వైరల్ వీడియో ముంబయి-గోవా హైవే పైన ఉన్న కషేడీ సొరంగాన్ని చూపట్లేదు, కేరళ లోని కుథిరన్ సొరంగాన్ని చూపుతోంది

ముంబై గోవా హైవేపై ఉన్న కషెడి సొరంగాన్ని చూపుతోంది అంటూ సోషల్ మీడియాలో విశాలమైన సొరంగానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రచారంలో ఉంది. కొత్తగా నిర్మించిన సొరంగంలోకి బైకర్ వెళుతున్నట్లు వీడియో చూపిస్తుంది.
ఈ వీడియో ఫేస్బుక్, వాట్సాప్‌లో షేర్ అవుతోంది.
https://www.facebook.com/sunita.lillywhite/videos/432583958503049
ముంబై-గోవా హైవేపై కషెడి టన్నెల్‌ను వీడియో చూపిందన్న వాదన అబద్దం.
వీడియోలోని కీఫ్రేమ్‌లు గూగుల్ రివర్స్ ఇమేజ్ శోధన ను నిర్వహించడానికి ఉపయోగించాం. ఈ శోధన 'బీయింగ్ జుగాడూ' అనే యూట్యూబ్ చానెల్ లో "కోయంబత్తూరు నుండి త్రిచూర్ టన్నెల్ రైడ్.ఇటీవల తెరవబడింది. " అనే టైటిల్‌తో పోస్ట్ చేసిన వీడియో లభించింది. ఈ వీడియో నవంబర్ 2021లో పోస్ట్ చేయబడింది.
యూట్యూబ్ వీడియో టైటిల్ నుండి కొన్ని పదాలను తీసుకొని, "కోయంబత్తూరు నుండి త్రిచూర్ టన్నెల్" అంటూ గూగుల్‌లో శోధించాం. దీని ఫలితంగా త్రిస్సూర్ పాలక్కాడ్ ణ్లో కుతిరన్ టన్నెల్ రహదారిని చూపించే వార్తా కధనాలు, యూట్యూబ్ లింక్‌లు దొరికాయి.
కుతిరన్ టన్నెల్ కేరళలో మొదటి రోడ్డు సొరంగం. ఇది ట్విన్-ట్యూబ్ సొరంగం, ఒక్కో ట్యూబ్‌లో మూడు లేన్లు ఉంటాయి, ఇది కేరళలోని త్రిసూర్ జిల్లాలోని కుతిరన్ వద్ద ఉంది. టన్నెల్లలో ఒకటి ఆగస్టు 2021లో తెరవబడింది.
కుతిరన్ టన్నెల్‌ను చూపే ది న్యూస్ మినిట్ లో ప్రచురించబడిన వీడియో ఇక్కడ చూడొచ్చు. వైరల్ వీడియోతో ఈ వీడియో విజువల్స్ కు పోలికలు ఉన్నాయి.
కుథిరన్ ప్రాంతం రద్దీగా ఉండే త్రిస్సూర్ పాలక్కాడ్ నాషనల్ హైవే మార్గం లో ఉంది. పనులు పూర్తి అయిన తరువాత, సొరంగాల వల్ల కోచీ నుండి కొయంబతూర్ మధ్య 3 కిలోమీటర్ల దూరాన్ని తక్కువ అవుతుంది.
కాబట్టి, చెలామణిలో ఉన్న వీడియో ముంబై-గోవా హైవేపై ఉన్న కాషెడి టన్నెల్‌ని చూపడంలేదు, ఇది కేరళలోని కుతిరన్ టన్నెల్‌ని చూపుతోంది. ఈ క్లెయిం అబద్దం.