Sat Jul 12 2025 13:15:16 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: విమాన సిబ్బందితో భారతీయ యువతి వాదిస్తూ చూపిస్తున్నది ఒక స్క్రిప్టెడ్ వీడియో
విమానాల్లో ప్రయాణించే సమయంలో అనేక నియమాలను పాటించాల్సి ఉంటుంది. విమాన ప్రయాణానికి సంబంధించిన వివిధ అంశాలను కవర్ చేస్తాయి

Claim :
విమానం టేకాఫ్ అయ్యే ముందు తన ట్రే టేబుల్‌ను మడవడానికి నిరాకరిస్తూ, విమాన సిబ్బందితో భారతదేశానికి చెందిన అమ్మాయి వాదిస్తోందిFact :
వీడియో నటీనటులతో సృష్టించిన స్క్రిప్టెడ్ వీడియో, నిజమైన సంఘటన కాదు
విమానాల్లో ప్రయాణించే సమయంలో అనేక నియమాలను పాటించాల్సి ఉంటుంది. విమాన ప్రయాణానికి సంబంధించిన వివిధ అంశాలను కవర్ చేస్తాయి. మనం తీసుకుని వెళ్లే వస్తువుల పరిమితుల నుండి విమానంలో ప్రవర్తన వరకు చాలా విషయాల్లో నియమాలు పాటించాల్సి ఉంటుంది. ప్రధాన నియమాలలో క్యారీ-ఆన్ సామాను ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్లలో లేదా ముందు సీటు కింద నిల్వ చేయడం, క్యాబిన్ లో తీసుకుని వెళ్లే వస్తువులకు సంబంధించి కత్తులు, బొమ్మ తుపాకులు, ఇతర ప్రమాదకరమైన వస్తువులపై పరిమితులు ఉన్నాయి. ప్రయాణీకులు అత్యవసర సమయాల్లో క్యాబిన్ సిబ్బంది సూచనలను కూడా పాటించాలి. ఇతర ప్రయాణీకుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
ఒక భారతీయ అమ్మాయి తన ఖరీదైన బ్యాగు కారణంగా టేకాఫ్ సమయంలో తన ముందు ఉన్న ట్రే టేబుల్‌ను మడవడానికి నిరాకరిస్తుందనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు. క్యాబిన్ సిబ్బందితో వాదిస్తున్న ఒక మహిళ వీడియో Xలో వైరల్ అవుతోంది. “She refused to fold the tray table because of her expensive bag. Sis, if your bag is too costly for takeoff, maybe you should’ve bought a jet, not a seat in economy. AMEERO KE CHOCHLE #tranding #viralvideo #Dior #LVFashion #bag #ameer #viral #Girlfights #indigoflight #indigo” అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేస్తున్నారు. డబ్బున్న మహిళ తన బ్యాగ్ విషయంలో ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించిందనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఈ వీడియో స్క్రిప్టెడ్ అని తెలుస్తోంది.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఆ వీడియో నటీనటులతో చిత్రీకరించారని మేము కనుగొన్నాము. నాగ్‌పూర్‌లోని ఏవియేషన్ శిక్షణా కేంద్రం ‘ఫ్లై హై ఇన్స్టిట్యూట్’ అనే యూట్యూబ్ ఛానెల్లో అక్టోబర్ 18, 2024న ‘As per safety regulations, the cabin must be secured for takeoff’ అనే శీర్షికతో ప్రచురించిన వీడియోను మాకు లభించింది.
వీడియో వివరణలో, భద్రతా నిబంధనలు, DGCA ప్రకారం, టేకాఫ్, ల్యాండింగ్, సీట్‌బెల్ట్ గుర్తు ఆన్‌లో ఉన్నప్పుడల్లా క్యాబిన్‌ను సురక్షితంగా ఉంచాలి. అన్ని భద్రతా ప్రోటోకాల్‌లను పాటించేలా చూసుకోవడానికి క్యాబిన్ సిబ్బంది బాధ్యత వహిస్తారు. అయితే, ప్రతి ప్రయాణీకుడికి నియమాలను వివరించడం సవాలుగా ఉంటుంది. ముందు ఉండే ట్రే విషయంతో సహా భద్రతా విధానాలను అనుసరించడం ప్రాముఖ్యత గురించి సిబ్బంది నుండి అనేక వివరణలు, సలహాలు ఇస్తూ ఉంటారు. ఒక ప్రయాణీకురాలు తన ఖరీదైన బ్యాగ్‌ను ఓవర్‌హెడ్ బిన్లో లేదా సీటు కింద ఉంచడానికి నిరాకరించారు. సిబ్బంది వివరించడానికి ప్రయత్నించినప్పటికీ, ఆమె ప్రతిఘటించడం కొనసాగించింది. చివరికి, సిబ్బంది కెప్టెన్‌కు తెలియజేయాల్సి వచ్చింది, భద్రతా నియమాలను పాటించడంలో విఫలమైతే ఆమెను దింపేస్తామని కూడా తెలిపారు. ఇది విన్న ప్రయాణీకురాలు సహకరించి సిబ్బంది సూచనలను పాటించింది. #flyhighinstitutenagpur
మరింతగా వెతికగా, ఇలాంటి సంఘటనలను చూపించే అనేక ఇతర వీడియోలు ఈ యూట్యూబ్ ఛానెల్లో ప్రచురించారు. ఫ్లై హై ఇన్స్టిట్యూట్ అనే యూట్యూబ్ ఛానల్ నాగ్‌పూర్‌లోని ఒక విమానయాన శిక్షణా కేంద్రం, ఇది అవగాహన ప్రయోజనాల కోసం సోషల్ మీడియాలో క్రమం తప్పకుండా స్క్రిప్ట్ చేసిన వీడియోలను పంచుకోవడానికి ప్రసిద్ధి చెందింది.
ఫ్లై హై ఇన్స్టిట్యూట్ అన్ని ప్రధాన అంతర్జాతీయ, దేశీయ విమానయాన సంస్థలు, ప్రముఖ 5-స్టార్ హోటల్ చైన్లు, ప్రముఖ విమానయాన, ఆతిథ్య, ప్రయాణ, పర్యాటక నిర్వహణ సంస్థలతో దీర్ఘకాలిక సంబంధాలను ఏర్పరచుకుంది. ఈ కంపెనీలు ఫ్లై హై ఇన్స్టిట్యూట్లోని విద్యార్థులతో ప్రత్యేకమైన క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తాయి. విమానయాన ప్రపంచానికి, సేవా రంగానికి చక్కటి ఆహార్యం కలిగిన, శిక్షణ పొందిన నిపుణులను అందించడం ఈ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో నిజమైనది కాదు, నటీనటులతో వీడియోను సృష్టించారు. ఈ వీడియోలో ఒక భారతీయ అమ్మాయి తన ఖరీదైన బ్యాగ్ కారణంగా ట్రే ను మడవడానికి నిరాకరించిందని చెబుతున్న వాదన నిజం కాదు.
Claim : విమానం టేకాఫ్ అయ్యే ముందు తన ట్రే టేబుల్‌ను మడవడానికి నిరాకరిస్తూ, విమాన సిబ్బందితో భారతదేశానికి చెందిన అమ్మాయి వాదిస్తోంది
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story