Tue Jul 08 2025 17:15:16 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: నిర్మలా సీతారామన్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ లో డబ్బు పెట్టుబడి పెట్టమంటూ చెబుతున్న వీడియో ఏఐ తో తయారు చేసింది
ప్రజలను మోసం చేయడానికి సోషల్ మీడియాను ఓ వేదికగా మార్చుకున్నారు మోసగాళ్లు. సోషల్ మీడియాలో మోసపూరిత "డీప్‌ఫేక్" వీడియోలు

Claim :
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ లో డబ్బు పెట్టుబడి పెట్టమని ప్రజలను ప్రోత్సహిస్తున్నారుFact :
ఆడియోను AI సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎడిట్ చేశారు. భారత ఆర్థిక మంత్రి అలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పెట్టుబడి పెట్టమని కోరలేదు
ప్రజలను మోసం చేయడానికి సోషల్ మీడియాను ఓ వేదికగా మార్చుకున్నారు మోసగాళ్లు. సోషల్ మీడియాలో మోసపూరిత "డీప్‌ఫేక్" వీడియోలు షేర్ చేయబడటంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు హెచ్చరికలను జారీ చేసింది. ఈ వీడియోలు సెంట్రల్ బ్యాంక్ కొన్ని పెట్టుబడి పథకాలను ప్రారంభించినట్లు లేదా ఆమోదించినట్లు పేర్కొంటున్నాయి. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదు. ఆర్థిక మార్గదర్శకత్వాన్ని అందిస్తూ సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న 'టాప్ మేనేజ్మెంట్ డీప్‌ఫేక్ వీడియోలు' పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆర్బిఐ ఒక అధికారిక ప్రకటనలో ప్రజలకు సూచించింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన వీడియోలు నిజమైనవి కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచిస్తోంది.
నిర్మలా సీతారామన్ రూ. 21000 పెట్టుబడితో నెలకు రూ.15,00,000 సంపాదించగల పెట్టుబడి పథకం గురించి ప్రజలతో మాట్లాడుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. నిర్మలా సీతారామన్ మాటల్లో "ఆర్థిక స్థిరత్వం మనలో ప్రతి ఒక్కరి శ్రేయస్సుకు పునాది. నేటి మారుతున్న ఆర్థిక వ్యవస్థలో, మన వృద్ధి, శ్రేయస్సు కోసం కొత్త అవకాశాలను వెతకాలి. ఈ రోజు, నేను మిమ్మల్ని ఒక విప్లవాత్మక వేదికకు పరిచయం చేయాలనుకుంటున్నాను. క్వాంటం AI ఇప్పటికే వేలాది మంది భారతీయులు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడంలో సహాయపడింది. 350,000 కంటే ఎక్కువ మంది భారతీయులు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ప్రారంభించారు. గతంలో, ఇది ఒక నిర్దిష్ట పెట్టుబడిదారుల సమూహానికి మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ, ఇది ఇప్పుడు అందరు భారతీయ పౌరుల కోసం తెరిచారు." అని ఉంది.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఏఐ ఆడియో ను వాడి తయారు చేసారు. వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, ఇండియా టుడే గ్రూప్ ప్రచురించిన కొన్ని వీడియోలు మాకు కనిపించాయి.
ఇండియా టుడే ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసిన వీడియోలో భారత ఆర్థిక మంత్రి అదే బ్యాగ్రౌండ్ లో, అదే దుస్తులలో ఉన్నట్లు చూపిస్తుంది. ఈ వీడియోను
“FM Nirmala Sitharaman #exclusive "GST has actually reduced the rate of goods much better than what it was before the introduction of GST" - FM Nirmala Sitharaman. #BudgetRoundtable2025 #Budget2025 | @నసీతారామం @rahulkanwal @sahiljoshii @sakshibatra18 @szarabi" అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.

“EXCLUSIVE: FM Nirmala Sitharaman Emphasises Govt’s Focus On Fiscal Discipline #PostBudgetRoundTable #BudgetwaytheBTway #Modinomics2025 #BusinessToday #Budget2025Live” అంటూ బిజినెస్ టుడే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో మరో వీడియో షేర్ చేశారు.
“LIVE & Exclusive | FM Nirmala Sitharaman At The IT-BT Post Budget Round Table” అనే శీర్షికతో బిజినెస్ టుడే YouTubeలో ప్రత్యక్ష ప్రసారం చేసిన నిడివి ఎక్కువ ఉన్న వీడియో కూడా మాకు లభించింది.
వీడియో వివరణలో 2025 కేంద్ర బడ్జెట్ నుండి కీలకమైన అంశాలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జరిగిన ప్రత్యేక చర్చను చూపిస్తుంది. ఈ వీడియో ఫిబ్రవరి 4, 2025న షేర్ చేశారు. ఈ వీడియోలోGST, పరోక్ష పన్ను సంస్కరణలు, ఇతర అంశాల గురించి బిజినెస్ టుడే ఎడిటర్ సిద్ధార్థ్ జరాబి అడిగిన ప్రశ్నలకు భారత ఆర్థిక మంత్రి సమాధానమిచ్చారు. అంతే తప్ప ఆమె ఏ పెట్టుబడి వేదిక గురించి ప్రస్తావించలేదు. ఈ ఇంటర్వ్యూను ఇండియా టుడే-బిజినెస్ టుడే పోస్ట్ బడ్జెట్ 2025 కాన్ఫరెన్స్ ప్రత్యక్ష ప్రసారం చేసింది, ఇక్కడ సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న సమర్పించిన 2025 కేంద్ర బడ్జెట్ నుండి కీలకమైన అంశాలను చర్చించారు. బిజినెస్ టుడే షేర్ చేసిన వీడియోలో ఎక్కడా వీడియోలోని వైరల్ భాగం లభించలేదు.
డీప్‌ఫేక్స్ అనాలిసిస్ యూనిట్ (DAU) సహాయంతో, వైరల్ వీడియోలో ఆడియో తారుమారు చేశారా లేదా అని తెలుసుకోడానికి మేము ప్రయత్నించాము. హియా AI ఆడియో వర్గీకరణ సాధనం AI ద్వారా వాయిస్ ను క్రియేట్ చేశారని లేదా ఎడిట్ చేశారని కనుగొన్నాం. ఇక్కడ స్క్రీన్‌షాట్ ఉంది.

డీప్‌ఫేక్-ఓ-మీటర్ అనే సాధనం 6 ఆడియో వర్గీకరణలను ఉపయోగించి ఆడియోను విశ్లేషించింది. వాటిలో ఐదింట్లో ఆడియో 'AI జనరేట్ చేసినది' అని అధిక స్కోర్‌ను చూపించాయి. ఇక్కడ స్క్రీన్‌షాట్ ఉంది.
అనేక మంది భారతీయ రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆన్లైన్ పెట్టుబడి వేదికకు మద్దతు ప్రకటిస్తున్నారని పేర్కొంటూ అనేక డీప్‌ఫేక్ వీడియోలు చెలామణిలో ఉన్నాయి, క్వాంటం AIని అనేక ఫ్యాక్ట్ చెక్ సంస్థలు తోసిపుచ్చాయి. నిర్మలా సీతారామన్ ఓ ఆన్ లైన్ పెట్టుబడి వేదికను ప్రమోట్ చేస్తున్న వీడియో నకిలీ అని స్పష్టంగా తెలుస్తోంది.
కనుక, భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నెలకు రూ. 21000 పెట్టుబడితో రూ. 15,00,000 సంపాదించగల పెట్టుబడి పథకం గురించి ప్రజలతో మాట్లాడుతున్నట్లు చూపించే వైరల్ వీడియో ఒక డీప్‌ఫేక్ వీడియో. వైరల్ అవుతున్న వాదనను నమ్మవద్దు. అలాంటి సైట్లను మీ డబ్బులను పెట్టుబడిగా పెట్టి మోసపోవద్దు.
Claim : భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ లో డబ్బు పెట్టుబడి పెట్టమని ప్రజలను ప్రోత్సహిస్తున్నారు
Claimed By : Facebook User
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Facebook
Fact Check : False
Next Story