ఫ్యాక్ట్ చెక్: చార్మినార్ దగ్గర స్థానిక యువకులు విదేశీయులను ఇబ్బంది పెట్టిన ఘటన ఇటీవలది కాదు
భారతదేశంలో వ్లాగ్గింగ్ పై ఆసక్తి భారీగా పెరుగుతోంది. ఎంతో మంది యువకులు వ్లాగింగ్ పై దృష్టి పెట్టారు. ఆకర్షణీయమైన

Claim :
ఇటీవల చార్మినార్ సమీపంలో కొందరు స్థానిక యువకులు విదేశీయులతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఘటన వైరల్ వీడియో చూపిస్తోందిFact :
ఈ వీడియో పాతది, ఈ సంఘటన 2 సంవత్సరాల కంటే ముందే చోటు చేసుకుంది
భారతదేశంలో వ్లాగ్గింగ్ పై ఆసక్తి భారీగా పెరుగుతోంది. ఎంతో మంది యువకులు వ్లాగింగ్ పై దృష్టి పెట్టారు. ఆకర్షణీయమైన జీవనశైలి, ప్రయాణం, ఆహారం, కుటుంబం, ఫిట్నెస్ లాంటి అంశాల మీద అవగాహన కోసం ప్రజలు వ్లాగింగ్ వీడియోలను చూడడం అలవాటు చేసుకున్నారు. భారత దేశాన్ని చూపించాలని కూడా పలు దేశాలకు చెందిన వ్లాగర్లు వివిధ నగరాల్లో ప్రయాణిస్తూ ఉన్నారు. విదేశీయులు తమ అనుభవాన్ని చిత్రీకరించడం కూడా మొదలు పెట్టారు. అందులో హైదరాబాద్ నగరం కూడా ఉంది. చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన హైదరాబాద్ నగరాన్ని చూపించడానికి పలువురు ముందుకు వస్తున్నారు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, ఆ వీడియో పాతది అని పేర్కొంటూ కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లను కనుగొన్నాము. ఒక X యూజర్ చార్మినార్ పోలీసులను ట్యాగ్ చేసి, అది పాత వీడియో అని పేర్కొన్నారు.
Jaystreazy2 అనే యూట్యూబ్ ఛానెల్, ఆగస్టు 29, 2024న ‘Confronting an insult’ అనే శీర్షికతో వైరల్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో వివరణలో, వినియోగదారుల యూట్యూబ్ ఛానెల్‌లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌కు లింక్‌లను కూడా చూడొచ్చు.
Jaystreazy VODs అనే ఛానెల్లో “12/9/2023 - HYDERABAD !factor INDIA-THON DAY 19 !wheel !india !bald #Factor75Partner” "అనే శీర్షికతో డిసెంబర్ 21, 2023న అప్లోడ్ చేసిన వీడియోను కూడా కనుగొన్నాము. ఈ వీడియోలో వ్లాగర్ హైదరాబాద్‌లోని అనేక మందితో సంభాషిస్తూ, నగరంలోని వివిధ ప్రముఖ ప్రదేశాలను సందర్శిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోలోని వైరల్ భాగాన్ని మనం 3.27 వద్ద చూడవచ్చు. ఈ సంఘటన చార్మినార్ సమీపంలో జరిగింది. ఈ వీడియో ప్రకారం, ఇది సెప్టెంబర్ 12, 2023న చోటు చేసుకుంది. ఇది ఇటీవలిది కాదు.

