Sun Dec 08 2024 02:35:29 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: దుర్గా మండపంలోకి ముస్లిం మహిళను పూజారి అడ్డుకుంటున్న వీడియో స్క్రిప్టెడ్. నిజంగా జరిగిన ఘటన కాదు.
దుర్గా మండపంలోకి ముస్లిం మహిళను పూజారి అడ్డుకుంటున్న
Claim :
దుర్గా మండపం లోకి ముస్లిం మహిళను రానివ్వలేదుFact :
ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. నటీనటులను పెట్టి ఈ వీడియోను క్రియేట్ చేశారు
భారతదేశ వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు అమ్మవారి శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి. తొమ్మిది రోజుల నవరాత్రిలో మొదటి మూడు రోజులూ దుర్గాదేవికి అంకితం కాగా తరువాతి మూడు రోజులూ లక్ష్మి దేవికి అంకితం, ఆఖరి మూడు రోజులూ సరస్వతికి అంకితం. పదవ రోజైన విజయదశమి, జీవితంలోని ఈ మూడు అంశాలపై పరిపూర్ణమైన విజయాన్ని సూచిస్తుంది.
దేశంలోని పలు ప్రాంతాల్లో అమ్మవారి విగ్రహాలను మండపాలలో ఉంచి గొప్పగా పూజలు నిర్వహించారు. అయితే ఓ మండపానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలా అనిపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
ఓ మండపం దగ్గర అప్పటికే ఓ పూజారి, మరికొంత మంది వ్యక్తులు ఉండగా, ఓ మహిళ బురఖా ధరించి అక్కడకు వస్తుంది. చెప్పులు విడిచి మండపం లోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. తాను పూజ కోసం వచ్చానని తన చేతుల్లో ఉన్న పూజా సామాగ్రిని చూపెడుతుంది. అయితే అందుకు అక్కడ ఉన్న పూజారి ఒప్పుకోడు. దీంతో ఆ మహిళ తన బురఖాను తీసేస్తుంది. అక్కడ ఉన్న వ్యక్తులు ఆ మహిళ కోసం పూజను నిర్వహించండి అంటూ పూజారికి సూచిస్తారు. ఆ మహిళ ఎంతో భక్తితో అమ్మవారికి పూజలు చేస్తుంది. ఆ తర్వాత పూజారి కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఈ పరిణామాలకు పూజారి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఆమె పూజను పూర్తీ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

ఒక ముస్లిం మహిళ ఎంతో శ్రద్ధతో దుర్గామాతకు పూజలు చేయడానికి వచ్చింది. ఇది పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఘటన అంటూ వైరల్ పోస్టుల్లో తెలిపారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియో నిజమైనది కాదు. స్క్రిప్టెడ్ వీడియో.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం.
Sanjjanaa Galrani అనే అకౌంట్ లో ఈ వీడియోను పోస్టు చేశారని గుర్తించాం. దీనికి 14 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
"This Was Unexpected..! 😲😲
.
.
.
.
Disclaimer: Thank you for watching! Please note that this page features scripted dramas, parodies, and awareness videos. These short films are created for entertainment and educational purposes only. All characters and situations depicted in the videos are fictional and intended to raise awareness, entertain, and educate." అనే టైటిల్ తో వీడియోను పోస్ట్ చేశారు.
ఈ వీడియో చివరిలో రీల్ లైఫ్ వీడియోను ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి సృష్టించామంటూ వివరణ ఇవ్వడం మనం చూడొచ్చు.
కాబట్టి, ఇది నటీనటులతో చిత్రీకరించిన వీడియో అని స్పష్టంగా తెలుస్తోంది.
ఈ అకౌంట్ నటి సంజనా గల్రాని పేరు మీద ఉన్నా ఎన్నో స్క్రిప్టెడ్ వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. అక్టోబర్ 9న అప్లోడ్ చేసిన మరో వీడియోలో కూడా వైరల్ వీడియోలోని మండపాన్ని మేము గమనించాం.
కాబట్టి, ఈ అకౌంట్ లో అప్లోడ్ చేస్తున్న చాలా వీడియోలు స్క్రిప్టెడ్ అని మేము గుర్తించాం. వైరల్ అవుతున్న వీడియో నిజంగా జరిగిన సంఘటన అయితే కాదు. నటీనటులతో యాక్ట్ చేయించిన వీడియోను సీసీటీవీ ఫుటేజీలా భ్రమింపజేస్తూ వీడియోను అప్లోడ్ చేశారు.
ఈ వీడియో స్క్రిప్టెడ్ అంటూ పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా కథనాలను ప్రచురించాయి. అవి, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వైరల్ వీడియో స్క్రిప్టెడ్.. నిజంగా చోటు చేసుకున్నది కాదు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశ్యంతో వీడియోను షేర్ చేస్తున్నారు.
Claim : దుర్గా మండపం లోకి ముస్లిం మహిళను రానివ్వలేదు
Claimed By : social media users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media
Fact Check : Misleading
Next Story