ఫ్యాక్ట్ చెక్: కచోరీ స్టాల్ లో ఎలుకలు తిరుగుతున్నట్టు చూపుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
భారతదేశంలో పురాతన కాలం నుండి వీధుల్లో ఆహారాన్ని అమ్మే సంస్కృతి ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వివిధ రకాల

Claim :
కచోరీలు అమ్ముతున్న షాప్ లో ఆహారంపై ఎలుకలు తిరుగుతూ కనపడ్డాయిFact :
ఈ వీడియోను ఆఈ ద్వారా సృష్టించారు. అసలు వీడియోకు డిజిటల్ గా ఎలుకలను జోడించారు.
భారతదేశంలో పురాతన కాలం నుండి వీధుల్లో ఆహారాన్ని అమ్మే సంస్కృతి ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వివిధ రకాల సంస్కృతుల కలయిక వీధి ఆహారంలో భాగమైంది. ఉత్తర భారతదేశంలో వీధుల్లో అమ్మే ఆహారంలో ఎక్కువ గ్రేవీ, చోలే పూరి, చాట్ వంటి ఆహార పదార్థాలు ఉంటాయి, దక్షిణ భారతదేశంలో ఇడ్లీ, దోస వంటి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. పశ్చిమ భారతదేశంలో వడ పావ్, పావ్ భాజీ వంటి స్పైసీ ఫుడ్ కనిపిస్తుంది, తూర్పున ఝల్ మురి, చుర్మురి వంటివి ప్రజలకు ఇష్టమైనవి. దేశవ్యాప్తంగా టీ, కాఫీతో పాటు ఆల్ టైమ్ ఫేవరెట్స్ సమోసా, కచోరీలను విక్రయించే ఎన్నో స్టాల్స్ ను కూడా మనం చూస్తాము. స్ట్రీట్ ఫుడ్ ఎంతో సులభంగా లభిస్తుంది. సరసమైన ధరలకే లభిస్తూ ఉండడంతో ప్రజలను తప్పకుండా ఆకర్షిస్తుంది. కానీ ఈ ఆహారాల చుట్టూ బ్యాక్టీరియా, వైరస్ ముప్పు కూడా పొంచి ఉంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. రోడ్డు పక్కన విక్రయించే వీధి ఆహారం మీద దుమ్ము, ఈగలు, ఎలుకల బెడద కూడా ఉంటుంది.
ఫ్యాక్ట్ చెక్:
ఈ వీడియోను డి-ఇంటెంట్ డేటా వారి X ప్రొఫైల్లో ఖండిస్తున్నట్లు వివరణ ఇచ్చింది.