ఫ్యాక్ట్ చెక్: భారత్ కు చెందిన టూరిస్టులను బహిష్కరించాలని టర్కీ నిర్ణయం తీసుకోలేదు, అది అబద్దం
భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. తుర్కియే(టర్కీ) పాకిస్తాన్‌కు మద్దతుగా

Claim :
భారత్ కు చెందిన టూరిస్టులను బహిష్కరించాలని టర్కీ నిర్ణయం తీసుకుందిFact :
టర్కీ ప్రభుత్వం అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు.
భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. తుర్కియే(టర్కీ) పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచింది. ఈ వివాదంలో పాకిస్తాన్ తుర్కియే తయారు చేసిన డ్రోన్లను ఉపయోగించింది, ఇది ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది. టర్కీ పాకిస్తాన్‌కు రెండవ అతిపెద్ద ఆయుధ సరఫరాదారు, సన్నిహిత మిత్రదేశాలలో ఒకటి, కాశ్మీర్‌పై కూడా పాకిస్థాన్ కు మద్దతు ఇస్తూనే ఉంది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని మిగతా ప్రపంచం ఖండిస్తున్నప్పటికీ, అజర్బైజాన్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, టర్కిష్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్లో భారత్ చేసిన సైనిక దాడిని బహిరంగంగా విమర్శించాయి. దీనితో భారతదేశం, తుర్కియే మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. #boycottturkey #boycottAzerbaijan వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ఆన్లైన్ లో నిరసన ప్రారంభమైంది. వందలాది మంది భారతీయ ప్రయాణికులు తుర్కియే, అజర్‌బైజాన్‌లను సందర్శించడాన్ని రద్దు చేసుకున్నారు. తమ పర్యటన ప్రణాళికలను రద్దు చేసుకున్నారు. అవసరమైతే తప్ప ఈ రెండు దేశాలకు ప్రయాణాన్ని పరిమితం చేయాలనే సూచనలు, సలహాలు కూడా జారీ అయ్యాయి.