ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో వరద నీటిలో మునిగి కనిపిస్తున్న విమానాశ్రయం, ముంబై ఏయిర్ పోర్ట్ కాదు
గత కొన్ని రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని వలన పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, ఊహించని అంతరాయాలు ఏర్పడటం

Claim :
వరద నీటిలో మునిగిపోయిన ముంబై విమానాశ్రయాన్ని చూపించే వైరల్ వీడియో ఇదిFact :
ఈ వీడియో 2023 నాటిది, వరదల్లో మునిగిపోయిన చెన్నై విమానాశ్రయాన్ని చూపిస్తుంది
గత కొన్ని రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని వలన పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, ఊహించని అంతరాయాలు ఏర్పడటం జరిగింది. అంతేకాకుండా పట్టణంలో మౌలిక సదుపాయాలు, వరద నిర్వహణ గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ఇటీవలి సంవత్సరాలలో అత్యధిక వర్షపాతం నమోదైంది, ఈ సోమవారం నుండి మంగళవారం ఉదయం వరకు శాంటాక్రూజ్ స్టేషన్లో 223 మిమీ, కొలాబా స్టేషన్లో 110 మిమీ వర్షపాతం నమోదైంది. మలాడ్‌లోని చించోలి వంటి కొన్ని ప్రాంతాలలో 24 గంటల్లో 360 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా విస్తృతంగా వరదలు సంభవించాయి, అది కాస్తా రోడ్లపై ప్రభావం చూపించింది. స్థానికంగా రైల్వే సేవలకు కూడా అంతరాయం కలిగింది. విమానాల రాకపోకలలో కూడా అంతరాయానికి దారితీసింది. భారీ వర్షం, బలమైన గాలుల కారణంగా ముంబై విమానాశ్రయం తీవ్ర అంతరాయాలను ఎదుర్కొంది. చాలా విమానాలను దారి మళ్లించారు లేదా ల్యాండింగ్‌ను ఆలస్యం చేయాల్సి వచ్చింది.

