ఫ్యాక్ట్ చెక్: ట్రంప్ విమర్శించినా కూడా ప్రధాని మోదీ నవ్వుతూ ఉండిపోయారనే వాదన నిజం కాదు
భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఫిబ్రవరి 12న ఫ్రాన్స్ నుంచి అమెరికాకు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు

Claim :
ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ అవమానించిన తర్వాత కూడా భారత ప్రధాని మోదీ నవ్వుతూ కనిపించారుFact :
ట్రంప్ అమెరికా మాజీ అధ్యక్షుడు జో బిడెన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను భారత ప్రధాని మోదీకి ఆపాదించారు
భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఫిబ్రవరి 12న ఫ్రాన్స్ నుంచి అమెరికాకు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ద్వైపాక్షిక చర్చలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆతిథ్యం ఇచ్చారు. శ్వేతసౌధంలో ట్రంప్‌తో మోదీ సమావేశమై వివిధ కీలక అంశాలపై భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాలపై చర్చించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీతో విలేకరుల సమావేశం నిర్వహించారు. అక్కడ పలువురు అమెరికన్, భారతీయ జర్నలిస్టులు వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగారు. ఈ జాయింట్ బ్రీఫింగ్లో, ఇద్దరు నేతలు సుంకాలు, 26/11 ముంబై దాడి నిందితుడు తహవుర్ రాణా అప్పగింత, అక్రమ వలసలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో సహా పలు కీలక అంశాలపై ప్రసంగించారు. భారత్‌కు ఎఫ్-35 ఫైటర్ జెట్లను అందించేందుకు అమెరికా మార్గం సుగమం చేస్తోందని కూడా ట్రంప్ ప్రకటించారు. తన రెండు రోజుల యుఎస్ పర్యటనలో, ప్రధాని మోదీ యుఎస్ ఇంటెల్ చీఫ్ తులసి గబ్బర్డ్, జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్జ్, బిలియనీర్ ఎలోన్ మస్క్‌లను కూడా కలిశారు. జనవరి 20న ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను కలిసిన నాలుగో ప్రపంచ నాయకుడు ప్రధాని మోదీ.

