ఫ్యాక్ట్ చెక్: ఫైటర్ జెట్లను కూల్చివేస్తున్నారంటూ సిమ్యులేషన్ వీడియోలు వైరల్ అవుతున్నాయి
లష్కరే-తైబా, జైషే-మొహమ్మద్ వంటి వివిధ గ్రూపులు ఉపయోగించిన తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత

Claim :
ఆపరేషన్ సింధూర్‌లో భారత, పాకిస్తాన్ జెట్లు కూలగొట్టినట్టు వీడియోలు చూపుతున్నాయిFact :
వైరల్ వీడియోలు నిజమైన ఫుటేజీ కాదు; అవి వినియోగదారులు రూపొందించిన గేమ్ వీడియోలు
లష్కరే-తైబా, జైషే-మొహమ్మద్ వంటి వివిధ గ్రూపులు ఉపయోగించిన తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో వైమానిక దాడులలో ధ్వంసమయ్యాయి. కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రితో కలిసి ఉగ్రవాద శిబిరాలపై జరిగిన ఖచ్చితమైన దాడుల గురించి మీడియాకు వివరించారు.
పాకిస్తాన్లో దాడి చేసిన ప్రదేశాలలో సియాల్కోట్లోని సర్జల్ క్యాంప్, మురిడ్కేలోని మెహమూనా జోయా, మార్కాజ్ తైబా, బహవల్పూర్లోని మార్కాజ్ సుభానల్లా ఉన్నాయి. ఫోఖ్లో, ముజఫరాబాద్‌లోని సవాయి నాలా, సయ్యద్నా బిలాల్, కోట్లీలోని గుల్పూర్, అబ్బాస్ శిబిరాలు మరియు భింబర్లోని బర్నాలా శిబిరం ఉన్నాయి. సైనిక స్థావరాలేవీ దాడికి గురి కాలేదు, అలాగే సామన్యులకు ఎటువంటి నష్టం కలుగలేదు.
అయితే, సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్, Xలో చాలా మంది వినియోగదారులు ప్రత్యర్థి సైన్యం వివిధ జెట్ విమానాలను కాల్చివేస్తున్న వీడియోలను షేర్ చేస్తున్నారు.
క్లెయిమ్ 1
భూమిపై ఉన్న సాధనాల ద్వారా లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్న యుద్ధ విమానాన్ని చూపే వీడియో 'పాకిస్తాన్ జెట్ JF-17 థండర్ షూట్ డౌన్ బై ఇండియన్ డిఫెన్స్ -#OperationSindoor -#IndiaPakistanWar Karachi' అనే వాదనతో ప్రచారంలో ఉంది.
క్లెయిమ్ 2
భారతీయ జెట్‌ను బహవల్పూర్ సమీపంలో పాకిస్తాన్ సాయుధ దళాలు కాల్చివేశాయని పేర్కొంటూ ఇలాంటి దృశ్యాలతో కూడిన మరొక వీడియో కూడా ప్రచారంలో ఉంది. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో పంచుకుంటున్నారు.
ఈ క్లెయిమ్‌ల యొక్క ఆర్కైవ్ లింక్‌లు ఇక్కడ ఉన్నాయి.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న రెండు వాదనలూ నిజం కాదు. ప్రచారంలో ఉన్న వీడియోలు సైనిక సిములేషన్ వీడియోలు, అంతేకానీ పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత దాడుల తర్వాత జరిగిన యుద్ధ దృశ్యాలను చూపించడం లేదు. భారతీయ లేదా పాకిస్తాన్ ఫైటర్ జెట్లను కాల్చివేశారనే వాదనల్లో ఏంత నిజముందో మేము ధృవీకరించలేనప్పటికీ, ప్రచారంలో ఉన్న వైరల్ వీడియోలు యుద్ధ దృశ్యాలను చూపించడం లేదని మాకు తెలుస్తోంది. అవి మిలిటరీ సిములేషన్ గేమ్ వీడియోల నుండి తీసుకున్నారు.
వైరల్ వీడియోల నుండి కీఫ్రేమ్‌లను సేకరించి, వాటిని ఘూగ్లె రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి శోధించినప్పుడు, అవి రెండూ మిలిటరీ సిములేషన్ గేమ్ వీడియోలు అని, పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం చేసిన ఇటీవలి దాడి తరువాత వచ్చిన నిజమైన ఫుటేజీ కాదని తెలుసుకున్నాము.
క్లెయిమ్ 1:
ప్రచారంలో ఉన్న మొదటి వైరల్ వీడియో పొడవైన వీడియోను మేము కనుగొన్నాము. ఈ వీడియోను సెప్టెంబర్ 13, 2023న జోన్ 3000 సాకురా అనే ఛానెల్ "Air Defense System Shot Down A-10 Warthog/Thunderbolt II - C-RAM" అనే టైటిల్‌తో ప్రచురించింది. వినియోగదారు సైనిక అనుకరణ వీడియోలను రూపొందించడానికి ఇష్టపడతారని వీడియో యొక్క వివరణ పేర్కొంది.
ఈ ఛానెల్ బయోలో కూడా యూట్యూబర్ మిలిటరీ సిములేషన్ గేం వీడియోలను రూపొందించడానికి ఇష్టపడుతున్నట్లు పేర్కొంది.
క్లెయిమ్ 2
ఈ వీడియో కూడా మిలిటరీ సిములేషన్ గేం వీడియో, నిజమైన ఫుటేజీ కాదు. ప్రకాశవంతమైన చారలు, నాటకీయ పేలుళ్లు వంటి దాని దృశ్యాలను బట్టి గేమ్ శైలిని చూపుతున్నాయి, ఇవి తప్పుడు వాదనలను వ్యాప్తి చేయడానికి వినియోగిస్తున్నారు సోషల్‌మీడియా వినియోగదారులు. వీడియోలోని కీఫ్రేం లను తీసుకొని ఘూగ్లె రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి శోధించినప్పుడు, ఇది ఆఋంఆ 3, అనుకరణ వీడియో గేమ్ నుండి వచ్చిన దృశ్యమని పేర్కొంటూ చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు వీడియోను షేర్ చేసినట్టు తెలుస్తోంది.
ఫ్యాక్ట్ చెకర్ అయిన హోస్సామ్ ఎల్హెండీ అనే మరో X వినియోగదారుడు, ఈ వాదనను ఖండించారు పరిశోధనలో, ఈ వీడియో ఆర్మా 3 గేమ్‌లోని మిలిటరీ సిములేషన్ నుండి తీసుకోబడిందని, దీనికి నిజమైన సంఘటనతో సంబంధం లేదని తేలింది. ఇది ARK TRON అనే వీడియో గేమ్ క్లిప్‌లు కలిగిన యూట్యూబ్ చానల్ లో ప్రచురించినట్టు అతని ట్వీట్ తో తెలుసుకున్నాం.
ఆర్క్ ట్రొన్ యూట్యూబ్ చానల్ని శోధించినప్పుడు, ఏప్రిల్ 19, 2025న 'Su-35 Fighter Jets Enter City' అనే టైటిల్‌తో ప్రచురించిన వీడియో ను కనుగొన్నాము.
కనుక, ప్రచారంలో ఉన్న వీడియోలు నిజమైన యుద్ధ దృశ్యాలను చూపించడం లేదు; అవి Yఔటుబె ఛానెల్‌ల ద్వారా సృష్టించబడిన సైనిక అనుకరణ గేమ్ వీడియోలు. ఈ వాదనలు అవాస్తవం.

