Fri Dec 06 2024 17:25:44 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం గురించి వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు.
రైతు రుణ మాఫీపై భారతీయ రాష్ట్ర సమితి నేత హరీష్ రావు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. నేతల మధ్య మాటల వాగ్వాదం బ్యానర్ల దాకా పాకింది. తెలంగాణ లోని సిద్దిపేటలో కాంగ్రెస్ కార్యకర్తలు బ్యానర్లు వేయడం,
Claim :
బీఆర్ఎస్ నేత కే చంద్రశేఖర్‌రావు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారుFact :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వార్త ఫేక్. BRS పార్టీ వదంతులను కొట్టిపారేసింది
రైతు రుణ మాఫీపై భారతీయ రాష్ట్ర సమితి నేత హరీష్ రావు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. నేతల మధ్య మాటల వాగ్వాదం బ్యానర్ల దాకా పాకింది. తెలంగాణ లోని సిద్దిపేటలో కాంగ్రెస్ కార్యకర్తలు బ్యానర్లు వేయడం, బీఆర్ఎస్ కార్యకర్తలు బ్యానర్లు తొలగించేందుకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే హరీశ్ రావు.. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ బోర్డును ధ్వంసం చేసిన వీడియోను పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తాళాలు పగులగొట్టి ఆస్తులను ధ్వంసం చేశారని ఆరోపించారు.
ఇంతలో, BRS నాయకుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి K చంద్ర శేఖర్ రావు అనారోగ్యంతో ఉన్నారని.. చాలా రోజులుగా ఆసుపత్రిలో ఉన్నారని పేర్కొంటూ సుదీర్ఘ సందేశం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది.
"కేసీఆర్ కి తీవ్ర అస్వస్థత !! కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ , గత 12 రోజులుగా కేసీఆర్ తీవ్ర అస్వస్థత గురికావడం జరిగింది . యశోద హాస్పిటల్ బృందం గజ్వేల్ లో వారం రోజులుగా ఎమర్జెన్సీ యూనిట్ ని నెలకొల్పి 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు .. అత్యాధునిక వైద్య చికిత్స అందించడానికి వీలుగా ఉండే పరికరాలు బుధవారం రాత్రి ప్రత్యేక అంబులెన్స్ లో ఫాంహౌస్ కి తీసుకువచ్చారు … హాస్పిటల్ లో చేరితే , పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకుంటుంది అని.. ఎమ్మెల్యేలు కూడా చేజారిపోతారని కుటుంబ సభ్యులతో వారించినట్టు సమాచారం.. 150 రోజులుగా కూతురు జైల్లో ఉండడం, అసెంబ్లీ ఎలక్షన్ ఓడిపోవడం, తుంటి ఎముక విరగడం, లోకసభలో సున్న సీట్స్ రావడం , కుటుంబ సభ్యుల కలహాలు వంటి వరుస ఘటనలతో తీవ్ర మనోవేదన చెందాడు అని సమాచారం… పార్టీ నడిపించే శక్తి లేని కేటీఆర్ , తప్పించుకొని తిరిగే మనస్తత్వం ఉన్న హరీష్ రావు …ఇలా పార్టీనీ నడిపించే నాయకుడు లేక ఆందోళనలో BRS శ్రేణులు ముఖ్యంగా ఎమ్మెల్యేలకి విషయం తెలియకూడదు అని విదేశీ పర్యటనకి తీసుకువెళ్లారు అని సమాచారం … కేసీఆర్ ఆరోగ్య విషయం తెలిసిన కొందరు నాయకులు , హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు" అంటూ కొందరు పోస్టులను వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. BRS పార్టీ ఈ వాదనలను కొట్టిపారేసింది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ప్రామాణికమైన నివేదికల కోసం వెతకగా, మాకు అలాంటి నివేదికలేవీ దొరకలేదు.
కేసీఆర్ ఆరోగ్యంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని బీఆర్ఎస్ ఖండించిందని teluguglobal.com ప్రచురించిన కథనం మేము గుర్తించాం. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారిక వాట్సాప్ ఛానల్ ఫేక్ న్యూస్ కు ఫ్యాక్టరీగా మారిందంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ పేరుతో చేస్తున్న మోసం కారణంగా ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని గ్రహించి, ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు.
సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వాదనలను ఖండిస్తూ BRS పార్టీ ప్రచురించిన ట్వీట్‌ను కథనంలో పొందిపరిచారు.
BRS పార్టీ చేసిన ట్వీట్ కోసం శోధించినప్పుడు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారిక వాట్సాప్ ఛానెల్ నకిలీ వార్తలకు లక్ష్యంగా మారిందని తెలిపే ట్వీట్ మాకు కనిపించింది. రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్ చేసిన మోసంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ దృష్టి మరల్చేందుకు నీచ రాజకీయాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ ఆరోపించింది.
తెలంగాణ టుడేలో ప్రచురితమైన కథనం ప్రకారం.. మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆరోగ్యంగానే ఉన్నారని, పార్టీ సీనియర్ నేతలతో క్రమం తప్పకుండా సమావేశమవుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు ధృవీకరించాయి. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, అనవసరమైన భయాందోళనలు సృష్టించడానికి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పుకార్లను కొట్టిపారేశారు.
తెలంగాణ కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న ఒక వాట్సాప్ ఛానెల్లో ఈ నివేదికలు మొదట కనిపించాయని, దుర్మార్గపు వార్తల వెనుక అధికార కాంగ్రెస్ హస్తముందని బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఒకరి ఆరోగ్యం గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని పార్టీ నేతలు తెలిపారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు అస్వస్థతకు గురై చాలా రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారనే ప్రచారం అవాస్తవం. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ ధృవీకరించింది.
Claim : బీఆర్ఎస్ నేత కే చంద్రశేఖర్‌రావు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story