ఫ్యాక్ట్ చెక్: శ్రీ వైష్ణో దేవి ఆలయానికి వెళ్తున్న యాత్రికుల పై ప్రజలు రాళ్లు రువ్వడం లేదు, వైరల్ వీడియో ముజఫరాబాద్ కు చెందినది
వైష్ణో దేవి మందిరం త్రికూట కొండలలో ఉంది. ఇది రియాసి జిల్లాలోని ప్రముఖ పట్టణం కాట్రా, బేస్ క్యాంప్ నుండి 13 కి.మీ దూరంలో

Claim :
కాశ్మీర్‌లోని శ్రీ వైష్ణో దేవి ఆలయానికి వెళ్తున్న యాత్రికుల వాహనాలపై ప్రజలు రాళ్లు రువ్వుతున్నారుFact :
ఈ వీడియో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్ కి చెందినది. వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే యాత్రికుల వాహనాలకు సంబంధించింది కాదు
వైష్ణో దేవి మందిరం త్రికూట కొండలలో ఉంది. ఇది రియాసి జిల్లాలోని ప్రముఖ పట్టణం కాట్రా, బేస్ క్యాంప్ నుండి 13 కి.మీ దూరంలో, జమ్మూ నగరం నుండి 63 కి.మీ దూరంలో ఉంది. ఈ మందిరం జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని ఒక ప్రసిద్ధ తీర్థయాత్ర కేంద్రం. దీనిని 1986 నుండి శ్రీ మాతా వైష్ణో దేవి మందిర బోర్డు నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు ఈ పవిత్ర స్థలాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయం సాధారణంగా ఏడాది పొడవునా భక్తులకు తెరిచి ఉంటుంది, కానీ అనుకూల వాతావరణం కారణంగా మార్చి నుండి జూన్ వరకు వేసవి నెలల్లో సందర్శించడానికి ఉత్తమ సమయం. ఆలయం 24 గంటలూ తెరిచి ఉంటుంది.
ఫ్యాక్ట్ చెక్:
ఈ ప్రదేశాన్ని మరింత వివరంగా కొందరు యూజర్లు పోస్ట్ చేసిన వీడియోలో చూడొచ్చు.
ఇది నిజంగానే పాకిస్తాన్ ఆక్రమిత కష్మీర్ ప్రదేశమేనా అని వెతికి చూడగా, ఈ ప్రదేశం నిజంగానే పాక్-ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబద్ అని మాకు తెలిసింది. దీనికి సంబంధించిన స్టాక్ ఇమేజీలను ఇక్కడ చూడొచ్చు.
నివేదికల ప్రకారం, పాకిస్తాన్ సైన్యంలోని పారామిలిటరీ దళమైన పాకిస్తాన్ రేంజర్స్ ముజఫరాబాద్‌లో కాల్పులు జరిపడంతో నలుగురు పౌరులు మరణించారు. ఇది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉద్రిక్త పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. హింసాత్మక ఘర్షణలను అంచనా వేయడానికి ఇస్లామాబాద్‌లో అత్యవసర సమావేశం తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ రూ.23 బిలియన్లను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించిన రోజున ఈ పరిణామం జరిగింది.

