Fri Dec 05 2025 08:59:59 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ‘ఓటు చోర్, గడ్డి చోడ్’ నిరసనల్లో భాగంగా బీజేపీ ప్రచార వాహనాన్ని ప్రజలు ధ్వంసం చేయలేదు, వీడియో పాతది
'ఓట్ చోర్, గడ్డి చోడ్' అనే నినాదానికి అర్థం 'ఓటు దొంగలు సింహాసనాన్ని వదిలిపెట్టాలి' అని!! 2025 లోక్‌సభ ఎన్నికల తర్వాత

Claim :
‘ఓటు చోర్, గడ్డి చోడ్’ నిరసనల్లో భాగంగా బీజేపీ ప్రచార వాహనాన్ని ప్రజలు ధ్వంసం చేయడం వైరల్ వీడియో చూపిస్తోందిFact :
ఈ వీడియో 2024 లోక్‌సభ ఎన్నికల నాటిది. ఓట్ చోర్, గడ్డి చోర్ ఆడియోను వీడియోకు డిజిటల్‌గా జోడించారు
'ఓట్ చోర్, గడ్డి చోడ్' అనే నినాదానికి అర్థం 'ఓటు దొంగలు సింహాసనాన్ని వదిలిపెట్టాలి' అని 2025 లోక్‌సభ ఎన్నికల తర్వాత, కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టడానికి ఉపయోగించిన రాజకీయ నినాదం ఇది. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అవకతవకలకు పాల్పడుతోందని, అలాగే ఎన్నికల్లో విజయం సాధిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు.
2025 సార్వత్రిక ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికల మోసానికి పాల్పడిందని, ఓటర్ల జాబితాలను తారుమారు చేసిందని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఓటర్ లిస్టులో పలువురి పేర్ల తొలగింపు ఉండడమే కాకుండా, మోసపూరిత ఓటర్ల జాబితా వంటి అవకతవకలు కూడా చోటు చేసుకున్నాయని ఆరోపించారు. 'ఓటు దొంగలు, సింహాసనాన్ని వదిలివేయండి' అని నినాదాలు చేయడం ద్వారా, ప్రతిపక్ష నేతలు బీజేపీని విమర్శించడం మొదలు పెట్టాయి.
కాంగ్రెస్ పార్టీ 'ఓట్ చోర్, గడ్డి చోడ్' అనే క్యాంపెయిన్ ను మొదలు పెట్టింది. పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, గుజరాత్‌తో సహా అనేక రాష్ట్రాలలో నిరసనలు, సంతకాల సేకరణలు, ర్యాలీలు జరిగాయి. ఎన్నికల వ్యవస్థ పని తీరును సవాలు చేయడానికి ప్రజల మద్దతును కూడగట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. అయితే బీజేపీ, ఎన్నికల కమీషన్ ఓట్ల రిగ్గింగ్ ఆరోపణలను ఖండించాయి. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ వాదనలను నిరాధారమైనవని ఖండించారు.
కానీ ఇంతలో, ప్రజలు 'ఓట్ చోర్, గడ్డి చోడ్' అని అరుస్తూ, ప్రచార వాహనంపై ఉన్న బ్యానర్లను చింపివేస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది, ఈ వీడియో ఇటీవలిది, ఓట్ల దొంగతనానికి సంబంధించినది అనే వాదనతో ప్రచారం చేస్తున్నారు. “"वोट चोर गद्दी छोड़" के नारे ने देश में क्रांति छेड़ दी है। भाजपा का ब्रांडिंग वैन भी खदेड़ा जा रहा!” అంటూ హిందీలో పోస్టులు పెట్టారు.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఈ వీడియో ఇటీవలిది కాదు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఓట్ చోరీ నిరసనలకు సంబంధించినది కాదు.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఆ వీడియో పాతదని, 2024 సంవత్సరం నాటిదని తెలుస్తోంది. ఏప్రిల్ 17, 2024న డిజిటల్ భూమి అనే యూట్యూబ్ ఛానెల్ షేర్ చేసిన వీడియోకు సంబంధించిన పొడవైన వెర్షన్‌ను మేము కనుగొన్నాము. “सोनीपत के महमूदपुर में BJP प्रत्याशी मोहन लाल बडोली का प्रचार कर रहे पिकअप के लोगों ने फाड़े पोस्टर” అంటూ పోస్టు పెట్టారు. సోనిపట్‌లోని మహ్మద్‌పూర్‌లో, బీజేపీ అభ్యర్థి మోహన్ లాల్ బడోలి తరపున ప్రచారం చేస్తున్నప్పుడు పోస్టర్లలో ఒకదానిని ప్రజలు చించివేస్తున్నారని తెలిపారు.
ఎక్కువ నిడివి ఉన్న వీడియోకు సంబంధించిన ఎక్స్ పోస్టును కూడా మేము గుర్తించాం.

అసలైన వీడియోలో, ఓటు చోరి నిరసనలకు సంబంధించిన ఎటువంటి నినాదాన్ని వినలేదు. కాబట్టి ప్రేక్షకులను తప్పుదారి పట్టించడానికి ఆడియోను పాత వీడియోకు డిజిటల్‌గా జోడించారు.
కనుక, 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పాత వీడియోలో “ఓటు చోర్, గడ్డి చోడ్” అనే నినాదం ఆడియోను డిజిటల్‌గా జోడించిన తర్వాత వైరల్‌గా షేర్ చేశారు. ఇటీవలి కాలంలో అలాంటి సంఘటన జరగలేదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.

Claim : ‘ఓటు చోర్, గడ్డి చోడ్’ నిరసనల్లో భాగంగా బీజేపీ ప్రచార వాహనాన్ని ప్రజలు ధ్వంసం చేయడం వైరల్ వీడియో చూపిస్తోంది
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story