ఫ్యాక్ట్ చెక్: పాకిస్తాన్ కిరానా హిల్స్ బేస్ ను భారతదేశం ధ్వంసం చేసింది అనే ప్రచారం తప్పుదారి పట్టిస్తోంది
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక భారతీయ పర్యాటకులు మరణించినందుకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్

Claim :
పాకిస్తాన్ అణ్వాయుధాలను నిల్వ ఉండే అవకాశం ఉన్న కిరానా హిల్స్ బేస్ ను భారతదేశం ధ్వంసం చేసిందిFact :
కిరానా హిల్స్ పై భారత సాయుధ దళాలు దాడి చేయలేదు
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక భారతీయ పర్యాటకులు మరణించినందుకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత ప్రధానమంత్రి మోదీ భారత పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక ఆపరేషన్ కాదని, సిద్ధాంతపరమైన మార్పు అని అన్నారు. ఇది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసిన ఓ పోరాటం అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, ఇది కొనసాగుతుందని, భారత పౌరులపై రాష్ట్ర ప్రాయోజిత ఉగ్రవాద దాడులపై నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని కూడా ప్రధాని మోదీ అన్నారు.
ఫ్యాక్ట్ చెక్:
పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్‌లోని అణు కేంద్రాన్ని భారత సాయుధ దళాలు లక్ష్యంగా చేసుకోలేదని ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఎకె భారతి ధృవీకరించారని టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన యూట్యూబ్ వీడియోను కూడా మేము కనుగొన్నాము.
అణు స్థావరాలు ఉన్నట్లు నివేదికలు ఉన్నప్పటికీ, భారతదేశం పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్‌ను లక్ష్యంగా చేసుకోలేదని ఎయిర్ మార్షల్ ఎకె భారతి తెలిపారు. భారతదేశం ఉగ్రవాదులు, వారి మౌలిక సదుపాయాలను మాత్రమే టార్గెట్ చేసిందని ఆయన నొక్కిచెప్పారు. ఉగ్రవాద సమూహాలకు పాకిస్తాన్ సైనిక మద్దతు ఇవ్వడం పట్ల విచారం వ్యక్తం చేశారు. డ్రోన్ దాడులను అడ్డుకోవడం, పాకిస్తాన్ ఉపయోగించే చైనా మూలాల క్షిపణుల శిథిలాలను ప్రదర్శించడం వంటి పాకిస్తాన్ దాడులకు వ్యతిరేకంగా భారతదేశం సాధించిన విజయాన్ని భారతి హైలైట్ చేశారు.
Livemint.com లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం దేశ రాజధానిలో డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOs) ప్రత్యేక విలేకరుల సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎయిర్ మార్షల్ భారతి స్పందిస్తూ “కిరణా హిల్స్‌లో కొన్ని అణు సంస్థాపనలు ఉన్నాయని మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. దాని గురించి మాకు తెలియదు. మేము కిరణా హిల్స్‌ను టార్గెట్ చేయలేదు.” అని అన్నారు. కిరణా హిల్స్‌లోని భూగర్భ అణు నిల్వకు అనుసంధానించిన సర్గోధలోని పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌పై భారతదేశం దాడి చేసిందని విస్తృతమైన ఊహాగానాలు, సోషల్ మీడియా వాదనల మధ్య ఎయిర్ మార్షల్ భారతి వ్యాఖ్యలు వచ్చాయి.
పేళ్లుల్లను చూపుతూ సోషల్ మీడియాలో షేర్ అవుతున్న కొన్ని వీడియోలను తీసుకొని వాటి లొకేషన్ నిర్ధారించి చూడగా, మిసైల్లు సొరంగాల దగ్గరగా పేలలేదనీ, వాటికి దూరంగా పేలాయనీ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ తెలిపారు. 'భారత మిసైల్ న్యూక్లియర్ ఆయుధాలు నిల్వ చేసిన సొరంగాలు లేదా సొరంగ ద్వారాలను దగ్గర పేలలేదు, అది కొండ దిగువన (ఖాళీ భాగం) పేలింది. పాకిస్తాన్‌ను హెచ్చరించడానికి లేదా మన క్షిపణులు ఎక్కడ లక్ష్యంగా చేసుకోవచ్చో చూపించడానికి కావచ్చు' అని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.
కనుక, భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్‌లోని రహస్య అణు స్థావరాన్ని ధ్వంసం చేశాయనే వాదన తప్పుదారి పట్టిస్తోంది. అవే కొండచరియల మధ్య, ఖాళీ గా ఉన్న ప్రదేశంలో మిసైళ్లు పేలినట్టు తెలుస్తోంది.
Update: The conclusion of the article has been updated from False to Misleading, based on few facts

