Fri Dec 05 2025 11:12:53 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో హిందువుల గుంపు ఒక ముస్లిం మహిళ హిజాబ్ ను తొలగించిందనే వాదన నిజం కాదు
ఒక యువతి హిజాబ్ ను బలవంతంగా లాగుతున్న ఒక గుంపుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఏప్రిల్ 12న

Claim :
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో హిందువుల గుంపు ఒక ముస్లిం మహిళ హిజాబ్ ను తొలగించిందిFact :
నిందితులందరూ ముస్లిం సమాజానికి చెందినవారే. వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టిస్తోంది
ఒక యువతి హిజాబ్ ను బలవంతంగా లాగుతున్న ఒక గుంపుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఏప్రిల్ 12న ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఖలాపూర్ ప్రాంతంలో జరిగింది. ఈ వీడియోలో హిజాబ్ ధరించిన ఒక మహిళ భయంతో కేకలు వేయడం మనం వినవచ్చు, దాడి చేసిన వారు ఆమె హిజాబ్ ను బలవంతంగా తొలగిస్తుండగా, మరికొందరు ఆమెపై శారీరకంగా దాడి చేసి, దుర్భాషలాడుతున్నారు. యువతిపై దాడి చేస్తున్న గుంపు హిందువుల గుంపు అని పేర్కొంటూ కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
"హిందుత్వ తీవ్రవాదుల గుంపు ఒక ముస్లిం మహిళ హిజాబ్‌ను తీసివేస్తోంది. ఒక యువతి వస్త్రాలను విప్పి, హైనాల గుంపులా ఆమె చుట్టూ తిరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. #saveindianmuslims" అనే క్యాప్షన్‌తో ఒక యూజర్ వీడియోను షేర్ చేశారు.
పలువురు సోషల్ మీడియా యూజర్లు అదే వాదనతో వీడియోను షేర్ చేశారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి వెతకగా యువతిపై దాడి చేసిన వ్యక్తులు హిందూ సమాజానికి చెందినవారు కాదని నిర్ధారించే అనేక నివేదికలు మాకు కనిపించాయి. ఒక ఎక్స్ యూజర్ “ Muzaffarnagar — Muslim girl & Hindu boy assaulted by 'Peacefuls'. The girl’s burqa was forcibly REMOVED. The boy works at Utkarsh Bank; the girl’s mother is also employed there. An incident occurred while returning after loan collection. 6 Muslims accused ARRESTED by police.” అంటూ పోస్టు చేశారు. ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయి కలిసి ఉండడంతో కొందరు ఈ పని చేశారంటూ ఈ పోస్టుల్లో తెలిపారు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు హిందూ సమాజానికి చెందినవారు కాదు.వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి వెతకగా యువతిపై దాడి చేసిన వ్యక్తులు హిందూ సమాజానికి చెందినవారు కాదని నిర్ధారించే అనేక నివేదికలు మాకు కనిపించాయి. ఒక ఎక్స్ యూజర్ “ Muzaffarnagar — Muslim girl & Hindu boy assaulted by 'Peacefuls'. The girl’s burqa was forcibly REMOVED. The boy works at Utkarsh Bank; the girl’s mother is also employed there. An incident occurred while returning after loan collection. 6 Muslims accused ARRESTED by police.” అంటూ పోస్టు చేశారు. ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయి కలిసి ఉండడంతో కొందరు ఈ పని చేశారంటూ ఈ పోస్టుల్లో తెలిపారు.
పంజాబ్ కేసరి ప్రచురించిన నివేదిక ప్రకారం, ఈ సంఘటన జిల్లాలోని మీనాక్షి చౌక్ సమీపంలో జరిగింది. బైక్ నడుపుతున్న ఒక యువకుడిని, ఒక మహిళపై దాడి చేశారు. ఆ యువతి ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న కలెక్షన్ ఏజెంట్ కుమార్తె. షామ్లి జిల్లాలోని థానభవన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్మాయిల్‌పూర్ గ్రామానికి చెందిన మరొక నివాసి సచిన్ కూడా ఆ కంపెనీలోనే పనిచేస్తున్నారు. కలెక్షన్లు చేయాల్సి రావడంతో, ఆ మహిళ తన కుమార్తెను బైక్‌పై అతడితో పాటు పంపింది. ఆ యువకుడు, యువతి ఇద్దరూ తిరిగి వస్తుండగా, ఖలాపర్లోని దర్జీ వాలి గలీలో అరడజనుకు పైగా యువకులు వారిని ఆపారు. నిందితులు వీడియో తీస్తూ వారిని కొట్టారు. తలకు ఉన్న స్కార్ఫ్ లాగి ఆమె జుట్టు పట్టుకున్నారు. ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చి నిందితుల నుండి వారిని రక్షించారు. మొత్తం విషయం గురించి బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఫిర్యాదు నమోదు చేశారు.
అమర్ ఉజాలా నివేదిక ప్రకారం, ఖలాపర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీడియోలోని యువకులను గుర్తించిన తర్వాత, ఆరుగురు నిందితులు ముస్లిం యువకులని, షోయబ్, షమీ, సర్తాజ్, షాదాబ్, ఉమర్, అర్ష్లను అరెస్టు చేశారు. నిందితులను విచారిస్తున్నట్లు CO సిటీ రాజు కుమార్ సావో తెలిపారు.
డెక్కన్ హెరాల్డ్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, ఆ అమ్మాయి తల్లి, సచిన్ అనే అబ్బాయి ఒక ప్రైవేట్ బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ తరచుగా ప్రజల నుండి రుణాలను వసూలు చేయడానికి కలిసి వెళ్లేవారు. సంఘటన జరిగిన రోజు, ఆ మహిళ తన కుమార్తెను సచిన్‌తో పంపింది. డబ్బులు వసూలు చేసి తిరిగి వస్తుండగా, పట్టణంలోని ముస్లిం ప్రాబల్యం ఉన్న ఖలాపూర్ ప్రాంతంలోని దర్జీ గలి వద్ద ఒక గుంపు వారిని ఆపింది. ఆ అబ్బాయి హిందువు అని నిర్ధారించుకున్న తర్వాత, ఆ గుంపు అతన్ని కొట్టి, అమ్మాయి హిజాబ్‌ను తొలగించింది. వారు ఈ సంఘటనను వీడియో కూడా తీశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఈ కేసుకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
వార్తాపత్రిక క్లిప్పింగ్‌ను షేర్ చేసిన ముజఫర్‌నగర్ పోలీసులు చేసిన ట్వీట్ ప్రకారం, ఖలాపూర్ పోలీసు అధికారులు సర్తాజ్, షాదాబ్, మహ్మద్ ఉమర్, అర్ష్, షోయబ్, షమీలను అరెస్టు చేశారు.

ముజఫర్‌నగర్‌లో ఒక యువతి హిజాబ్ ను తొలగించి ఆమె జుట్టును లాగి దాడి చేసిన వ్యక్తులు హిందూ సమాజానికి చెందినవారు కాదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో హిందువుల గుంపు ఒక ముస్లిం మహిళ హిజాబ్ ను తొలగించింది
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : Misleading
Next Story