ఫ్యాక్ట్ చెక్: భారత దాడుల్లో పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ విమానాశ్రయం ధ్వంసమయ్యింది అంటూ సూడాన్ కి చెందిన వీడియో వైరల్ అవుతోంది
ఆపరేషన్ సిందూర్ తర్వాత, పహల్గామ్ ఉగ్రవాద దాడి, పాకిస్తాన్‌తో జరిగిన ఘర్షణలపై భారతదేశం దృక్పథాన్ని వివరించడానికి రాజకీయ

Claim :
భారత దాడుల కారణంగా పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ విమానాశ్రయం ధ్వంసమవ్వడం వైరల్ వీడియోలో చూడొచ్చుFact :
ఈ వీడియో సూడాన్‌లో ద్వంసమయిన ఖార్టూమ్ విమానాశ్రయాన్ని చూపిస్తోంది. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలతో సంబంధం లేదు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత, పహల్గామ్ ఉగ్రవాద దాడి, పాకిస్తాన్‌తో జరిగిన ఘర్షణలపై భారతదేశం దృక్పథాన్ని వివరించడానికి రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, నిపుణుల బృందాలను ప్రపంచంలోని పలు దేశాలకు పంపాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. యూరప్, ఉత్తర అమెరికా, పశ్చిమ ఆసియా, గ్లోబల్ సౌత్ వంటి ప్రాంతాలను చేరుకోవడానికి ప్రభుత్వం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగమయ్యే పార్లమెంటేరియన్లలో కాంగ్రెస్ నాయకుడు, విదేశీ వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రస్తుత అధ్యక్షుడు శశి థరూర్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారు. ఆపరేషన్ సిందూర్ కి సంబంధించి సామాన్య ప్రజలలో భయాందోళనలను వ్యాప్తి చేయడానికి టన్నుల కొద్దీ తప్పుడు కథనాలు కూడా ప్రచారంలో ఉన్నందున, భారత్ తీసుకునే ఇలాంటి చర్యలు చాలా ముఖ్యమైనవి. ప్రజలకి సరైన సమాచారం అందించాలనే ఉద్దేశ్యం తో, భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతలకు సంబంధించిన అనేక ఫేక్ న్యూస్ ను తెలుగుపోస్ట్ తిప్పికోట్టింది.

