Sun Oct 13 2024 19:03:33 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బంగారు ఆభరణాలను ధరించి ఉన్న వ్యక్తి తిరుమల ఆలయంలో పని చేసే పూజారి కాదు.
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆలయ ప్రసాదమైన ప్రసిద్ధ లడ్డూలకు సంబంధించిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు
Claim :
భారీగా బంగారు ఆభరణాలను ధరించి ఉన్న వ్యక్తి తిరుమల ఆలయంలో పని చేసే పూజారిFact :
వైరల్‌గా మారిన చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి తిరుమల ఆలయ పూజారి కాదు, పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆలయ ప్రసాదమైన ప్రసిద్ధ లడ్డూలకు సంబంధించిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తీరును సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది. మీరే విచారణకు ఆదేశించినప్పుడు, ప్రెస్ ముందుకు వెళ్లవలసిన అవసరం ఏమిటని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. కనీసం, దేవుళ్ళను రాజకీయాల నుండి దూరంగా ఉంచాలని వ్యాఖ్యానించింది.
లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసేందుకు జంతువుల కొవ్వుతో కూడిన కల్తీ నెయ్యిని ఉపయోగించారనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కూడా ప్రారంభించింది. కల్తీ ఆరోపణలు లక్షలాది మంది భక్తులను బాధించాయి. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి నేతృత్వంలోని సిట్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. డీఐజీ గోపీనాథ్ జట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అదనపు ఎస్పీ వెంకట్ రావుతో కూడిన 9 మంది సభ్యుల బృందం తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యి నాణ్యతపై ఆరా తీస్తోంది.
వీటన్నింటి మధ్య, చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు తిరుమల ఆలయంలో అర్చకుడిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తికి సంబంధించిన ఫోటోలు అనే వాదనతో బంగారు ఆభరణాలతో ఉన్న వ్యక్తి చిత్రాల కోల్లెజ్‌ను షేర్ చేస్తున్నారు.
“तिरुपति बालाजी मंदिर के पंडित कि तीन बेटियों की शादी का फोटो और तीनों के सोने के गहनों की वजन 125kg हैं! देशवासियों को यह सोचना चाहिए की दान कहाँ करें, जिससे हमारा दान का लाभ गरीब पीड़ित बेसहारा अस्वस्थ अशिक्षित लोगों को मिले” అంటూ హిందీలో పోస్టులను వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. చెలామణిలో ఉన్న చిత్రాలు పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తివి, తిరుమల ఆలయంలోని పూజారికి సంబంధించింది కాదు.
మేము Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, 2018 సంవత్సరంలో కూడా దాదాపు అదే క్లెయిమ్‌తో చిత్రం వైరల్ అయిందని కనుగొన్నాము.
మేము మరింత శోధించినప్పుడు, గోల్డ్‌మ్యాన్ కాకా 222 పేరుతో ఫేస్బుక్ పేజీని కనుగొన్నాము. ఆ పేజీలో సదరు వ్యక్తి చాలా నగలు ధరించి ఉన్న అనేక చిత్రాలను పంచుకున్నారు. అనేక పోస్ట్‌లలో అతను 'కృత్రిమ ఆభరణాలు అమ్మకానికి ఉన్నాయి' అనే శీర్షికతో ఫోటోలను పంచుకున్నాడు.
సమా టీవీ అనే పాకిస్తానీ వార్తా ఛానెల్ అక్టోబర్ 2018లో యూట్యూబ్‌లో అతడి ఇంటర్వ్యూని ప్రచురించింది. సదరు వ్యక్తి అమ్జాద్ సయీద్ పాకిస్థాన్‌లోని రావల్పిండికి చెందిన వ్యక్తి అని వివరించారు.
మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి బంగారు ఆభరణాలతో ఉన్న మహిళల చిత్రం కోసం వెతికినప్పుడు, ఆ చిత్రం చాలా సంవత్సరాలుగా ఆన్లైన్లో ఉందని, 2016లో సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారని మేము కనుగొన్నాము.
కొలాజ్ లో షేర్ చేసిన చిత్రాల మధ్య ఎలాంటి సంబంధం లేదు. వైరల్ చిత్రాలు తిరుమల ఆలయంలో పనిచేస్తున్న ఏ పూజారికి సంబంధించినవి కావు. ఈ ఫోటోల్లో కనిపిస్తున్న వ్యక్తి పాకిస్థాన్ కు చెందిన వాడు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : భారీగా బంగారు ఆభరణాలను ధరించి ఉన్న వ్యక్తి తిరుమల ఆలయంలో పని చేసే పూజారి
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story