Fri Dec 05 2025 07:14:20 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఆంధ్రప్రదేశ్‌లోని ఒక పొలంలో మనిషి ఆకారంలో చిలగడదుంపలు పెరిగాయి అనేది నిజం కాదు
The viral human-shaped sweet potato image in Alluri Seetharamaraju, AP is AI-generated

Claim :
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పొలంలో మనిషి ఆకారంలో చిలగడదుంపలు పెరిగినట్లు వైరల్ చిత్రం చూపిస్తోందిFact :
ఈ చిత్రాన్ని AI ద్వారా రూపొందించారు, ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి సంఘటన జరగలేదు.
చిలగడదుంపలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, విటమిన్లు A, C, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా జీర్ణక్రియకు ఇవి సహాయపడతాయి. బరువు నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా తోడ్పడతాయి. మెదడు ఆరోగ్యాన్ని పెంచడం, ఆరోగ్యకరమైన చర్మం వంటి ఇతర ప్రయోజనాలు కూడా చిలగడదుంపలతో ఉన్నాయి.
మనిషి ఆకారంలో చేతులు పట్టుకుని ఉన్న రెండు చిలగడదుంపలను చూపించే ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఆ చిలగడదుంపలను ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామంలో పండించారని, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ ఈ చిలగడదుంపలను చూడటానికి వస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.
“అల్లూరి జిల్లాలో అద్భుతం – మానవ రూపంలో తియ్యదుంపలు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామంలో ఒక విశేషం చోటుచేసుకుంది. రైతు పొలంలో పండిన తియ్యదుంపలు (చిలకడదుంపలు) మానవ రూపాన్ని పోలి ఉండటం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రామస్తులు ఆసక్తిగా వీటిని చూడటానికి తరలివస్తున్నారు. కొందరు ఇవి సహజ ప్రకృతి అద్భుతమని భావిస్తే, మరికొందరు దీన్ని దేవుని సంకేతంగా భావిస్తున్నారు. రైతు కుటుంబం కూడా ఇంతకు ముందెన్నడూ ఇలాంటివి తమ పొలంలో పండలేదని చెబుతోంది. తియ్యదుంపలు మానవ ముఖం, చేతులు, కాళ్ల ఆకృతుల్లా కనిపించడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.” అంటూ పలువురు పోస్టులు పెట్టారు.
వైరల్ ఫోటోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. వైరల్ చిత్రాన్ని AI ద్వారా రూపొందించారు.
యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన వైరల్ వీడియోను మేము తనిఖీ చేసినప్పుడు, వీడియో వివరణలో ఎడిట్ చేసిన లేదా సింథటిక్ కంటెంట్ అని పేర్కొన్నట్లు కనుగొన్నాము. వీడియోకు సంబంధించిన స్క్రీన్‌షాట్ ఇక్కడ ఉంది..
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసిన మరి కొన్ని వీడియోలు కూడా మాకు కనిపించాయి. వీడియోలలో పలు తేడాలు మనం చూడవచ్చు. వీడియోలో నిలబడి ఉన్న వ్యక్తులు బ్లర్లో ఉన్నారు. చిలగడదుంపలు తీస్తున్న వ్యక్తులు ఆంధ్రప్రదేశ్, దక్షిణాది ప్రాంతాలకు చెందిన వారి లాగా కనిపించడం లేదు.
మేము AI డిటెక్షన్ టూల్, హైవ్ మోడరేషన్ ఉపయోగించి వైరల్ చిత్రాన్ని తనిఖీ చేసినప్పుడు, ఆ చిత్రం AI ద్వారా రూపొందించినట్లుగా తెలుస్తోంది. (96% )
మరొక AI గుర్తింపు సాధనం WasitAiని ఉపయోగించి కూడా చిత్రాన్ని కూడా తనిఖీ చేసాము, చిత్రం AI ద్వారా రూపొందించినట్లుగా ఫలితాలు వచ్చాయి.
చిలగడదుంపల పెరుగుదల గురించి ఇటీవల వచ్చిన వార్తలను మేము తనిఖీ చేసినప్పుడు, అటువంటి సంఘటన గురించి ఏ డిజిటల్ లేదా ప్రధాన స్రవంతి మీడియాలో వార్తా కథనాలు మాకు కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మనిషి ఆకారంలో చిలగడదుంపలను పండించారనే వాదనలో నిజం లేదు. మానవ ఆకారంలో ఉన్న చిలగడదుంపలను చూపించే వైరల్ చిత్రం AI ద్వారా సృష్టించారు. వైరల్ వీడియో నిజమైన చిలగడదుంపలను చూపించదు. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim : ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పొలంలో మనిషి ఆకారంలో చిలగడదుంపలు పెరిగినట్లు వైరల్ చిత్రం చూపిస్తోంది
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
News Summary - viral human-shaped sweet potato image is AI-generated
Next Story

