Mon Dec 08 2025 17:00:24 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బీహార్‌కు చెందిన రీతురాజ్ చౌదరి 53 సెకన్ల పాటు గూగుల్ ను హ్యాక్ చేయలేదు
బీహార్‌కు చెందిన రీతురాజ్ చౌదరి ప్రస్తుతం ఐ.ఐ.టి మణిపూర్‌లో చదువుకున్నారు. 53 సెకన్ల పాటు గూగుల్‌ను హ్యాక్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా కూర్చున్న గూగుల్ ఎగ్జిక్యూటివ్‌లు, ఇంజనీర్లు ఎక్కినా కోలుకోలేదు.

“బీహార్‌కు చెందిన రీతురాజ్ చౌదరి ప్రస్తుతం ఐ.ఐ.టి మణిపూర్‌లో చదువుకున్నారు. 53 సెకన్ల పాటు గూగుల్‌ను హ్యాక్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా కూర్చున్న గూగుల్ ఎగ్జిక్యూటివ్‌లు, ఇంజనీర్లు ఎక్కినా కోలుకోలేదు. హ్యాక్‌కు కారణం కనుగొనబడలేదు. రితురాజ్ దాన్ని రీస్టార్ట్ చేసి, మీ సాఫ్ట్‌వేర్‌లోని ఈ లోపం వల్ల నేను దానిని హ్యాక్ చేయగలిగాను అని గూగుల్ కంపెనీకి మెయిల్ చేశాడు.
అధికారులు తనిఖీలు చేయగా సాఫ్ట్‌వేర్‌లో పెద్ద లోపం ఉన్నట్లు గుర్తించారు. అమెరికాలో 12 గంటల పాటు జరిగిన ఒక ఆకస్మిక సమావేశం జరిగింది మరియు రితురాజ్ ప్రతిభను ప్రశంసిస్తూ అతనికి గూగుల్‌లో ఉద్యోగం ఇస్తానంటూ ఒక ఇమెయిల్ వచ్చింది.3.66 కోట్ల జీతంతో అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. అతడిని తీసుకెళ్లేందుకు భారత్‌కు వస్తామని అధికారులు తెలిపారు. కానీ రితురాజ్ దగ్గర పాస్ పోర్టు కూడా లేదు. అమెరికా భారత ప్రభుత్వంతో మాట్లాడి ఎమర్జెన్సీ రెండు పాస్‌పోర్టులను మాత్రమే సిద్ధం చేసి ఇంటికి డెలివరీ చేసింది. ఈరోజు రీతురాజ్ ప్రైవేట్ జెట్‌లో అమెరికా వెళ్లనున్నారు.” అంటూ ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఫొటోలో ఉన్న వ్యక్తి గూగుల్ లో బగ్ ఉందని కనుగొన్నాడు కానీ.. గూగుల్ ను హ్యాక్ చేయలేదు.“RituRaj Choudary Google” అనే కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేశాం. ఫిబ్రవరి 2022లో ప్రచురించిన అనేక కథనాలను మేము కనుగొన్నాము. Googleలో పొటెన్షియల్ బగ్ ను రీతురాజ్ కనుగొన్నాడని, హ్యాకర్లు ఆ బగ్ ను చూసి దాడి చేసే అవకాశం ఉందని కూడా తెలిపారు. రీతురాజ్ ఐఐటీ మణిపూర్‌లో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి అతడొక బగ్ హంటర్. అతను బగ్ గురించి గూగుల్ కు నివేదించగా.. కంపెనీ రీసెర్చర్స్ జాబితాలోకి చేర్చింది.bughunters.google.com అనే వెబ్సైట్ లో.. అతను జనవరి 2022లో తన మొదటి బగ్‌ని నివేదించాడని, టైగర్ అవార్డును అందుకున్నాడని మేము కనుగొన్నాము.తన వ్యక్తిగత వెబ్సైట్ rrchoudary.meలో, అతను డిసెంబర్ 2021 నుండి తనను తాను ఫ్రీలాన్సర్‌గా బగ్ హంటర్‌గా పేర్కొన్నాడు.గూగుల్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని లేదా సైట్‌ను హ్యాక్ చేశారనే వాదనలలో నిజం లేదని అతడే స్పష్టంగా చెప్పాడు. తాను బగ్‌ని నివేదించానని, తాను కేవలం బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థినని (ఏడాది క్రితం) వివరించాడు.ఈ క్లెయిమ్ 2022లో వైరల్ అయ్యింది. అనేక వాస్తవ తనిఖీ సంస్థలు కూడా వైరల్ పోస్టులలో నిజం లేదని తేల్చాయి.రీతురాజ్ చౌదరి గూగుల్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడంతో కంపెనీలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం ఇచ్చారనే వాదన అబద్ధం. అతను బగ్‌ను మాత్రమే గుర్తించాడు. కంపెనీ పరిశోధకుల జాబితాలో చోటు సంపాదించాడు. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.Claim : Rituraj Choudary hacks google
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story

