ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో లో రెక్కల చివర కనిపించే ఆకృతులు రసాయన స్ప్రే కాదు
విమానం ప్రయాణించడానికి ఇంధనాన్ని వాడడం వల్ల CO2 మాత్రమే కాకుండా నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ డయాక్సైడ్, ఇంకా ఆవిరి గుర్తు

Claim :
విమానం ల్యాండింగ్‌కు ముందు పైలట్ రసాయన స్ప్రేయింగ్‌ను ఆఫ్ చేయడం మరచిపోయినందున అనుమానాస్పదమైన అకృతులు కనపడ్డాయిFact :
వైరల్ వీడియో విమానం ల్యాండింగ్ సమయంలో ఏర్పడిన వింగ్టిప్ వోర్టిసెస్ (wingtip vortices) ను చూపిస్తుంది, కెమ్స్ప్రే కాదు
విమానం ప్రయాణించడానికి ఇంధనాన్ని వాడడం వల్ల CO2 మాత్రమే కాకుండా నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ డయాక్సైడ్, ఇంకా నీటి ఆవిరి, ధూళి కణాలు వంటి అనేక ఇతర వాయువులను కూడా విడుదల చేస్తుంది. ఎన్నో శాస్త్రీయ అధ్యయనాలు, మీడియా, ప్రభుత్వాల రిపోర్ట్ ప్రకారం, విమానం వెనుక కనిపించే తెల్లటి పొగ, ఇంజిన్ పార్టికులేట్ ఎమిషన్ల తో కలిసిన తేమ కణాలు, ఇవి నిర్దిష్ట వాతావరణ పరిస్థితులలో మాత్రమే కనపడతాయి. వాటిని కండెన్సేషన్ ట్రెయిల్స్ అని పిలుస్తారు. గంటల తరబడి ఉండి అనేక కిలోమీటర్ల వెడల్పు ఉన్నప్పుడు వాటిని సిర్రస్ కాంట్రెయిల్స్ అని పిలుస్తారు.
కానీ ఈ జాడలలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని, అధికారులు ప్రమాదకరమైన రసాయనాలను ప్రజలపై స్ప్రే చేస్తున్నారని చాలా మంది భావిస్తారు, దీనిని కెమ్ట్రెయిల్స్ (chemtrails) అంటారు
ఇటీవల, ఒక విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత కూడా దట్టమైన పొగను వదులుతూ చూపిస్తున్న వీడియోను X వినియోగదారుడు షేర్ చేస్తూ, ల్యాండింగ్‌కు ముందు పైలట్ కెమ్ట్రెయిల్స్ లేదా డెత్ స్ప్రేని ఆఫ్ చేయడం మరచిపోయాడని అంటూ షేర్ చేస్తున్నారు. ల్యాండింగ్ సమయంలో కొన్ని తిరుగుతున్న గాలి నమూనాలను కూడా మనం చూడవచ్చు.
క్లెయిం లింకులను ఇక్కడ చూడొచ్చు.
క్లెయిం ఆర్కైవ్ లింకు ని ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
ఈ వాదన అబద్దం. వైరల్ వీడియో పైలట్ ఉద్దేశపూర్వకంగా విమానం ద్వారా వెదజల్లుతున్న కెమ్ట్రెయిల్స్ స్ప్రేని చూపించడం లేదు.
కీలక పదాలను ఉపయోగించి విమానం ఎగురుతున్నప్పుడు ఎగ్జాస్ట్ పొగ ను గురించి శోధించినప్పుడు, వీడియో విమానం రెక్క లు సృష్టించిన వింగ్టిప్ వోర్టిసెస్ (wingtip vortices) ను చూపిస్తుందని తెలుసుకున్నాం. ఈ నమూనాలు అన్ని విమానాల వెనుక ఎల్ల వేళలా కనిపించవు, కానీ నిర్దిష్ట వాతావరణ పరిస్థితులలో చూడవచ్చు.
వింగ్టిప్ వోర్టిసెస్ (wingtip vortices) అంటే విమానం రెక్కలు లిఫ్ట్ చేస్తున్నప్పుడు దాని వెనుక ఏర్పడే తిరుగుతున్న గాలి పొరలు. రెక్క గాలిలో కదులుతున్నప్పుడు, పై ఉపరితలంపై తక్కువ పీడన ప్రాంతం, దిగువ ఉపరితలంపై అధిక పీడన ప్రాంతం ఏర్పడతాయి. ప్రెజర్ లో వ్యత్యాసం గాలిని రెక్క చివర చుట్టూ వేగవంతం చేస్తుంది. గాలి రెక్క వెనుకకు లోపలికి తిరుగుతుంది, వోర్టెక్స్ను ఏర్పరుస్తుంది. విమానం గాలిలో ఉన్నప్పుడల్లా వింగ్టిప్ వోర్టిసెస్ (wingtip vortices) ఉన్నప్పటికీ, తిరుగుతున్న గాలి సాధారణంగా వీటిని చూపించవు. కానీ, తేమ ఎక్కువగా ఉన్న రోజులలో, మీరు రెక్క చివర నుండి వస్తున్న వోర్టెక్స్ ను చూడగలరు.
వోర్టెక్స్ కోర్ లోపల గాలి ప్రవాహం చాలా ఎక్కువ వేగంతో తిరుగుతూ చాలా తక్కువ పీడనాన్ని కలిగి ఉంటుంది. ఇది లోపల గాలి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఉష్ణోగ్రత స్థానిక డ్యూ పాయింట్ ఉష్ణోగ్రత కంటే తక్కువగా పడిపోతే, గాలిలోని తేమ వేగంగా కండెన్స్ అవుతుంది, రెక్క చివర ఒక చిన్న మేఘాన్ని ఏర్పరుస్తుంది. కానీ మీరు క్రూజింగ్ ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని చూస్తున్నట్లయితే, మీరు చూసే కాంట్రెయిల్స్ (contrails) ఇంజిన్ల నుండి వస్తాయి, వోర్టిసెస్ (vortices) నుండి కాదు. వింగ్టిప్ వోర్టిసెస్ (wingtip vortices) నుండి కాంట్రెయిల్స్ (contrails) చూసే అవకాశం విమానం తక్కువ వేగంతో, తేమగా ఉన్న రోజులలో తక్కువ ఎత్తులో ఎగురుతున్నప్పుడు ఉంటుంది. ఈ వోర్టిసెస్ (vortices) గాలి ప్రవాహంలో అంతరాయాలు ఉన్న ఇతర ప్రదేశాలలో కూడా ఉంటాయి. టేకాఫ్ లేదా ల్యాండింగ్ కోసం విమానం ఫ్లాప్‌లు విస్తరించినప్పుడు వాటి చివరలలో అవి ఉంటాయి, అప్పుడప్పుడు కనిపిస్తాయి.
వెర్టెక్స్ బలాన్ని ప్రభావితం చేసే అనేక అంశాలు ఉన్నాయి. అవి విమానం వేగం, విమానం బరువు, విమానం ఎగిరే కోణం, రెక్క ఆకృతి, నేలకు విమానం సామీప్యం.
వింగ్టిప్ వోర్టిసెస్ (wingtip vortices) వెనుక ఉన్న శాస్త్రం గురించి పూర్తి వివరణ ఈ వీడియోలో చూడొచ్చు.
కాబట్టి, వైరల్ వీడియోలో కనిపించే గాలి పొరలు కెమ్ట్రెయిల్స్ (chemtrails) కాదు, తేమ ఉన్న గాలి లో ఏర్పడే వింగ్టిప్ వోర్టిసెస్ (wingtip vortices) మాత్రమే. ల్యాండింగ్ సమయంలో పైలట్ రసాయనాల స్ప్రేయింగ్‌ను స్విచ్ ఆఫ్ చేయడం మరచిపోయాడనే వాదన అవాస్తవం. వాతావరణంలో అధిక తేమ కారణంగా కనిపించే సహజమైన గాలి పొరలు ఇవి.