Mon Dec 09 2024 09:32:07 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: అమెరికాలో బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రంతో ట్రైన్ ను ప్రారంభించలేదు
అమెరికాలో డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ బొమ్మతో ట్రైన్ సర్వీసులను
Claim :
అమెరికాలో డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ బొమ్మతో ట్రైన్ సర్వీసులను మొదలుపెట్టారు.Fact :
అలాంటి ట్రైన్ ఏదీ అమెరికాలో ప్రవేశ పెట్టలేదు. వైరల్ ఫోటోను మార్ఫింగ్ చేశారు
హైదరాబాద్ లో ఇటీవల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ట్యాంక్ బండ్ వద్ద ఆందోళనకారులు అంబేద్కర్ విగ్రహం చుట్టూ కొత్తగా నిర్మించిన గోడను కూల్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రధాన కార్యాలయం ముందు ఈ అంబేద్కర్ విగ్రహం ఉంటుంది.
జంక్షన్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన ఈ గోడకు సంబంధించి వివాదానికి దారితీసింది. వివిధ సమూహాలు నిరసనలకు దిగాయి . నిరసన ప్రదర్శనల కోసం ఆ ప్రాంతాన్ని ఉపయోగిస్తున్నారని, వాటిని అడ్డుకునే ప్రయత్నం అంటూ పలువురు నేతలు ఆరోపించారు. నారాయణగూడ, సైఫాబాద్ పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఉద్రిక్తత పెరగకుండా అడ్డుకున్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదంటూ జీహెచ్ఎంసీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. డాక్టర్ అంబేద్కర్‌ను గౌరవించే ప్రయత్నాల్లో భాగంగా నిర్మాణాన్ని చేపట్టామని, పార్లమెంట్ భవనం ప్రతిరూపంతో ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
అమెరికాలో డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ బొమ్మతో ట్రైన్ ను ఏర్పాటు చేశారంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. భారతదేశపు మొదటి న్యాయమంత్రికి అమెరికా నివాళులు అర్పించిందని, 'జై భీమ్' జెండాలతో, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ పోస్టర్‌తో కూడిన రైలు చిత్రాన్ని ఉంచిందని పలువురు భారతీయ సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు.
అమెరికాలో డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ బొమ్మతో ట్రైన్ ను ఏర్పాటు చేశారంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. భారతదేశపు మొదటి న్యాయమంత్రికి అమెరికా నివాళులు అర్పించిందని, 'జై భీమ్' జెండాలతో, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ పోస్టర్‌తో కూడిన రైలు చిత్రాన్ని ఉంచిందని పలువురు భారతీయ సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు.
అంబేద్కర్ కు పలు దేశాలలో అభిమానులు ఉన్నారు. బడుగు బలహీన వర్గాలు ఆయన్ను ఓ దేవుడిలా కొలుస్తారు. ఆయనకు సంబంధించి పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వాదనతో గతంలో కూడా పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని గుర్తించాం. అసలు చిత్రంలో ఉన్న రైలు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) రైలు అని ధృవీకరించాం.
వైరల్ అవుతున్న చిత్రాన్ని నిశితంగా పరిశీలించగా రైలు పై భాగంలో 1414 నంబర్ ఉన్నట్లు మేము కనుగొన్నాము. రివర్స్-ఇమేజ్ శోధనను ఉపయోగించి, మేము అనేక వార్తల వెబ్సైట్లు ప్రచురించిన అసలు ఫోటోను గుర్తించాము. అసలు చిత్రం ఢిల్లీ మెట్రో కోచ్‌ని చూపుతోంది. అంబేద్కర్‌కి సంబంధించిన ఎలాంటి పోస్టర్లు లేవు. India TV అసలైన చిత్రాన్ని డిసెంబర్ 24, 2016 నాటి నివేదికలో పోస్టు చేసిందని ధృవీకరించాం.
https://www.indiatvnews.com/
అంతేకాకుండా ఇతర న్యూస్ పోర్టల్స్ కూడా ఈ చిత్రాన్ని రెప్రజెంటేటివ్ ఇమేజ్ గా ప్రచురించాయి. ఈ ఫోటోను ఎవరు తీశారో అని కనుగొనడానికి ప్రయత్నించాం. సరైన లీడ్స్ దొరకలేదు.
సంబంధిత కీవర్డ్స్ సెర్చ్ చేయగా అమెరికాలో అంబేద్కర్ కు సంబంధించి ఇలాంటి కార్యక్రమం ఏదీ చేయలేదని తెలుసుకున్నాం. అంబేద్కర్ బొమ్మతో అమెరికాలో రైలును ప్రవేశపెట్టి ఉంటే అది ఖచ్చితంగా వార్తల్లో నిలిచి ఉండేది.
USA రైలుపై డాక్టర్ అంబేద్కర్ ఫోటోను ఉంచారనే వాదనను ధృవీకరించడానికి మాకు ఎటువంటి వార్తా నివేదికలు దొరకలేదు.
గతంలో పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఈ వాదనను ఖండిస్తూ కథనాలను ప్రచురించాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఇంకా, అంబేద్కర్ ఫోటో, "జై భీమ్" జెండాను డిజిటల్‌గా ఎడిట్ చేశారని ధృవీకరించగలిగాం.
అంబేద్కర్ చిత్ర పటాన్ని పలువురు ప్రముఖులు తమ ఇళ్లల్లో పెట్టుకున్నారనే వాదనతో కూడా పలు పోస్టులు గతంలో వైరల్ అయ్యాయి. ఫుట్‌బాల్ ప్లేయర్ రొనాల్డో ఇంటి గోడకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్ర ఫ్రేమ్ వేలాడుతూ ఉంచారంటూ గతంలో పోస్టులు పెట్టారు. అందులో ఎలాంటి నిజం లేదని తెలుగుపోస్టు ధృవీకరించింది.
https://www.telugupost.com/
అమెరికాలోని ట్రైన్ కు అంబేద్కర్ ఫోటో ఉంచారనే వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : అమెరికాలో డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ బొమ్మతో ట్రైన్ సర్వీసులను మొదలుపెట్టారు.
Claimed By : social media users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media
Fact Check : False
Next Story