Sat Dec 13 2025 19:19:47 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: పులి అమాంతం దాడి చేసి ఓ వ్యక్తిని నోటకరుచుకుని వెళ్తున్న వీడియో ఏఐ సృష్టి
భారతదేశంలో పులుల సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. అడవుల్లో ఎక్కడో మనుగడ సాగిస్తూ

Claim :
పులి ఓ వ్యక్తిపై దాడి చేసి నోట కరుచుకుని వెళ్ళిందిFact :
వైరల్ వీడియోను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించారు
భారతదేశంలో పులుల సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. అడవుల్లో ఎక్కడో మనుగడ సాగిస్తూ ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండేది కాదు. అయితే ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతానికి పులులు వస్తేనే సమస్యలు మొదలవుతాయి. పశువులను వేటాడటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు మనుషుల మీద కూడా దాడులకు తెగబడే అవకాశం ఉంది. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో పులులు ప్రజల మీద దాడులు చేస్తున్న సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు, ప్రభుత్వాలు అందుకు తగ్గ చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉన్నాయి.
చాలా సందర్భాలలో పులులు మనుషులకు దూరంగా ఉండాలనే ప్రయత్నిస్తూ ఉంటాయి. పులులు ప్రమాదవశాత్తు మనుషులపై దాడులు చేయడం, లేదా చంపడం చాలా అరుదు. సాధారణంగా పశువులను తీసుకెళ్లడానికి మనుషులు వెళ్ళినప్పుడో పులులు దాడులకు తెగబడుతూ ఉంటాయి. పులులు మ్యాన్ ఈటర్లుగా మారినప్పుడే చాలా సమస్యగా మారుతుంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ప్రజలను పులులు వెంటాడి మరీ తిన్న సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. మనిషిని తినడానికి దారితీసే పర్యావరణ, సామాజిక కారకాలు శాస్త్రీయంగా ఇంకా నిరూపించబడలేదు. కానీ విభిన్న కారణాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.
అయితే ఓ వ్యక్తిని పులి నోట కరుచుకుని పరిగెత్తుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని బ్రహ్మపురిలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో ఈ సంఘటన జరిగిందని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొంటున్నారు. CCTV నుండి వచ్చినట్లు కనిపించే ఈ ఫుటేజ్ తేదీ “31/10/2025” సమయం “6:42” అని చూపిస్తుంది.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ ఘటన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సృష్టి అని స్పష్టంగా తెలుస్తోంది.
మేము బ్రహ్మపురిలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ప్రాంతంలో అలాంటి ఘటన ఇటీవల చోటు చేసుకుందా అని తెలుసుకోడానికి మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ చేశాం. అయితే మాకు వైరల్ వీడియో లో ఉన్న తేదీలలో అలాంటి ఘటన చోటు చేసుకున్నట్లుగా ఎలాంటి నివేదికలు లభించలేదు.
అయితే సెప్టెంబర్ నెలలో బ్రహ్మపురి అటవీ డివిజన్ పరిధిలోని సాయిగటా అడవిలో పులి దాడిలో 32 ఏళ్ల పశువుల పెంపకందారుడు మృతి చెందాడు, ఇది పరిసర గ్రామాలలో భయాందోళనలకు దారితీసింది. లఖాపూర్ నివాసి అయిన సునీల్ అలియాస్ ప్రమోద్ బాల కృష్ణ రౌత్ ని మృతుడిగా గుర్తించారు. రౌత్ ప్రతిరోజు సమీపంలోని అడవిలో తన మందను మేత కోసం తీసుకెళ్లాడు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో, పశువులతో తిరిగి వస్తుండగా, పొదల్లో దాక్కున్న పులి అతనిపైకి దాడికి తెగబడింది. ఈ దాడిలో అతను అక్కడికక్కడే మరణించాడు.
అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ చూడొచ్చు.
ఇక వైరల్ అవుతున్న విజువల్స్ కింద నెటిజన్లు కూడా ఈ వీడియోపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
“ఇది పూర్తిగా నకిలీ వీడియో. AI ద్వారా సృష్టించారు. AI-జనరేటెడ్ వీడియోలు వన్యప్రాణుల వీడియోలు చాలా వరకూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.” అని అన్నారు.
వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించగా అందులో పులి పరిగెత్తిన విధానం, పులిని చూసిన వెంటనే ఆ వ్యక్తి ప్రవర్తించిన తీరులో చాలా తేడాలు ఉన్నాయి.
వైరల్ వీడియోకు జిల్లాతో ఎటువంటి సంబంధం లేదని బ్రహ్మపురికి చెందిన రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ (RFO) సచిన్ నారద్ స్పష్టం చేశారు. “ఈ వీడియో బ్రహ్మపురిది కాదు. ఇది ఎక్కడ రికార్డ్ చేశారో తెలియదు” అని ఆయన అన్నారు. "ఈ వీడియోను AI ద్వారా సృష్టించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు" అని నారద్ స్పష్టం చేశారు. పులులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అనవసరమైన భయాందోళనలను సృష్టించే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరారు ఆయన.
వైరల్ విజువల్స్ ఏఐ ద్వారా సృష్టించారా లేదా అని తెలుసుకోడానికి మేము ప్రయత్నించగా.. ఇది ఏఐ సృష్టి అంటూ పలు ఏఐ టూల్స్ తెలిపాయి. సైట్ ఇంజిన్ వైరల్ విజువల్స్ ను 78 శాతం ఏఐ సృష్టి అని తేల్చాయి. వాజ్ ఇట్ ఏఐ 94 శాతం ఏఐ సృష్టి అని తేల్చాయి.
అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇక్కడ చూడొచ్చు.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. పులి దాడి చేసిన వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.
Next Story