Fri Dec 06 2024 03:53:35 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: భారత హోం మంత్రి అమిత్ షాను ఇంటర్‌పోల్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చారనే వాదనలో నిజం లేదు.
కెనడాలో నివసిస్తున్న సిక్కు వేర్పాటువాదులకు వ్యతిరేకంగా హింసకు పాల్పడేలా చేయడమే కాకుండా, గూఢచారానికి భారత హోం మంత్రి
Claim :
భారత హోం మంత్రి అమిత్ షా ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు వాంటెడ్ లిస్ట్‌లో చేరారు
కెనడాలో నివసిస్తున్న సిక్కు వేర్పాటువాదులకు వ్యతిరేకంగా హింసకు పాల్పడేలా చేయడమే కాకుండా, గూఢచారానికి భారత హోం మంత్రి అమిత్ షా ఆదేశించారని కెనడా అధికారి ఆరోపించారు. కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు వ్యతిరేకంగా ప్రచారానికి అమిత్ షా కీలకంగా వ్యవహరించారని కెనడా ప్రభుత్వం పరిగణిస్తోందని, ఒక వేర్పాటువాది హత్య కూడా ఉందని జాతీయ భద్రతా కమిటీ సభ్యులకు ఉప విదేశాంగ మంత్రి డేవిడ్ మారిసన్ ధృవీకరించారు.
ఈ వ్యాఖ్యలపై భారత అధికారులు ఇంకా స్పందించలేదు, అయితే సిక్కు కార్యకర్తలపై ఆరోపించిన దాడుల్లో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందన్న వాదనలను నిరాధారమైనవని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గతంలోనే ఖండించింది.
ఈ పరిస్థితి మధ్య, భారత హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా ఇంటర్‌పోల్ వాంటెడ్ నోటీసు జారీ చేసిందని సోషల్ మీడియా వినియోగదారులు ఒక చిత్రాన్ని షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ చిత్రం నకిలీది, ఇంటర్‌పోల్ ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు.
ఇంటర్‌పోల్ రెడ్ నోటీసులు ఎప్పుడు జారీ చేస్తుందో తెలుసుకున్నాం. హత్య, అత్యాచారం, మోసం వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించి ప్రాసిక్యూషన్ కోసం లేదా శిక్షను అనుభవించకుండా పారిపోయిన వారి కోసం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తారు. ఒక నుండి ఇంకో దేశానికి పారిపోయినప్పుడు క్రిమినల్ ప్రొసీడింగ్‌లను ఇది అనుసరిస్తుంది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఇతర దేశాలలో ఉన్న వ్యక్తులపై అంతర్జాతీయంగా ఆంక్షలు విధించే అవకాశం ఉంటాయి.
మేము “ఇంటర్‌పోల్ వాంటెడ్ నోటీసు + అమిత్ షా” అనే కీవర్డ్‌లతో సెర్చ్ చేసినప్పుడు, దీనిపై ప్రచురించిన నివేదికలు మాకు కనిపించలేదు. కెనడా అధికారి వ్యాఖ్యలపై అనేక కథనాలు వచ్చినప్పటికీ, ఇంటర్‌పోల్ జారీ చేసిన నోటీసు గురించి ఎటువంటి నివేదిక లేదు.
మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి, మేము ఇంటర్‌పోల్ వెబ్‌సైట్‌ను తెరిచి, అమిత్ షా గురించి ఏవైనా నివేదికల కోసం శోధించాము, అమిత్ షా 2019 సంవత్సరంలో ఓ వార్తా నివేదికను మేము కనుగొన్నాము. ఈ పేరుతో ఇటీవలి వార్తలు ఏవీ లేవు.
ఆ తర్వాత రెడ్ నోటీసుల విభాగంలో ‘అమిత్ షా’ పేరు కోసం వెతికినా, ఆ పేరుతో ఎలాంటి రెడ్ నోటీసు కనిపించలేదు. ఎల్లో నోటీసులు కూడా మాకు కనిపించలేదు.
అందుకే, వైరల్ పోస్ట్‌లలో షేర్ చేసిన చిత్రాన్ని ఎడిట్ చేశారు, అమిత్ షా పేరుపై ఇంటర్‌పోల్ ఎటువంటి రెడ్ నోటీసులు జారీ చేయలేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : భారత హోం మంత్రి అమిత్ షా ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు వాంటెడ్ లిస్ట్‌లో చేరారు
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story