ఫ్యాక్ట్ చెక్: కాబూల్ భారత రాయబార కార్యాలయంపై దాడి అంటూ పాత ఫోటోలు వైరల్ అవుతున్నాయి
ఆఫ్ఘనిస్థాన్ దేశంలో పాలనలో మార్పు వచ్చిన తర్వాత భారత్ తో సంబంధాల విషయంలో కూడా మార్పులు వచ్చాయి. ఐదు సంవత్సరాలుగా ఆఫ్ఘన్ల

Claim :
కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం పేలుళ్ల కారణంగా ధ్వంసమైనట్లు వైరల్ చిత్రాలు చూపిస్తున్నాయిFact :
వైరల్ చిత్రాలు వేర్వేరు ఘటనలకు సంబంధించిన పాత చిత్రాలు.
ఆఫ్ఘనిస్థాన్ దేశంలో పాలనలో మార్పు వచ్చిన తర్వాత భారత్ తో సంబంధాల విషయంలో కూడా మార్పులు వచ్చాయి. ఐదు సంవత్సరాలుగా ఆఫ్ఘన్లకు అన్ని వీసా సేవలను నిలిపివేసిన భారత్ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లను మూసివేసింది. ఇటీవలి కాలంలో కాస్త మార్పు వచ్చింది. ప్రభుత్వ వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్ ప్రకారం, వ్యాపారవేత్తలు, కళాకారులతో సహా ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు వీసాలను మంజూరు చేయడాన్ని భారతదేశం తిరిగి ప్రారంభించింది. ప్రభుత్వ అధికారిక వీసా పోర్టల్ indianvisaonline.gov.in లోని నోటిఫికేషన్ కొత్త ఆఫ్ఘన్ వీసా మాడ్యూల్ అమలును ధృవీకరించింది.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉన్నాయి. చెలామణిలో ఉన్న చిత్రాలు పాతవి.
ఇటీవల కాబూల్‌లో అటువంటి సంఘటన ఏదైనా జరిగిందా అని తెలుసుకోవడం కోసం వార్తా నివేదికల కోసం మేము తనిఖీ చేసినప్పుడు, ఇటీవల కాబూల్‌లో అటువంటి పేలుడు జరిగిందని పేర్కొన్న నివేదికలు మాకు కనిపించలేదు. అటువంటి సంఘటన జరగలేదు.ఫోటో 1
గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి ఈ చిత్రాన్ని వెతికినప్పుడు ఆ చిత్రం 2009 లో కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం ఆత్మాహుతి బాంబు దాడులకు గురైనప్పటిదని మేము కనుగొన్నాము. ‘India hints at Pakistani link to Kabul attack” అనే శీర్షికతో ది హిందూ ప్రచురించిన కథనంలో వైరల్ చిత్రం ఉపయోగించారని మేము కనుగొన్నాము. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఆత్మాహుతి కారు బాంబు దాడి తర్వాత, విదేశాంగ కార్యదర్శి నిరుపమ రావు, ఆఫ్ఘనిస్తాన్లోని భారత రాయబారి జయంత్ ప్రసాద్‌తో కలిసి దాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు.
దాడి జరిగిన ప్రదేశాన్ని విదేశాంగ కార్యదర్శి నిరుపమ రావు సందర్శించిన వీడియో ఇక్కడ ఉంది.
ఫోటో 2
ఫోటో 3
ఈ చిత్రం మే 23, 2014న ఆఫ్ఘన్‌లోని హెరాత్ నగరంలోని భారత కాన్సులేట్‌పై జరిగిన దాడిని చూపించే పాత చిత్రం. నలుగురు ముష్కరులు కాంప్లెక్స్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించి భవనాలపై కాల్పులు జరిపారు. ముష్కరులు సమీపంలోని ఇంటి నుండి మెషిన్ గన్స్, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లతో కాన్సులేట్‌పై కాల్పులు జరిపినట్లు సమాచారం. వారిలో ఒకరు కాన్సులేట్ గోడను దూకడానికి ప్రయత్నిస్తుండగా కాల్చి చంపారు.
ఈ దాడికి పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా బాధ్యత వహిస్తూ ప్రకటనను విడుదల చేసింది.
కనుక, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రాలు పాత చిత్రాలు, ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన వేర్వేరు పేలుళ్లు, అయితే ఇటీవలివి కావు. అందువల్ల, కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం ఇటీవల దాడికి గురైందనే వైరల్ చిత్రాలు తప్పుదారి పట్టించేవి. కాబూల్‌లో జరిగిన వివిధ పేలుళ్లు, దాడులకు సంబంధించిన పాత చిత్రాలను తప్పుదారి పట్టించే వాదనతో షేర్ చేస్తున్నారు.

