ఫ్యాక్ట్ చెక్: స్కూళ్లలో పిల్లలకు సరికొత్త డ్రగ్స్ దొరుకుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు
యువత డ్రగ్స్ లేదా మత్తుపదార్థాల బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఈ పరిణామాలు తల్లిదండ్రులకు, సమాజానికి కూడా

Claim :
పింక్ కలర్ టెడ్డీ బేర్ లాగా ఉండే 'స్ట్రాబెరీ క్విక్ మెత్' అనే డ్రగ్ స్కూళ్లలో పిల్లలకు అందుబాటులోకి వచ్చిందిFact :
ఇది ఓ బూటకపు వార్త. పాఠశాల విద్యార్థుల మధ్య అలాంటి డ్రగ్స్ చలామణిలో లేవని పోలీసు అధికారులు స్పష్టం చేసారు
కొంతమంది యువత డ్రగ్స్ లేదా మత్తుపదార్థాల బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు తల్లిదండ్రులకు, సమాజానికి కూడా ఆందోళన కలిగిస్తోంది. మాదకద్రవ్యాల దుర్వినియోగం కారణంగా ఉత్పన్నమయ్యే ప్రభావాలు డిప్రెషన్, ఆందోళన, సైకోసిస్లకు కారణమవుతుంది. అంతేకాకుండా పిల్లలలో అనేక రకాల మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఆదాయాల పెరుగుదల, ఉద్యోగాల్లో తలమునకలై ఉండే తల్లిదండ్రులు, ఒత్తిడి, సులువుగా డ్రగ్స్ దొరుకుతూ ఉన్న కారణంగా దేశంలో కొన్ని ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాలలో 10 నుండి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలలో మాదకద్రవ్యాల దుర్వినియోగం పెరుగుదల కనిపిస్తూ ఉంది.
మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని పరిష్కరించడానికి, తెలంగాణలోని 20 వేలకు పైగా ఉన్నత పాఠశాలలు ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటు చేయగా, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో 4000 కంటే ఎక్కువ డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేశారు. యువతలో మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వ విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ప్రహరీ క్లబ్‌లలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక పోలీసు ప్రతినిధులు వంటి సభ్యులు ఉంటారు. ఈ క్లబ్‌లు పాఠశాలలు, కళాశాలల చుట్టూ డ్రగ్స్ లేని ప్రాంతాలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఇదే వాదన జింబాబ్వే, జమైకా మొదలైన ఆఫ్రికన్ దేశాలలో కూడా వైరల్ అవుతోంది
వాట్సాప్ లో కూడా ఈ పోస్టు వైరల్ అవుతోంది.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ లను ఇక్కడ చూడొచ్చు .