Fri Dec 05 2025 08:09:11 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైరల్ చిత్రం ఆఫ్ఘనిస్తాన్ మంత్రి నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని చూపడం లేదు
Viral image falsely claims women journalists attended Afghan Embassy press meet; event was at VIF in Delhi during Muttaqi’s visit

Claim :
ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయంలో ఆఫ్ఘనిస్తాన్ మంత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహిళా విలేకరులు ఉన్నట్లు వైరల్ చిత్రం చూపిస్తోందిFact :
ఈ చిత్రం ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయానికి సంబంధించింది కాదు. ఢిల్లీలోని వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమానికి సంబంధించింది
ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ మధ్య సమావేశం జరిగింది. ఇది చాలా ఆసక్తికరమైన సమావేశం కావడంతో అనేక దేశాల దృష్టిని ఆకర్షించింది. ఈ భేటీ సమయంలో ఇరు దేశాల జాతీయ జెండాలు ప్రదర్శించలేదు. ఇది ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించే ప్రశ్నను తప్పించే చర్యగా భావించారు.
ఇక అక్టోబర్ 10, 2025న ఢిల్లీలోని ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయంలో జరిగిన ప్రెస్ బ్రీఫింగ్లో మహిళా జర్నలిస్టులను అనుమతించలేదు. తాలిబాన్ పాలనలో మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఇప్పటికే ప్రపంచ దేశాలు, మానవ హక్కుల సంఘాలు ఎండగట్టాయి. ఇప్పుడు వారు వ్యవహరించిన తీరుపై విమర్శలు, ఆందోళనలు ఉత్పన్నమయ్యాయి. విమర్శల తర్వాత ముత్తాకీ రెండవ విలేకరుల సమావేశంలో ఈ సమస్యను పరిష్కరించడానికి మహిళా జర్నలిస్టులను కలిశారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచే ప్రయత్నాలలో భాగంగా అక్టోబర్ 9 నుండి అక్టోబర్ 16 వరకు ఆరు రోజుల పర్యటన కోసం ముత్తాకీ భారతదేశంలో ఉన్నారు. ఈ సమావేశం తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్‌తో సంబంధాలకు భారతదేశం తీసుకున్న ఒక కీలక అడుగును సూచిస్తుంది.
ఇలాంటి సమయంలో, ఒక పెద్ద హాలులో సమావేశానికి హాజరైన అనేక మంది వ్యక్తులను చూపించే ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయంలో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమ్రి ఖాన్ ముత్తాకి విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్టులు ఉన్నారని చెబుతూ షేర్ అవుతోంది.
“सत्य यह भी है कि अफगानिस्तान के विदेश मंत्री की प्रेस कांफ्रेंस में महिला रिपोर्टर्स उपस्थित थीं। फोटो देखिये. और गिन लीजिये कितनी महिलाएं हैं... मुझे तो 8-10 दिख रही हैं। परंतु मोदी विरोध के रोग से पीड़ित हमारे विपक्ष को नहीं दिखी। “ అంటూ పలు సోషల్ మీడియా ఖాతాలలో ఈ విజువల్స్ ను షేర్ చేశారు.
“Who are they? If female journalists weren't allowed at the Afghanistan Embassy, New Delhi.” అనే క్యాప్షన్ తో పలువురు షేర్ చేశారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. వైరల్ అవుతున్న చిత్రం న్యూఢిల్లీలోని వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఒక సమావేశాన్ని చూపిస్తోంది.
మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి చిత్రాన్ని శోధించినప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన వ్యక్తి అదే చిత్రాన్ని “The country's Foreign Minister also visited the VIF headquarters today, and in discussions with the officials and leaders of the Indian branch of VIF, he provided information about the deep economic, historical, cultural and civilizational ties between the two countries. VIF wrote on its X page that during his speech, Afghan Foreign Minister Maulvi Amir Khan Muttaqi also mentioned the famous story of Indian poet and writer Rabindranath Tagore, which touched their hearts. Tagore's "Kabliwala" is a very famous literary work that tells the story of the life and feelings of an Afghan businessman, an Afghan who comes to India, forms a friendly relationship with a small Indian child, his story has become a symbol of shared values of humanity, love and emotion. VIF is an Indian intellectual, research institution, a think-tank in English that conducts research in the fields of public policies, security, foreign relations, economy, civilization and culture and presents policy recommendations to the government” అనే శీర్షికతో పోస్టు చేశారు.
ఆ దేశ విదేశాంగ మంత్రి VIF ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. VIF లోని భారత అధికారులు, నాయకులతో చర్చలు నిర్వహించారు. రెండు దేశాల మధ్య లోతైన ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక, నాగరిక సంబంధాల గురించి మాట్లాడుకున్నారు. VIF తన X పేజీలో తన ప్రసంగంలో, ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి మౌల్వి అమీర్ ఖాన్ ముత్తాకి భారతీయ కవి, రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ కు చెందిన కథను కూడా ప్రస్తావించారని, అది వారి హృదయాలను తాకిందని రాశారు. ఇలా పలు అంశాలకు సంబంధించిందిన చర్చ జరిగింది.
మరొక X వినియోగదారుడు కూడా అదే చిత్రాన్ని “Female Media journos was there in vif event. Indian govt can't dictate Afghanistan fm what he should do in Afghanistan embassy.” అనే క్యాప్షన్‌తో పంచుకున్నారు
మేము VIF + ఆఫ్ఘన్ మినిస్టర్ అనే కీవర్డ్లను ఉపయోగించి శోధించినప్పుడు, VIF ఇండియా (వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్) చేసిన X పోస్ట్‌ను మేము కనుగొన్నాము, “Highlights from today's interaction at the VIF with Afghanistan’s Foreign Minister, H.E. Mawlawi Amir Khan Muttaqi. The conversation underscored the deep economic, historical, cultural, and civilizational ties between the two countries. His mention of Rabindranath Tagore's Kabuliwala struck a poignant chord with the audience.” అంటూ శీర్షిక పోస్టు చేశారు. ఈరోజు VIFలో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మావ్లావి అమీర్ ఖాన్ ముత్తాకీతో జరిగిన సంభాషణలోని ముఖ్యాంశాలున్నాయి. ఈ సంభాషణ రెండు దేశాల మధ్య ఉన్న లోతైన ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక, నాగరిక సంబంధాలను నొక్కి మరీ చెప్పింది. రవీంద్రనాథ్ ఠాగూర్ కాబూలివాలా గురించి ఆయన ప్రస్తావించడం ప్రేక్షకులను ఆకట్టుకుందని తెలుస్తోంది.
ఇండియా.కామ్ ప్రకారం, న్యూఢిల్లీలో వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (VIF) నిర్వహించిన ఒక కార్యక్రమానికి అమీర్ ఖాన్ ముత్తాకి హాజరయ్యారు. 1970లలో ప్రముఖ RSS నాయకుడు ఏక్నాథ్ రనడే స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ అయిన వివేకానంద కేంద్రం ఆధ్వర్యంలో 2009లో వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (VIF) స్థాపించారు. దీనిని RSS అనుబంధ సంస్థగా పరిగణిస్తారు.
ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఆదివారం న్యూఢిల్లీలో మరో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఈసారి మహిళా జర్నలిస్టులను ఆహ్వానించారు. ఆయన మునుపటి మీడియా సమావేశానికి మహిళలను పిలవకుండా ఉండడంతో విమర్శలు ఎదురవ్వడంతో మహిళా జర్నలిస్టులను ఆహ్వానించారు.
కనుక, వైరల్ చిత్రం ఆఫ్ఘన్ రాయబార కార్యాలయంలో ఆఫ్ఘనిస్తాన్ మంత్రి నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని చూపించలేదు. కానీ వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆఫ్ఘన్ మంత్రి హాజరైన సమావేశాన్ని చూపిస్తుంది, అక్కడ మహిళా జర్నలిస్టులు పాల్గొన్నారు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim : ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయంలో ఆఫ్ఘనిస్తాన్ మంత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహిళా విలేకరులు ఉన్నట్లు వైరల్ చిత్రం చూపిస్తోంది
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : Misleading
News Summary - VIF event Afghan minister Delhi photos
Next Story

