Sat Feb 28 2026 23:37:59 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: గాజాకు చెందిన విజువల్స్ ను ఆఫ్ఘనిస్థాన్ పై పాకిస్థాన్ చేసిన దాడిగా ప్రచారం చేస్తున్నారు
గాజాకు చెందిన విజువల్స్ ను ఆఫ్ఘనిస్థాన్ పై పాకిస్థాన్ చేసిన దాడిగా

Claim :
వైరల్ అవుతున్న విజువల్స్ కాబూల్ ఎయిర్ పోర్టు మీద పాకిస్థాన్ చేసిన వైమానిక దాడిFact :
ఈ విజువల్స్ గాజాకు చెందినది. 2024 నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. గత కొద్ది నెలలుగా రెండు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతుండగా, ఇప్పుడు పాక్ ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ పై బాంబులతో దాడికి దిగింది. పాక్ దాడుల్లో 22 ఆఫ్ఘన్ మిలిటరీ స్థావరాలు ధ్వంసమయ్యాయని, దాదాపు 274 మంది తాలిబాన్ మిలిటెంట్లు, అధికారులు ప్రాణాలు కోల్పోయారని పాక్ మిలిటరీ అధికార ప్రతినిధి ప్రకటించారు. తాలిబాన్ల దాడిలో 12 మంది పాక్ సైనికులు కూడా మరణించినట్లు తెలిపారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా దాడి చేసేవారిని అణిచివేసే పూర్తి సత్తా తమకు ఉందని హెచ్చరించారు.
తమ వద్ద ఉన్న డ్రోన్ల సాయంతో పాకిస్థాన్ సైనిక స్థావరాలపై దాడులు విజయవంతంగా పూర్తి చేశామని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెండు దేశాల మధ్య మారుతున్న ఈ భయానక వాతావరణాన్ని గమనించిన ఇరాన్, రష్యా, చైనా దేశాలు.. తాము మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని, వెంటనే కాల్పుల విరమణ పాటించాలని కోరాయి.
ఇంతలో పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడిలో కాబూల్ ఎయిర్ పోర్టు ధ్వంసం అయిందంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఓ భారీ బ్లాస్ట్ తర్వాత మంటలు ఎగసిపడినట్లుగా ఆ ఫోటో ఉంది.
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న ఫోటో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
మేము సంబంధిత సమాచారం కోసం వెతకగా ఆఫ్ఘనిస్థాన్ లోని కీలక నగరాలైన కాబూల్, కాందహార్‌లపై వైమానిక దాడులు ప్రారంభించిన కొన్ని గంటల తర్వాత, పాకిస్తాన్ నిఘా విమానాలు ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఎగురుతున్నాయని తాలిబాన్ ప్రభుత్వం తెలిపింది. "ఇప్పటికీ, ప్రస్తుతం, పాకిస్తాన్ విమానాలు, నిఘా విమానాలు, ఆఫ్ఘనిస్తాన్ గగనతలంపై ఎగురుతున్నాయి" అని ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ దక్షిణ నగరమైన కాందహార్‌లో ప్రస్తావించారు. అయితే వైరల్ పోస్టుల్లో తెలిపినట్లుగా కాబూల్ ఎయిర్ పోర్టు ధ్వంసం అయిందంటూ ఎలాంటి ప్రకటన అటు పాకిస్థాన్ ప్రభుత్వం కానీ, ఇటు తాలిబాన్ ప్రభుత్వం కానీ చెప్పలేదు.
ఇక వైరల్ అవుతున్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాం. వైరల్ చిత్రం పాతది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలకు సంబంధం లేదు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ మార్చి 27, 2024న అల్ మానిటర్ నివేదికను ప్రచురించింది. దక్షిణ గాజాలో రఫాలో ఇజ్రాయెల్ బాంబు దాడి గురించి ఒక కథనంలో అదే ఛాయాచిత్రాన్ని కలిగి ఉంది.
కథనానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఇదే చిత్రం మార్చి 2024లో www.news24.comలో ప్రచురితమైన AFP నివేదికలో కనిపించింది, “ఇజ్రాయెల్- పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం మధ్య, దక్షిణ గాజా స్ట్రిప్‌లోని రఫాపై ఇజ్రాయెల్ బాంబు దాడి సమయంలో భారీ అగ్నిగోళం కనిపించింది.” అని ఉంది.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ప్రస్తుత ఉద్రిక్తతలకు ముందే, మార్చి 2024 నుండి ఈ చిత్రం ఆన్లైన్లో అందుబాటులో ఉందని ఈ నివేదికలు తెలియజేస్తున్నాయి.
ప్రముఖ ఫ్యాక్ట్ చెక్ సంస్థ D-Intent Data కూడా వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయని స్పష్టం చేశాయి. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఆఫ్ఘనిస్తాన్పై ఇటీవల పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులకు సంబంధించిన వాదనలతో రాత్రిపూట పేలుడు సంభవించినట్లు చూపించే చిత్రం ప్రచారంలో ఉంది. అయితే ఆ చిత్రం పాతదని అందులో తెలిపారు.
ప్రముఖ ఫ్యాక్ట్ చెక్ సంస్థ D-Intent Data కూడా వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయని స్పష్టం చేశాయి. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఆఫ్ఘనిస్తాన్పై ఇటీవల పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులకు సంబంధించిన వాదనలతో రాత్రిపూట పేలుడు సంభవించినట్లు చూపించే చిత్రం ప్రచారంలో ఉంది. అయితే ఆ చిత్రం పాతదని అందులో తెలిపారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
Claim : ఈ విజువల్స్ గాజాకు చెందినది. 2024 నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

