Fri Dec 05 2025 11:13:34 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: పహల్గామ్ లో దాడి చేసిన తీవ్రవాదులంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల వీడియోలను వైరల్ చేస్తున్నారు
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించిన వీడియో

Claim :
వైరల్ వీడియోలో ఉన్నది పహల్గామ్ ఉగ్రదాడి చేసిన తీవ్రవాదులుFact :
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించిన వీడియో ఇది
26 మందిని బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత, జమ్మూ కాశ్మీర్ లో లష్కరే తోయిబా (ఎల్ఇటి) కమాండర్‌తో సహా ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ళు ధ్వంసమయ్యాయి. షోపియన్, కుల్గాం, పుల్వామా జిల్లాల్లో భద్రతా దళాలు ఎల్ఇటి తీవ్రవాదులు, ఈ ఘోరమైన దాడితో సంబంధం ఉన్న అనుమానితులపై అణిచివేతను ముమ్మరం చేశాయి.
షోపియన్‌లోని చోటిపోరా గ్రామంలో, ఎల్ఇటి కమాండర్ షాహిద్ అహ్మద్ ఇంటిని కూల్చివేశారు. షాహిద్ అహ్మద్ గత మూడు, నాలుగు సంవత్సరాలుగా ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలలో చురుకుగా ఉన్నాడు. దేశ వ్యతిరేక కార్యకలాపాలను సమన్వయం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని అధికారులు తెలిపారు. కుల్గాంలోని మతలం ప్రాంతంలో ఉగ్రవాది జాహిద్ అహ్మద్ ఇంటిని కూడా కూల్చివేశారు. పుల్వామాలోని ముర్రాన్ ప్రాంతంలో, ఉగ్రవాది అహ్సాన్ ఉల్ హక్ ఇంటిని పేల్చేశారు. 2018లో పాకిస్తాన్లో ఉగ్రవాద శిక్షణ పొందిన అహ్సాన్ ఇటీవల లోయలోకి తిరిగి ప్రవేశించాడు. జూన్ 2023 నుండి క్రియాశీలకంగా పనిచేస్తున్న ఎల్ఇటి ఉగ్రవాది ఎహ్సాన్ అహ్మద్ షేక్ నివాసం కూడా కూల్చివేశారు.
2023 నుండి క్రియాశీలకంగా పనిచేస్తున్న ఐదవ ఉగ్రవాది హరిస్ అహ్మద్ నివాసం పుల్వామాలోని కాచిపోరా ప్రాంతంలో ఉంది. అది కూడా పేలుడు కారణంగా ధ్వంసమైంది. ఉగ్రవాదులందరిపై కేసు నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పహల్గామ్ దాడి వెనుక ఉన్న ఇద్దరు ఎల్ఇటి ఉగ్రవాదులు, ఆదిల్ హుస్సేన్ థోకర్, ఆసిఫ్ షేక్ ఇళ్లను కూడా పేలుడు పదార్థాలతో ధ్వంసం చేశారు.
ఇంతలో పహల్గామ్ ఉగ్రవాదులు వీడియోను రిలీజ్ చేశారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. కారులో కూర్చొని ఆ వ్యక్తులు మాట్లాడడం మనం చూడొచ్చు.
"పహెలగ్మాం దాడులు తర్వాత వీడియో రిలీజ్ చేసిన ఉగ్రవాదులు..
ఉగ్రవాదం కంటే దేశంలోనే ఉండి ఇలాంటి ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తున్నా వారిని ఏరి పారేయాలి..
సేఫ్ గా వచ్చి దాడులు చేసి సేఫ్ గా తిరిగి వెళ్ళారు అంటే,మనం మధ్యలోనే దేశ ద్రోహులు ఉన్నారు..
వీళ్ళకంటే దేశ ద్రోహులే చాలా ప్రమాదం దేశానికి.!" అంటూ పోస్టు పెట్టారు.

వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
వైరల్ వీడియోలో ఉన్నది పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న తీవ్రవాదులు కాదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు సంబంధించిన వీడియోను తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మాకు Linda Traitz అనే ఫేస్ బుక్ పేజీలో ఏప్రిల్ 17, 2025న పోస్టు చేసిన అదే వీడియో మాకు కనిపించింది.
తదుపరి పరిశోధనలో వైరల్ వీడియోలోని వ్యక్తులకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా లభించింది.
వైరల్ వీడియోలోని ఒరిజినల్ వీడియో మాకు లభించింది. ఏప్రిల్ పదకొండున, పహల్గామ్ ఘటన చోటు చేసుకోక ముందే అసలు వీడియోను పోస్టు చేశారు.
సాదిక్(_sadiq999_) అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు రెండు లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అతడి ఖాతాలో పలు ఫైట్స్ కు సంబంధించిన వీడియోలు, తన మిత్రులతో కలిసి తిరుగుతున్న వీడియోలు ఉన్నాయి. తన సోషల్ మీడియా ఖాతాలో పలు దేశాలకు చెందిన వ్యక్తులతో షార్ట్ వీడియోలు చేసాడు.
వైరల్ వీడియోలోని వ్యక్తులకు సంబంధించిన పలు పోస్టులను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
పహల్గామ్లో ఇటీవల జరిగిన దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను చూపించే వీడియోను తప్పుడు వాదనతో ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియో పహల్గామ్ ఘటన కంటే ముందే పోస్ట్ చేసినట్లు గుర్తించాం.
ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థ D-Intent Data కూడా అదే విషయాన్ని ట్విట్టర్ లో పోస్టు చేసింది.
కాబట్టి, వైరల్ వీడియోలో ఉన్నది పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న తీవ్రవాదులు కాదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. పహల్గామ్ ఘటన కంటే ముందు నుండి ఈ వీడియో ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది.
వైరల్ పోస్టులను తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు.
Claim : సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించిన వీడియో
Claimed By : Social Media Users
Claim Reviewed By : TeluguPost
Claim Source : Social Media
Fact Check : False
Next Story