Fri Dec 05 2025 08:23:25 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బాలిక సంగీత కచేరీని కేరళలో ఆపించిన ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదు
ఈవెంట్ మొదలుపెట్టి చాలా సమయం అయిందంటూ

Claim :
చిన్న పాప కచేరిని కేరళ లో ముస్లింలు ఆపేసిన దృశ్యంFact :
ఈవెంట్ మొదలుపెట్టి చాలా సమయం అయిందంటూ, అనుమతి ఇచ్చిన సమయం దాటిందంటూ పోలీసులు ఈవెంట్ ను నిలిపివేశారు
దుబాయ్‌లోని కేరళీయులలో ఒక వర్గం మే నెలలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిని హృదయపూర్వకంగా స్వాగతించడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత అఫ్రిది చేసిన వ్యాఖ్యలే ఈ విమర్శలకు కారణమయ్యాయి. భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తీవ్రతరం చేసింది.
ఆన్లైన్లో వైరల్ అయిన ఒక వీడియోలో ఈ కార్యక్రమంలో కేరళీయులు అఫ్రిదిని వేదికపై ఉత్సాహంగా స్వాగతిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రేక్షకులు బిగ్గరగా హర్షధ్వానాలతో ఆయనకు స్వాగతం పలికారు. అఫ్రిది ముద్దుపేరు "బూమ్ బూమ్" అని నినాదాలు చేశారు.
అయితే ఈ కార్యక్రమానికి తాము అఫ్రీదీని ఆహ్వానించలేదని కేరళకు చెందిన గ్రూప్ వివరించింది. ఈ సంఘటన విస్తృత దుమారానికి దారితీయడంతో, కొచ్చిన్ యూనివర్సిటీ బిటెక్ పూర్వ విద్యార్థుల సంఘం (CUBAA) ఈ సంఘటనకు క్షమాపణలు చెబుతూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ను విడుదల చేసింది. ఇది ఉద్దేశపూర్వకంగా జరగలేదని పేర్కొంది.
ఇక కేరళలో ఓ బాలిక వయోలిన్ వాయిస్తూ ఉంటే ముస్లింలు అడ్డుకున్నారనే వాదనతో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులు కచేరీని అంతరాయం కలిగించారనే వాదనతో ఒక బాలిక తన వయోలిన్ వాయించడం మధ్యలో ఆపుతున్న వీడియో వైరల్ అవుతోంది. 1.17 నిమిషాల నిడివి గల ఈ వీడియోను ఫేస్బుక్, వాట్సాప్‌లో "కేరళలోని ముస్లింలు సంగీత కచేరీని ఆపివేశారు" అనే శీర్షికతో షేర్ చేస్తున్నారు.
"ఈ చిన్న పాప చేస్తున్న కచేరిని కేరళ లో ముస్లింలు ఆపేసిన దృశ్యం. హిందూస్తాన్ లో హిందువుల దుర్గతి
Muslims in kerala stopped music concert and see the fate of India" అంటూ పోస్టులు పెట్టారు.

వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను మీరు ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
వైరల్ వీడియోలో మలయాళ వార్తా సంస్థ 'మనోరమ న్యూస్ లోగో' ఉందని మేము గమనించాము. నిర్దిష్ట కీవర్డ్ సెర్చ్ ను ఉపయోగించి వెతకగా మార్చి 2025 లో ఈ ఘటన చోటు చేసుకుందని గమనించాం. ఈ ఘటన వెనుక ఎలాంటి మతపరమైన కోణం లేదని తెలుసుకున్నాం.
నివేదిక ప్రకారం, అలప్పుజలోని పోలీసులు 12 ఏళ్ల వయోలిన్ విద్వాంసురాలు గంగా శశిధరన్ కచేరీని సమయ పరిమితిని దాటినందున నిలిపివేయమని నిర్వాహకులను కోరారు. కొట్టంకులంగర ఆలయంలో గంగా ప్రదర్శన ఇస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. కచేరీలో అకస్మాత్తుగా పోలీసులు రావడంతో ఆమె షాక్‌కు గురైన వీడియో వైరల్ అయ్యింది. కచేరీని ఆపడానికి పోలీసులు రాత్రి 10 గంటల ప్రాంతంలో నిర్వాహకులను సంప్రదించారని నివేదిక స్పష్టం చేసింది. అదే వీడియోను మనోరమ న్యూస్ మార్చి 5న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
వైరల్ వీడియోలో ఉన్న అమ్మాయి గంగా శశిధరన్ గురించి అనేక కథనాలు మాకు లభించాయి. అయితే ఎక్కడా కూడా ఆమె కచేరీని ముస్లింలు ఆపారనే నివేదికలు మాకు లభించలేదు. అయితే పోలీసులు ఆ అమ్మాయి కచేరీని పూర్తీ చేయించాలని స్థానికులు డిమాండ్ చేసినట్లు నివేదికలు లభించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఉత్సవానికి వచ్చిన పెద్ద జనసమూహం ముందు గంగ వయోలిన్ కచేరీ కొనసాగుతోంది. ఆమె వయోలిన్ పై "మరుత్తమలై మామనియే మురుగయ్య" అనే తమిళ పాటను ప్లే చేస్తోంది. ఆమె వయోలిన్ వాయిస్తూ ఆనందిస్తుండగా, పోలీసులు వేదిక ముందుకు వచ్చి కచేరీని ఆపమని కోరారు. పోలీసులు అకస్మాత్తుగా అక్కడికి రావడంతో ఆ చిన్నారి భయపడుతున్నట్లు చూడవచ్చు. ఆ తర్వాత లైట్లు, సౌండ్‌ను ఆపివేశారని నివేదికలు తెలిపాయి.
వీడియోలో, ఒక వ్యక్తి "కనీసం పాటను పూర్తి చేయనిద్దాం. చిన్న పిల్ల" అని చెప్పడం కూడా వినవచ్చు. కచేరీ కొనసాగించాలని కూడా చాలా మంది డిమాండ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత పోలీసుల వైఖరి పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కొన్ని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా నివేదించాయి.
కాబట్టి, కేరళలో ఓ బాలిక వయోలిన్ వాయిస్తూ ఉంటే ముస్లింలు అడ్డుకున్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ అవుతున్న వాదనలు నిజం కాదు.
Claim : చిన్న పాప కచేరిని కేరళ లో ముస్లింలు ఆపేసిన దృశ్యం
Claimed By : Social Media Users
Claim Reviewed By : TeluguPost
Claim Source : Social Media
Fact Check : False
Next Story