Mon Jun 16 2025 19:35:55 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వీడియోకు RCB జట్టు సెలెబ్రేషన్స్ కు ఎలాంటి సంబంధం లేదు
ఈ వీడియోకు RCB జట్టు విజయం సాధించిన తర్వాత సెలెబ్రేషన్స్

Claim :
వైరల్ అవుతున్న వీడియో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిన తర్వాత చోటు చేసుకున్న సంబరాలుFact :
ఈ వీడియోకు RCB జట్టు విజయం సాధించిన తర్వాత సెలెబ్రేషన్స్ కు ఎలాంటి సంబంధం లేదు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జూన్ 03, 2025న పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి 18 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికి తొలి IPL టైటిల్‌ను కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. బెంగళూరు, ఇతర నగరాల్లో అభిమానులు జెండాలు ఊపుతూ వీధుల్లోకి వచ్చి ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. అయితే, బెంగళూరులో జరిగిన విజయోత్సవ వేడుకలు విషాదకరంగా మారాయి, తొక్కిసలాటలో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ ఫైనల్స్ లో విజయం సాధించిన తర్వాత విక్టరీ పరేడ్ ను బెంగళూరులో నిర్వహించాలనుకున్నారు. బెంగళూరులో విక్టరీ పరేడ్ ఉందని తెలిసిన తర్వాత కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కు చెందిన కొందరు చిన్న స్వామి స్టేడియంలో టిక్కెట్లు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. చిన్న స్వామి స్టేడియంలోకి వెళ్లాలంటే ఉచిత పాస్ లు కూడా జారీ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. టిక్కెట్లు ఎందుకు జారీ చేశారన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్టేడియం వద్దకు లక్షల సంఖ్యలో భారీగా అభిమానులు చేరతారని ముందుగా అందరూ అంచనా వేసినప్పటికీ ఇంటలిజెన్స్ వైఫల్యం ఉంది. అందుకే ఇంటలిజెన్స్ చీఫ్ హేమంత్ ను కూడా బదిలీ చేశారు.
తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎ.శంకర్, కోశాధికారి ఇఎస్ జైరామ్ రాజీనామా చేశారు. ఐపీఎల్ 18 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఆర్సీబీ ట్రోఫీని గెలుచుకుంది, కానీ వేడుకల పరేడ్‌లో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించగా, 50 మంది గాయపడ్డారు. బెంగళూరులో జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ వేడుకలు 11 మంది అభిమానుల మరణానికి దారితీసిన తర్వాత, పోలీసులు ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు.
ఇంతలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించాక చేసుకున్న సంబరాలు అంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించాక చోటు చేసుకున్న పరిణామాలు అంటూ పలువురు ఈ పోస్టులను వైరల్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ సత్తా అంటూ కూడా ఈ వీడియోలను షేర్ చేస్తున్న వారు చెబుతున్నారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. చైనాకు చెందిన వీడియోను ఆర్సీబీ విజయోత్సవాలకు సంబంధించిన విజువల్స్ గా ప్రచారం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము.
వైరల్ అవుతున్న అదే వైరల్ క్లిప్‌ను జనవరి 2, 2025న అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. ఆ క్లిప్ చైనాలోని నాన్‌చాంగ్ నుండి వచ్చిందని పోస్ట్‌లో పేర్కొన్నారు.
జూన్ 3న IPL సీజన్ ముగిసింది. కాబట్టి ఈ క్లిప్ కు, ఆర్సీబీకి ఎలాంటి సంబంధం లేదు.
shanghai.explore పేజీలో శాంఘై నగరానికి సంబంధించిన పలు వీడియోలు మాకు లభించాయి.
జనవరి 1న షాంఘై ఐ అనే వార్తా సంస్థ యూట్యూబ్ పేజీలో "Thousands gather in Nanchang city centre releasing balloons to celebrate the New Year" అనే టైటిల్ తో అప్లోడ్ చేసిన అదే వీడియోను కూడా మేము కనుగొన్నాము. నూతన సంవత్సర వేడుకల్లో బెలూన్లను ఎగురవేయడానికి నాన్‌చాంగ్ లో జరిగిన ఈవెంట్లను చూపించినట్లు వార్తా సంస్థ పేర్కొంది.
ఇక వైరల్ వీడియోలోని పలు చోట్ల చైనీస్ భాషలో హోర్డింగ్స్ ఉండడం కూడా మేము గమనించాం. దీన్ని బట్టి ఈ వీడియోకు ఆర్సీబీ విజయోత్సవ వేడుకలకు ఎలాంటి సంబంధం లేదని తేలింది.
తొలి ఐపీఎల్ ట్రోఫీ RCB గెలిచిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చారంటూ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఎలాంటి నిజం లేదు. చైనాకు సంబంధించిన పాత వీడియో వైరల్ అవుతోంది
Claim : ఈ వీడియోకు RCB జట్టు విజయం సాధించిన తర్వాత సెలెబ్రేషన్స్ కు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story