ఫ్యాక్ట్ చెక్: రెచ్చగొట్టే నినాదాలతో ఇంటి లోకి దూసుకుపోతున్న జనాన్ని చూపుతున్న వీడియో తెలంగాణా కి చెందింది కాదు
రంజాన్ మాసంలో తమ ఆచారాలను పాటించడానికి అనువుగా తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థలలో

Claim :
రెచ్చగొట్టే నినాదాలతో హిందువుల ఇళ్లలోకి బలవంతంగా ప్రవేశిస్తున్న హింసాత్మక జనాన్ని చూపిస్తున్న వీడియో తెలంగాణ కి చెందింది.Fact :
వీడియో తెలంగాణ నుండి కాదు, ఇటీవలిది కాదు, ఇది పాకిస్తాన్‌లోని హైదరాబాద్ లో జరిగిన ఘటన చూపిస్తోంది, ఇది 2022 సంవత్సరం లో జరిగింది
రంజాన్ మాసంలో తమ ఆచారాలను పాటించడానికి అనువుగా తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థలలో పని చేస్తున్న ముస్లిం ఉద్యోగులకు పని వేళలలో ఒక గంట తగ్గిస్తూ ముందుగానే ఇంటికి వెళ్లేందుకు అనుమతిని మంజూరు చేసింది. కానీ, ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శించారు. వారు ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నాయకులు టోకనిజం అంటూ అభివర్ణించారు. ఉపవాసం ఆచరించే హిందువుల పండుగల సమయంలో ఇలాంటి రాయితీలు ఎందుకు ఇవ్వడం లేదని వారు ప్రశ్నించారు.
ఈ పరిస్థితుల మధ్య, ఒక నివాస భవనంలోకి గుంపుగా, కోపంగా దూసుకు పోతున్న కొందరు వ్యక్తులను చూపించే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కొందరు వ్యక్తులు బలవంతంగా గోడలు ఎక్కి, తలుపులు బలంగా తడుతూ, "సర్ తన్ సే జుదా" అంటే "శరీరం నుండి తలను వేరు చేస్తాం" అంటూ నినాదాలు చేస్తున్న వీడియో హిందీలో "ये नजारा अफगानिस्तान,पाकिस्तान का नहीं तेलंगाना का दृश्य है।जो सर तन से जुदा नारे के साथ हिन्दुओं के घरों में जबरन घुस रहें हैं ల్ अपनी सुरक्षा स्वयंम करो वर्ना कश्मीर जैसे हालात हो जाएंगे,कोइ नेता,मिडिया तुम्हें बचाने नहीं आएगी जैसे कश्मीर में हिन्दुओं को कोई बचाने नहीं गया ।।*" అనే శీర్షికతో సర్క్యులేట్ అవుతోంది.
దీనిని అనువదించినప్పుడు, "ఈ దృశ్యం ఆఫ్ఘనిస్తాన్ లేదా పాకిస్తాన్ నుండి కాదు, తెలంగాణ కి చెందిన ది. వారు 'సర్ తన్ సె జుదా' వంటి నినాదాలతో హిందువుల ఇళ్లలోకి బలవంతంగా ప్రవేశిస్తున్నారు. మీ స్వంత భద్రతను మీరే చూసుకోండి, లేకపోతే పరిస్థితి కాశ్మీర్ లాగా మారుతుంది, కాశ్మీర్లో హిందువులను రక్షించడానికి ఎవరూ రాని విధంగా మిమ్మల్ని రక్షించడానికి ఏ నాయకుడు, మీడియా రాదు.*" అంటూ వీడియో ను షేర్ చేస్తున్నారు.
క్లెయిం స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
ఈ వాదన అబద్దం. వైరల్ వీడియో తెలంగాణలో తీసినది కాదు, ఇటీవలిది కూడా కాదు. ఇది 2022 సంవత్సరంలో పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో తీసినది.
వైరల్ వీడియో నుండి కీ ఫ్రేమ్‌లను సంగ్రహించి, ఘూగ్లె రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించగా, వీడియో పాకిస్తాన్‌లోని హైదరాబాద్ లో జరిగిన సంఘటన చూపిస్తోందనడానికి ఎన్నో కథనాలు, సోషల్ మీడియా పోస్ట్‌లు లభించాయి.
సోషల్ మీడియాలోని కొన్ని పోస్ట్‌ల ప్రకారం, పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో జరిగిన వ్యక్తిగత ఘర్షణ కారణంగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. మైనారిటీ హిందూ వర్గానికి చెందిన ఒక వ్యక్తిపై దైవదూషణకు సంబంధించిన తప్పుడు కేసు నమోదు అయ్యింది. ఈ వ్యక్తిని పాకిస్తాన్‌లోని సద్దార్, హైదరాబాద్‌లోని రాబియా సెంటర్లో పనిచేసే అశోక్ కుమార్ అనే స్వీపర్ అని తెలుస్తోంది, అతని పైన ఒక హింసాత్మక సమూహం దాడి చేసినట్టు, ఆ ఘటన ఈ వీడియో చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
ఫ్రీ ప్రెస్జర్నల్ ప్రకారం, "దైవదూషణ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక హిందూ పారిశుద్ధ్య కార్మికుడిని అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఒక గుంపు హింసాత్మకంగా మారి అతని పై దాడి కి దిగింది. హైదరాబాద్ పోలీసులు (పాకిస్తాన్) వీరిని చెదరగొట్టారు." అని ముబాషిర్ జైదీ ట్వీట్లో తెలిపారు. ఖురాన్ పవిత్రతను అవమానించాడంటూ ఆరోపైస్తూ పాకిస్తాన్ లోని హైదరాబాద్‌లో ఒక హిందూ పారిశుద్ధ్య కార్మికుడు అశోక్ కుమార్‌పై 295భ్ దైవదూషణ కింద కేసు నమోదు అయ్యింది. దుకాణదారుడు బిలాల్ అబ్బాసీతో గొడవ జరిగిన తర్వాత ఈ ఆరోపణ వచ్చింది, అతను కుమార్ పై ఫిర్యాదు చేశాడు." దైవదూషణ ఆరోపణలు మోపి పాకిస్తాన్లో చాలా మందిని కొట్టి చంపారు. న్యాయవాదులు తమ ప్రాణాలకు భయపడి వారిని రక్షించడానికి నిరాకరించడంతో న్యాయం పొందే ఆశ లేకుండా లెక్కలేనంత మంది సంవత్సరాలుగా జైళ్లలో మగ్గుతున్నారు. వైరల్ వీడియో కూడా ఇలాంటి ఉదంతాన్నే చూపిస్తోంది.
తెలంగాణ టుడేలో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం, ఈ వీడియో ఆగస్ట్ 2022 లో, పాకిస్తాన్ లో జరిగిన సంఘటనను చూపిస్తోంది. 2022 సెప్టెంబరులో ఇదే వీడియోను హైదరాబాద్, తెలంగాణలో జరిగిన సంఘటనగా షేర్ చేసినప్పుడు, తెలుగుపోస్ట్ కూడా 2022 సంవత్సరంలో వైరల్ వీడియోను డీబంక్ చేసింది. కనుక, వైరల్ వీడియో హైదరాబాద్, తెలంగాణ కి చెందినది కాదు, ఇటీవలిది కూడా కాదు. ఈ వాదన అబద్దం.