వినలేరు లేదా షేర్ చేయలేరు. ఎందుకంటే ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో, మీ సందేశాలు లాక్‌తో భద్రపరచబడతాయి. వాటిని అన్‌లాక్ చేయడానికి, చదవడానికి అవసరమైన ప్రత్యేక కీని కలిగి ఉంటారు. ఇవన్నీ స్వయంచాలకంగా జరుగుతాయి. మీ సందేశాలను భద్రపరచడానికి ఏదైనా ప్రత్యేక సెట్టింగ్‌లను ఆన్ చేయవలసిన అవసరం లేదు.’ అని వివరించారు.
కనుక, మెటా AI వంటి AI ఏజెంట్లు గ్రూపులు, వ్యక్తిగత చాట్లలోని సందేశాలను చదవకుండా ఉంచడానికి Whatsappలో అధునాతన గోప్యతా సెట్టింగ్‌లను ఆన్ చేయాలని చెబుతోంది. వైరల్ సందేశం తప్పుదారి పట్టిస్తోంది.

