Fri Dec 05 2025 05:26:59 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు అని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారనేది నిజం కాదు
A fake V6 Velugu e-paper clipping claims Komatireddy Raj Gopal Reddy said Congress won’t win Jubilee Hills
Claim :
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని తెలంగాణా MLA కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారని ఈ-పేపర్ క్లిప్పింగ్ కథనంFact :
ఈ-పేపర్ క్లిప్పింగ్ అసలైనది కాదు, వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, ఒక్కో బూత్‌కు నాలుగు బ్యాలెట్ యూనిట్లు ఉన్నాయి. జూన్ 2025లో BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 24, 2025. 23 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్న తర్వాత 58 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులు బేబీ వాకర్, సిసిటివి కెమెరా వంటి చిహ్నాలను ఎంచుకున్నారు. కీలక పోటీ కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ మధ్య ఉండనుంది.
రెండు రోజుల క్రితం విడుదలైన తుది ఓటర్ల జాబితా ప్రకారం, నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత దాదాపు 2,383 మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోదని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారనే వాదనతో కూడిన ఒక ఈ-పేపర్ క్లిప్పింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వైరల్ అవుతోంది.
"జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలవదు, ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుందని వచ్చింది
నవీన్ లాంటి రౌడీలను నిలబెట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరువు తీస్తున్నాడు
రేపు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డినే సమాధానం చెప్పాలి
రేవంత్ దెబ్బకు మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని జోస్యం
ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వకుండా రౌడీకి టికెట్ ఇస్తే ఎలా గెలుస్తారు?
మంత్రులు సునీత మీద వ్యక్తిగత కామెంట్లు తగ్గించకపోతే గెలవడం కష్టం
రేవంత్ రెడ్డి వైఫల్యాల వల్లే నిరుద్యోగులు, రైతులు నామినేషన్లు వేశారు - రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్, ప్రభాత వెలుగు
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి జూబ్లీహిల్స్ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు, నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి ఆయన కార్యకర్తలతో కలిసి భోజనం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలవదని, ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుంది అంటున్నారని బాంబు పేల్చారు. సరీస్ లాంటి. రౌడీలను నిలబెట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరువు తీస్తున్నాడని, నవీన్ యాదవ్ ఒకప్పుడు నా ఇంటిని కబ్జా చేయడానికి ప్రయత్నించాడని ఆయన అన్నారు. రేపు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డినే సమాధానం చెప్పాలని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో సమాధి చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వకుండా రౌడీకి టికెట్. ఇస్తే ఎలా గెలుస్తారు? అని ఆయన ప్రశ్నించారు. మంత్రులు మాగండి సునీత మీద వ్యక్తిగత కామెంట్లు తగ్గించకపోతే గెలవడం కష్టమని హితవు పలికారు. రేవంత్ రెడ్డి వైఫల్యాల వల్లే నిరుద్యోగులు, రైతులు జూబ్లీహిల్స్‌లో నామినేషన్లు వేశారని ఫైర్ అయ్యారు." అని ఈ చిత్రం లో ఉంది.
వైరల్ పోస్టు స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
మేము ఈ-పేపర్ క్లిప్పింగ్‌ను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, ఈ-పేపర్ క్లిప్పింగ్‌లో వెలుగు లోగో, https://epaper/v6velugu.com/c అనే URLతో ప్రభాత వెలుగు అని ఉందని తెలుసుకున్నాము. దానిపై క్లిక్ చేసినప్పుడు, ఏ వెబ్సైట్ లింక్‌కు దారితీయలేదు. లింక్ 404 ఎర్రర్‌కు దారితీసింది.
ఇక వార్తాపత్రిక క్లిప్పింగ్‌లోని తేదీని అక్టోబర్ 25, 2025గా చూడవచ్చు. వైరల్ ఈపేపర్ క్లిప్పింగ్‌ను పోలి ఉండే ఈపేపర్ను మేము తనిఖీ చేసాము. V6 న్యూస్ ద్వారా ఆన్లైన్లో ప్రచురించిన V6 ప్రభాత వెలుగును మేము కనుగొన్నాము. మేము 25 అక్టోబర్ 2025న ప్రచురించిన V6 ప్రభాత వేలుగు ఇ-పేపర్‌ను నిశితంగా పరిశీలించాం. అయినా కూడా మాకు ఎక్కడా వైరల్ క్లిప్పింగ్ కనిపించలేదు.
వైరల్ ఈపేపర్ క్లిప్పింగ్‌ను V6 వెలుగు ప్రచురించిన ఈపేపర్ క్లిప్పింగ్‌తో పోల్చినప్పుడు, వైరల్ చిత్రంలో కొన్ని వ్యత్యాసాలను మేము కనుగొన్నాము. అసలు ఈపేపర్ క్లిప్పింగ్‌లో క్లిప్పింగ్‌పై ప్రభాత వెలుగు గురించి ప్రస్తావించలేదు, కానీ వెలుగు గురించి ప్రస్తావించారు. టెంప్లేట్‌లోని URL లింక్ ఒక సంఖ్యతో ముగుస్తుంది, ఇది ఆన్లైన్ ఈపేపర్ కథనానికి దారితీస్తుంది. ఉదా., https://epaper.v6velugu.com/c/78408138 .
25 అక్టోబర్ 2025న ప్రచురించిన V6 వెలుగు ఈపేపర్ క్లిప్పింగ్ కు, వైరల్ ఇమేజ్ కు పోలిక ఇక్కడ ఉంది.
కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రచురించిన అటువంటి పోస్ట్‌ల కోసం మేము వెతికినప్పుడు, సోషల్ మీడియాలో ప్రచురించిన అటువంటి పోస్ట్‌లు ఏవీ మాకు కనిపించలేదు. ఆయన అధికారిక X ఖాతాలో చివరి పోస్ట్ అక్టోబర్ 14, 2025న జరిగింది.
ప్రభాత వెలుగుకు సంబంధించిన పోస్ట్‌ల కోసం కూడా శోధించాము. V6 ప్రభాత వెలుగు ఈపేపర్, వెబ్సైట్ లేదా వారి సోషల్ మీడియా హ్యాండిళ్లలో అటువంటిది ఏదీ ప్రచురించలేదు.
కాబట్టి, వెలుగు ప్రచురించినట్లుగా ఉన్న ఈ-పేపర్ క్లిప్పింగ్ కల్పితమైనది. కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారనే వాదన నిజం కాదు.
Claim : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారని ఈ-పేపర్ క్లిప్పింగ్ కథనం
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story



