ఫ్యాక్ట్ చెక్: మైక్రోసాఫ్ట్ US ఆఫీసులో భారతీయులు అధిక సంఖ్యలో ఉన్నారంటూ షేర్ అవుతున్న వీడియో హైదరాబాద్ కు చెందినది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు భారతదేశానికి చెందిన

Claim :
మైక్రోసాఫ్ట్ యుఎస్ కార్యాలయం వీడియోలో అందరూ భారతీయ ఉద్యోగులే ఉండడం మనం చూడొచ్చుFact :
వీడియోలో ఉన్నది, మైక్రోసాఫ్ట్ అమెరికా కార్యాలయం కాదు. హైదరాబాద్లోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ క్యాంపస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు భారతదేశానికి చెందిన నిపుణులను నియమించుకుని, చైనాను అవుట్సోర్సింగ్ కోసం వాడుతున్నారని విమర్శించారు. వాషింగ్టన్లో జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడుతూ, అమెరికన్లకు మరిన్ని ఉద్యోగాలను సృష్టించడంపై దృష్టి పెట్టాలని ఆయన టెక్ కంపెనీలను కోరారు. మైక్రోసాఫ్ట్ 2025 ఇటీవలి కాలంలో పలువురిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మేలో సుమారు 6,000 మందిని ఉద్యోగాల నుండి తొలగించారు. ఆ తర్వాత జూలైలో మరో రౌండ్ తొలగింపులు జరిగాయి. ఇది దాదాపు 9,000 మంది ఉద్యోగులను ప్రభావితం చేసింది. ఈ తొలగింపులు మైక్రోసాఫ్ట్ పునర్నిర్మాణ ప్రయత్నాలలో భాగమని, పనితీరు సమస్యలకు మాత్రమే సంబంధించినవి కాదని CEO సత్య నాదెల్ల తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. అభివృద్ధి చెందుతున్న ఈ విభాగంలో విజయం సాధించడానికి కంపెనీని మెరుగ్గా రాణించేలా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా సదరు కంపెనీ పేర్కొంది.
ఫ్యాక్ట్ చెక్:
వీడియో నుండి కీఫ్రేమ్లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికినప్పుడు. ఫెబ్రవరి 19, 2025న ఒక ఇన్స్టాగ్రాం యూజర్ ఇదే వీడియో ని '' అంటూ షేర్ చేయడం చూడవచ్చు.
అయితే మాన్సి సింఘల్ ఇన్స్టా గ్రాం పేజీ లో ఈ వీడియో ను తొలగించినట్టు తెలుస్తోంది. ఇది వరకూ షేర్ అయిన వీడియో ను స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఆమె యూట్యూబ్ చానల్ ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ చానల్ లో హైదరాబాద్ లో తీసిన మరిన్ని వీడియోలు మాకు లభించాయి.

